Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రషీద్‌ గూగ్లీని అంచనా వేయడంలో విఫలమై వికెట్ సమర్పించుకున్న ధోని (వీడియో)

Rashid Khan gets Ms Dhoni wicket

హైదరాబాద్: ప్లేఆఫ్‌లో భాగంగా ముంబైలోని వాంఖడె వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బౌలర్లు జోరు కొనసాగిస్తున్నారు. సన్‌రైజర్స్ బౌలర్ల దెబ్బకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 39 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకి ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్‌లో వాట్సన్(0) కీపర్ గోస్వామికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

అనంతరం ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ బౌలింగ్‌కి వచ్చిన సిద్ధార్థ కౌల్ వరుస బంతుల్లో సురేశ్ రైనా (22), అంబటి రాయుడు (0)లను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఫ్ స్టంప్‌పైకి వెళ్లి ఆడేందుకు ప్రయత్నించే క్రమంలో సురేశ్ రైనా బౌల్డ్ అవ్వగా, యార్కర్ బంతిని అర్థం చేసుకోలేక రాయుడు(0) ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెనుదిరిగాడు.

1
43467

దీంతో చెన్నై 24 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మహేంద్రసింగ్ ధోని (9) ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ వేసిన గూగ్లీని అంచనా వేయడంలో విఫలమైన వికెట్‌ను సమర్పించుకున్నాడు.

కాగా, ప్లేఆఫ్‌లో భాగంగా ముంబైలోని వాంఖడె వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో ఫా డుప్లెసిస్(42 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సులు)తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

చివరి మూడు ఓవర్లలో చెన్నై విజయానికి 43 పరుగులు అవసరమైన తరుణంలో డుప్లెసిస్‌ చెలరేగాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే విజయాని కావాల్సిన స్కోరును తగ్గించుకుంటూ వచ్చాడు. ఆఖరి ఓవర్‌లో ఆరు పరుగులు కావాల్సి ఉండగా, డుప్లెసిస్‌ తొలి బంతినే సిక్స్‌ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు.

అతనికి జతగా శార్దూల్‌ ఠాకూర్‌(15 నాటౌట్‌) చక్కటి సహకారం అందించడంతో చెన్నై ఐదు బంతులుండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్... ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడనుంది. శుక్రవారం (మే 25)న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.

సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ తలో రెండు వికెట్లు తీసుకోగా భువీకి ఒక వికెట్ తీసుకున్నాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది.

Story first published: Tuesday, May 22, 2018, 23:13 [IST]
Other articles published on May 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+