ఐపీఎల్ 2018: వివాదాల రాజస్థాన్ విరుచుకుపడుతుందా?, జట్టు షెడ్యూల్ ఇదే

హైదరాబాద్: వివాదాలతో నలిగిపోయి రెండేళ్ల నిషేదం ముగించుకుని మళ్లీ ఐపీఎల్ 11వ సీజన్‌తో ప్రజల ముందుకు రాబోతున్న జట్టు ఎలా రాణిస్తుందో చూడాల్సిందే. ఇటీవలే టాంపరింగ్ వివాదంతో మళ్లీ జట్టుకు లోటు ఏర్పడింది. కెప్టెన్‌గా నియమించిన స్టీవ్ స్మిత్‌ను జట్టు కోల్పోవడంతో మళ్లీ మార్పులు చేయకతప్పలేదు.

వివాదాల రాయల్ జట్టు:
కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాల్ టాంపరింగ్ ఆరోపణలతో ఐపీఎల్ మొత్తానికే దూరమయ్యాడు. మరోవైపు కీలక ఆటగాడు బెన్ స్టోక్స్ కూడా వివాదంలో చిక్కుకుని ఇంగ్లాండ్ జట్టుకు దూరమై ఇటీవలే మళ్లీ వచ్చాడు.

స్టీవ్ స్మిత్ స్థానంలో అజింకా రహానె:
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడింది. ఈ జట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ శిక్షకు గురైయ్యాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం అతన్ని ఐపీఎల్ నుంచి కూడా తప్పించింది. అతని స్థానంలో జట్టులోకి హెన్రిచ్ క్లాసెన్ చేరాడు. కాగా, జట్టుకు కొత్త కెప్టెన్‌గా రహానె బాధ్యతలు భుజాన వేసుకున్నాడు.

జోఫ్రా ఆర్చర్‌కు ఇదే తొలి మ్యాచ్:
జోఫ్రా ఆర్చర్‌ను రూ.7.2 కోట్లు పెట్టి కొనుక్కుంది రాయల్స్. అతను ఇప్పటిదాకా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ తరఫున ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. స్థిరంగా గంటకు 145 కి.మీ వేగంతో బంతిని విసిరే జోఫ్రా.. బిగ్‌బాష్ లీగ్‌లో 30 వికెట్లు పడగొట్టాడు. భారీ సిక్స్‌లు కొట్టగల సమర్థత అతనికుంది.

బౌలర్‌కు అత్యధిక ధర:
అందర్ని ఆశ్చర్యపరుస్తూ రూ.11.5 కోట్ల ధర పలికిన పేసర్ జయ్‌దేవ్ ఉనద్కత్‌పైనే ఇప్పుడు అందరి దృష్టీ నిలిచింది. గత సీజన్లో అతను 12 మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, ధవళ్ కులకర్ణి లాంటి వాళ్ల నుంచి అతనికి సహకారం అందాల్సి ఉంది.

వేలంలో అత్యధిక ధర వెచ్చించి:
ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ అత్యధికంగా రూ.12.5కోట్లు పలికాడు. పరుగులు సాధించగలడనే నమ్మకంతో ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్‌ను కొనుగోలు చేసిన జట్టు ఎంతవరకు సంతృప్తి చెందగలదో మ్యాచ్‌లో చూడాల్సిందే.
ఏప్రిల్ 7తో మొదలుకానున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు పూర్తి షెడ్యూల్ వివరాలిలా:
Monday, April 9
vs Sunrisers Hyderabad at 8 pm (2000 hrs), Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad
Wednesday, April 11
vs Delhi Daredevils at 8 pm (2000 hrs), Sawai Mansingh Stadium, Jaipur
Sunday, April 15
vs Royal Challengers Bangalore at 4 pm (1600 hrs), M Chinnaswamy Stadium, Bengaluru
Wednesday, April 18
vs Kolkata Knight Riders at 8 pm (2000 hrs), Sawai Mansingh Stadium, Jaipur
Friday, April 20
vs Chennai Super Kings at 8 pm (2000 hrs), MA Chidambaram Stadium, Chennai
Sunday, April 22
vs Mumbai Indians at 8 pm (2000 hrs), Sawai Mansingh Stadium, Jaipur
Sunday, April 29
vs Sunrisers Hyderabad at 4 pm (1600 hrs), Sawai Mansingh Stadium, Jaipur
Wednesday, May 2
vs Delhi Daredevils at 8 pm (2000 hrs), Feroz Shah Kotla Ground, Delhi
Sunday, May 6
vs Kings XI Punjab at 8 pm (2000 hrs), Holkar Cricket Stadium, Indore
Tuesday, May 8
vs Kings XI Punjab at 8 pm (2000 hrs), Sawai Mansingh Stadium, Jaipur
Friday, May 11
vs Chennai Super Kings at 8 pm (2000 hrs), Sawai Mansingh Stadium, Jaipur
Sunday, May 13
vs Mumbai Indians at 8 pm (2000 hrs), Wankhede Stadium, Mumbai
Tuesday, May 15
vs Kolkata Knight Riders at 8 pm (2000 hrs), Eden Gardens, Kolkata
Saturday, May 19
vs Royal Challengers Bangalore at 4 pm (1600 hrs), Sawai Mansingh Stadium, Jaipur
All matches will be broadcast on Star Sports 1/3 and streamed on Hotstar
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications