డివిలియర్స్‌ను ఎలా ఔట్ చేశానంటే!: భువీతో రషీద్ ఖాన్ (వీడియో)

హైదరాబాద్: ఆర్‌సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ను టెక్నిక్ బంతులతో బోల్తా కొట్టించానని సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ తెలిపాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి బెంగళూరు-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్వల్ప లక్ష్యాలను కాపాడుకుని అద్భుత విజయాలను సాధిస్తోన్న తీరు నిజంగా అద్భుతం. సోమవారం నాటి మ్యాచ్‌లో 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుని 141 పరుగులకే కట్టడి చేయడంలో ఆ జట్టు బౌలర్లు కీలకపాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ ప్రధాన పేసర్ భువీ, రషీద్‌ఖాన్‌లు సరదాగా ముచ్చటించారు.

సరైన ప్రదేశాల్లో బంతులు వేయడం వల్లే
ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ఐపీఎల్ వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ వికెట్‌పై రషీద్ స్పందిస్తూ 'డివిలియర్స్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ఆటగాడని ప్రతి ఒక్కరికి తెలుసు. దీంతో టాప్ స్పిన్, లెగ్ స్పిన్, గూగ్లీలను కలిపి సరైన ప్రదేశాల్లో బంతులేయాలని ప్రణాళిక రచించాను' అని అన్నాడు.

స్పిన్‌తో కూడిన గూగ్లీ బంతులను వేశా
'ఇందులో భాగంగానే డివిలియర్స్‌కి లెగ్ స్పిన్‌తో కూడిన గూగ్లీ బంతులను వేశాను. డివిలియర్స్ వికెట్ చాలా ముఖ్యమైన వికెట్.. సరైన ప్రదేశంలో బంతులు వేయడంతో డివిలియర్స్ క్లీన్ బౌల్డయ్యాడు. ఇది మాకు మరింత విశ్వాసాన్ని ఇచ్చింది' అని రషీద్ పేర్కొన్నాడు. రషీద్ ఖాన్ వేసిన గూగ్లీని అర్థం చేసుకోలేని డివిలియర్స్ బౌల్ట్ అయిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ ఫలితం గురించి ఆలోచించలేదు
ఇక, చివరి ఓవర్‌పై భువనేశ్వర్ స్పందిస్తూ 'నేను మ్యాచ్ ఫలితం గురించి ఆలోచించలేదు. సరైన ప్రదేశాల్లో బంతులేస్తే చివరి ఓవర్‌లో 12 పరుగులను అడ్డుకోవచ్చని నాకు బాగా తెలుసు. వైవిధ్యమైన బంతులేయడంపైనే పూర్తిగా దృష్టి సారించాను' అని భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు.

బెంగళూరు విజయానికి ఆఖరి ఓవర్‌లో 12 పరుగులు
బెంగళూరు విజయానికి ఆఖరి ఓవర్‌లో 12 పరుగులు కావల్సి ఉండగా.. భువనేశ్వర్ అద్భుత బౌలింగ్‌తో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక, ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలపై కూడా భువీ స్పందించాడు.
ఒత్తిడిలో ప్రత్యర్ధి ఆటగాళ్లు తప్పిదాలు
'సునాయసంగా చేధించే స్వల్ప లక్ష్యాలను ప్రత్యర్ధులు ఒత్తిడిలో తప్పిదాలు చేస్తున్నారు. మా విజయాల వెనుక ఉన్న రహస్యం వరుసగా వికెట్లు తీయడమే. స్వల్ప లక్ష్యాలను కాపాడుకోవడంలో ఇది చాలా ముఖ్యం. ఫీల్డింగ్ విభాగం సైతం అద్భుతంగా రాణిస్తోంది. ఈ విజయాలు సమిష్టి ప్రదర్శన వల్లే సాధ్యమయ్యాయి' అని భువీ వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications