For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్, చెన్నైలతో పాటు ప్లేఆఫ్‌కు వెళ్లనున్న 2 జట్లు ఇవే

IPL 2018 Playoff matches from four franchises

హైదరాబాద్: ఐపీఎల్ సమరం సగానికి పైగా పూర్తయింది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ దశకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే, ఇంకా రెండు జట్లు మాత్రమే ప్లేఆఫ్ కు వెళ్లేందుకు అర్హత పొందాల్సి ఉంది. ఢిల్లీ ప్లేఆఫ్‌కు చేరే అవకాశాన్ని దాదాపుగా కోల్పోయింది. ఇక.. ఏదో అద్భుతం జరిగితే తప్ప రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడం కష్టమే.

పాయింట్లు, నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా అత్యుత్తమ ప్రదర్శన చేసిన నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంటాయి. మరి ఇలాంటి దశలో మిగిలిన ఆ రెండు జట్లు ఏవో క్లుప్తంగా విశ్లేషిస్తే..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌:

సన్‌రైజర్స్ హైదరాబాద్‌:

బౌలింగే‌ ప్రధాన బలంగా బరిలోకి దిగుతోన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లాడి 9 విజయాలు సాధించింది. ఈ ఏడాది ఐపీఎల్‌‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. లీగ్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాలి. ఒకవేళ వీటిల్లో ఓడిపోయినా టాప్‌-4లో ఉండటం ఖాయం.

చెన్నై సూపర్‌కింగ్స్‌:

చెన్నై సూపర్‌కింగ్స్‌:

రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన చెన్నై 8 విజయాలతో 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న రెండో జట్టు ఇది.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌:

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌:

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్‌ మూడో స్థానంలో ఉంది. లీగ్‌ దశలో ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాలి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఏ ఒక్క మ్యాచ్‌ గెలిచినా పంజాబ్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. కానీ, రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆఫ్స్‌లో స్థానంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఏ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినా పంజాబ్ టాప్‌-4లో చోటు దక్కించుకుంటుందో లేదో చెప్పలేం.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌:

కోల్‌కతా నైట్‌రైడర్స్‌:

లీగ్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు మంచి నెట్‌ రన్‌రేట్‌ సాధిస్తేనే కోల్‌కతా ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోగలుగుతుంది. లేదంటే ముంబై ఇండియన్స్‌ నుంచి కోల్‌కతాకు చుక్కెదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముంబై రనరేట్‌ కోల్‌కతా కంటే మెరుగ్గా ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా భారీ తేడాతో గెలిస్తే ప్లేఆఫ్స్‌ చేరుకునే అవకాశాలు మెరుగుపడతాయి.

రాజస్థాన్‌ రాయల్స్‌:

రాజస్థాన్‌ రాయల్స్‌:

ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్‌ ఒకే ఒక్క విజయం సాధిస్తే చాలు ప్లేఆఫ్స్‌ చేరుకుంటుంది. టోర్నీలో భాగంగా తన తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్‌... కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఆదివారం ముంబై ఇండియన్స్‌పై విజయంతో రాజస్థాన్‌ టాప్‌-4లో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ముంబై ఇండియన్స్‌

ముంబై ఇండియన్స్‌

మూడుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడిన ఏకైక జట్టు ముంబై ఇండియన్స్‌. అలాంటి ముంబై జట్టు ఈ సీజన్‌లో నిరాశ పరిచింది. 12 మ్యాచ్‌ల్లో 5 మాత్రమే గెలిచింది. ఆదివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో ఈ జట్టుకు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకునే అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం టాప్‌-4లో ఉన్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాలి. ఈ మూడింట్లో రెండు మ్యాచ్‌లు ఓడిపోతే ముంబై ప్లేఆఫ్‌ చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

‘ఈ ఏడాది ఐపీఎల్‌ ట్రోఫీ మా సొంతం' అంటూ బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఘోర పరాభవాలను చవి చూసింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు ఇంకా 3 మ్యాచ్‌లు ఆడాలి. ఈ మ్యాచ్‌ల్లో గెలిచినా ఏదో అద్భుతం జరిగితే తప్ప కోహ్లీ సేన ప్లేఆఫ్‌లో చోటు దక్కించుకోలేదు.

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌

ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటికే దిల్లీ డేర్‌డెవిల్స్‌ కథ ముగిసింది. ఆడిన 12 మ్యాచ్‌ల్లో మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇంకా ఆడాల్సింది రెండు మ్యాచ్‌లు. వాటిల్లో గెలిచినా ప్లేఆఫ్‌కి చేరుకోలేదు.

Story first published: Monday, May 14, 2018, 19:03 [IST]
Other articles published on May 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+