
హైదరాబాద్: ఒక్క రాత్రిలో సంచలనమైపోయాడు రషీద్ ఖాన్. ఆ మ్యాచ్ ప్రదర్శనతో అతనిని మాకిచ్చేయమంటూ అఫ్గనిస్తాన్‌ను భారత్ అభ్యర్థించింది. ఇక దిగ్గజ క్రికెటర్లు, సినిమా నటులు, సెలబ్రిటీలు, సగటు అభిమానులంతా కలిసి రషీద్ ఖాన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంలో యూసఫ్ పఠాన్ తన సహచరుడు రషీద్ ఖాన్ వీడియోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అందులో రషీద్ ఖాన్ బాలీవుడ్ హస్య నటుడు అలీ అస్గర్‌తో కలిసి నవ్వులు కురిపించాడు.
కపిల్ శర్మ కామెడీ నైట్స్‌గా పేరొందిన హాస్యం నేపథ్యంలో సాగే టీవీ కార్యక్రమంలో అలీ అస్గర్ కార్యక్రమానికి వెన్నెముకగా మారాడు. ప్రస్తుతం ఆ ప్రోగ్రాంకు హాజరైనటువంటి యూసఫ్ పఠాన్, రషీద్ ఖాన్ వీడియోలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు పఠాన్. ఇందులో భాగంగా రషీద్.. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ 'దిల్ వాలే దుల్హానియా' డైలాగులు చెప్పి కాస్త అలరించాడు.
ఆ తర్వాత రషీద్‌ను ఆటపట్టిస్తూ.. అలీ అస్గర్ ఇలా అన్నాడు. 'ఈ చేతులతోనే కదా స్పిన్ తిప్పేది. మరి నన్ను కూడా??' అనగా దానికి బదులుగా రషీద్.. 'ఈ చేతులతో బంతి స్పిన్ అవుతుంది. ఫుట్‌బాల్ కాదు' అని కౌంటర్ ఇచ్చాడు. వారి సంభాషణ హిందీలో ఇలా.. అస్గర్.. ఇన్ హాథోన్ సే బాల్ స్పిన్ కర్‌దేతే హో తో మై ఖ్యా ఛీజ్ హు.. రషీద్ ఖాన్.. ఇన్ హాథోన్ సే బాల్ స్పిన్ హోతా హై, ఫుట్‌బాల్ నహీ..
ముంబైలో జరిగే ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు నేడు తలపడనున్నాయి. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లే చివరికి ఫైనల్‌లో తలపడటం విశేషం. ఈ మ్యాచ్‌లో సత్తా చాటి మూడోసారి టైటిల్ గెలవాలని చెన్నై పట్టుదలగా ఉండగా.. చెన్నైపై నెగ్గి రెండోసారి కప్ గెలవాలని హైదరాబాద్ ఉవ్విళ్లూరుతోంది. సీజన్ మధ్యలో ఆటగాళ్లు గాయాలబారిన పడటం ఆందోళన కలిగించినా.. తుది జట్టు ఎంపిక కోసం ఆటగాళ్లు ఎప్పుడూ అందుబాటులో ఉన్నారని ధోని తెలిపాడు.