
సరిగ్గా 31రోజులు పూర్తి అయినా:
ఐపీఎల్ 11వ సీజన్ మొదలై మే7వ తేదీ బెంగళూరు, హైదరాబాద్ మ్యాచ్‌లు జరిగేటప్పటికీ సరిగ్గా 31రోజులు పూర్తి అయింది. ఈ మ్యాచ్‌లో కేవలం ఐదు పరుగుల తేడాతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ గెలిచింది హైదరాబాద్. అద్వితీయమైన బౌలింగ్ ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ ప్రధాన వికెట్ అయిన కోహ్లీని 30 బంతుల్లోనే పెవిలియన్‌కు పంపారు.

తక్కువ టార్గెట్‌నే నిర్దేశించి
సీజన్ తొలి మ్యాచ్ నుంచే బౌలింగ్‌తో కట్టిపడేస్తున్న హైదరాబాద్ బౌలర్లు కోహ్లీసేనపై అదే అస్త్రాన్ని వాడారు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసి తక్కువ టార్గెట్‌నే నిర్దేశించినా ఎట్టకేలకు విజయాన్ని చేజిక్కుంచుకుంది. అయితే చేధనకు దిగిన కోహ్లీ జట్టు ఒకానొక దశలో బాగానే రాణిస్తుందనే ఆశలు రేపి అనుకోకుండా కోహ్లీ, డివిలియర్స్ వికెట్లు చేజారడంతో గెలుపుపై సందేహఛాయలు అలుముకున్నాయి.

తక్కువ స్కోరుతోనే అనేక సార్లు మ్యాచ్‌ను గెలిచి:
ఈ సీజన్ మొత్తంలో అత్యంత తక్కువ స్కోరు చేసి కూడా సన్‌రైజర్స్ అనేక సార్లు మ్యాచ్‌ను గెలిచింది. హైదరాబాద్ జట్టులో ఉన్న షకీబ్ అల్ హసన్ 2 వికెట్లు తీయగలిగాడు. భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్‌ను తీసి మ్యాచ్‌ను గెలిపించారు.

10 మ్యాచ్‌లలో ఏడింటిలో ఓడి -0.361:
మ్యాచ్ ఆరంభానికి ముందే టాప్ స్థానంలో ఉన్న హైదరాబాద్.. బెంగళూరుతో తలపడి గెలవడంతో అదే స్థానంలో కొనసాగుతోంది. ఆడిన 10 మ్యాచ్‌లలో ఏడింటిలో ఓడి -0.361 పాయింట్లతో ఉంది. ఢిల్లీ జట్టు ఇంతకంటే తక్కువ స్కోరు -0.411తో ఉండటంతో దాని కంటే మెరుగ్గానే ఉంది. ఇక ఆఖరి స్థానంలో కొనసాగుతోన్న రాజస్థాన్ రాయల్స్ 9మ్యాచ్ లు మాత్రమే ఆడి బెంగళూరు, ఢిల్లీ జట్ల కంటే తక్కువ స్కోరుతోనే ఆఖరి స్థానానికి పడిపోయింది.


Click it and Unblock the Notifications












