అచ్చం ధోనిలా హెలికాప్టర్ షాట్ బాదిన రషీద్ ఖాన్ (వీడియో)

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై సన్‌రైజర్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయంలో ఆ జట్టు ఆటగాడు రషీద్ ఖాన్ కీలకపాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 18.1 ఓవర్లు ముగిసే సమయానికి 138/7తో నిలిచి తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించినప్పటికీ, చివర్లో వరుస సిక్సర్లతో రషీద్ ఖాన్ చెలరేగడంతో హైదరాబాద్ జట్టు కోల్‌కతా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

రషీద్ ఖాన్ బాదిన సిక్స్ గురించే చర్చ
అయితే, రషీద్ ఖాన్ బాదిన 4 సిక్సుల్లో ఒక సిక్స్ గురించి క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. అచ్చం ధోనిలాగా రషీద్ ఖాన్ కూడా హెలికాప్టర్ షాట్‌ను అవలీలగా బాదేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఆఖరి ఓవర్ నాలుగో బంతిని ఫుల్ లెంగ్త్ డెలివరీగా వేశాడు. దీనిని రషీద్ ఖాన్ స్వేర్ లెగ్ మీదుగా సిక్సర్‌గా కొట్టాడు.
ఆఫ్ స్టంప్ వైపుకు జరిగి హిట్ చేశాడు
బంతిని హెలికాప్టర్ షాట్ ఆడే క్రమంలో ఆఫ్ స్టంప్ వైపుకు జరిగి హిట్ చేయడంతో అది సిక్సర్‌గా వెళ్లింది. దీనిపై కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని కొట్టే హెలికాప్టర్‌తో పోల్చాడు. మరొకవైపు సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానిస్తూ షాట్ ఆఫ్ ఇన్నింగ్స్‌గా అభివర్ణించాడు.

10 బంతుల్లో 34 పరుగులు చేసిన రషీద్ ఖాన్
ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు సాయంతో 34 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆదివారం ముంబైలో ఫైనల్
దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరింది. ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇది రెండో ఐపీఎల్ ఫైనల్స్ కావడం విశేషం. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రషీద్ ఖాన్‌కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications