న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తప్పు ఎక్కడ జరిగిందంటే!: తొలి మ్యాచ్ ఓటమిపై కోహ్లీ

By Nageshwara Rao
IPL 2018: Quick dismissals of me and AB hurt RCB: Virat Kohli

హైదరాబాద్: 'మేం 15 పరుగులు తక్కువ చేశామని అనుకుంటున్నా' కోల్‌కతాతో మ్యాచ్ ముగిసిన అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్న మాటలివి. ఐపీఎల్ 11వ సీజన్‌లో కోహ్లీ నాయకత్వంలోని బెంగళూరు జట్టుకు శుభారంభం దక్కలేదు.

ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. బెంగళూరు ఆటగాళ్లలో డివిలియర్స్(44), మెకల్లమ్(43) రాణించారు.

కోల్‌కతాకు 177 పరుగుల విజయ లక్ష్యం

కోల్‌కతాకు 177 పరుగుల విజయ లక్ష్యం

అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కోల్‌కతా విజయంలో ఓపెనర్ సునీల్ నరైన్ (19 బంతుల్లో 50, 4ఫోర్లు, 5సిక్స్‌లు) కీలకపాత్ర పోషించాడు. ఆర్‌సీబీ బౌలర్లను ఊచకోత కోస్తూ ఈడెన్‌లో బౌండరీల వర్షం కురిపించాడు.

 ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ ఇలా

ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ ఇలా

దీంతో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలవడంపై మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తాము మరో 15 పరుగులు చేసి ఉండాల్సిందని.. కీలకమైన సమయాల్లో సరిగ్గా ఆడలేకపోయామని అభిప్రాయపడ్డాడు. 'మేం 15 పరుగులు తక్కువ చేశామని అనుకుంటున్నా. నేను చాలా డాట్‌ బాల్స్‌ ఆడా. మూమెంట్‌‌ను అందుకోలేకపోయా' అని కోహ్లీ అన్నాడు.

 మ్యాచ్‌ను 19వ ఓవర్‌ వరకూ తీసుకొచ్చాం

మ్యాచ్‌ను 19వ ఓవర్‌ వరకూ తీసుకొచ్చాం

'ఏబీ డివిలియర్స్‌, నేను వరుస బంతులకే వెనుదిరగడంతో ఆట కీలక మలుపు తిరిగింది. ఇది జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అనంతరం కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ సునీల్‌ నరైన్‌ మ్యాచ్‌ను తన వైపు తిప్పుకున్నాడు. ఈ పిచ్‌పై స్పిన్నర్లు బౌలింగ్‌ చేయడం కష్టమే. మేం మాత్రం బాగానే ఆడాం అనుకుంటున్నా. వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను 19వ ఓవర్‌ వరకూ తీసుకొచ్చాం' అని అన్నాడు.

 కార్తీక్, సునీల్ నరేన్‌పై కోహ్లీ ప్రశంసలు

కార్తీక్, సునీల్ నరేన్‌పై కోహ్లీ ప్రశంసలు

కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్, సునీల్ నరేన్ సుడిగాలి ఇన్నింగ్స్‌పై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసి సునీల్ నరేన్ జట్టుకు విజయాన్ని అందించాడని కోహ్లీ కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీయగా... సునీల్‌ నరేన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

Story first published: Monday, April 9, 2018, 14:52 [IST]
Other articles published on Apr 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X