ఐపీఎల్: చెన్నైతో మ్యాచ్, ఓడితే ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి రాజస్థాన్ ఔట్

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఆథిథ్యమిస్తోంది. ప్లే ఆఫ్ బరిలో నిలవాలంటే రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో తప్పగ గెలవాల్సిన పరిస్థితి.
వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో రాయల్స్ ప్లే ఆఫ్ అవకాశాలు తగ్గిపోయాయి. రాజస్థాన్ రాయల్స్‌కు ఈ మ్యాచ్ గెలుపు తప్పనిసరికాగా.. ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని తహతహలాడుతోంది.

ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే
చివరిసారిగా జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై రాజస్థాన్ 15 పరుగులతో గెలిచింది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌తో పాటు టోర్నీలో మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనే సత్తా చాటాలి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ ఎనిమిది పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

ఓడిపోతే ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయినట్టే
ఈ మ్యాచ్‌లో గనుక రాజస్థాన్ ఓడిపోతే ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయినట్టే. కాకపోతే ఈ మ్యాచ్ రాజస్థాన్ సొంత మైదానం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇప్పటివరకు జైపూర్‌లో నాలుగు మ్యాచ్‌లకు గాను మూడింటిలో రాజస్థాన్ గెలిచింది.

చెన్నైపై గెలవాలంటే
కెప్టెన్ రహానే, సంజు శాంసన్‌లు మరింత మెరుగ్గా ఆడాలి. మరోవైపు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్ప్, రాహుల్ త్రిపాఠి ఆశించిన మేరకు ఆడక పోవడంతో రాజస్థాన్ పరాజయం పాలవుతుంది. అయితే బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలవాలంటే బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ కలిసి కట్టుగా రాణించాలి.

14 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోన్న చెన్నై
మరోవైపు ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకునేందుకు చెన్నైకి మిగిలిన నాలుగు మ్యాచ్‌లు సరిపోతాయి. చెన్నై బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. పూణె వేదికగా బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్‌లో బౌలర్లు రాణించినప్పటికీ బౌలింగ్ ఆ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. చెన్నై పేస్ త్రయం లుంగి ఎంగిడి, డేవిడ్ విల్లే, శార్దూల్ మరింత బాధ్యతా యుతంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications