
హైదరాబాద్: ఐపీఎల్ 2018(ఇండియన్ ప్రీమియర్ లీగ్ ) ఆరంభానికి ముందే ఆసక్తిరేపుతోంది. అంతర్జాతీయ జట్టులో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో భారత్‌లో క్రికెట్ క్రేజ్ మరింత ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-10కి సంబంధించి జనవరి 27, 28వ తేదీలు జరగనున్నాయి. ఈ వేలంలో చాలా మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొంటున్నారు.
గరిష్టంగా రూ.80 కోట్ల వరకు ఖర్చుపెట్టుకునే వీలున్న ఫ్రాంఛైజీలు ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. ఐతే ఇంతకుముందు వరకు వేలం పాటను మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేసేవాళ్లు. కానీ, ఇప్పటి నుంచి వేలానికి ముందు జరిగే ఈ అట్టిపెట్టుకునే కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయాలని కొత్త ప్రచారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ నిర్ణయించింది.
ఐపీఎల్ పాలకవర్గం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ అట్టిపెట్టుకునే కార్యక్రమం గురువారం ముంబైలో జరగనుంది. ఈ లెక్కన ప్రతి జట్టు ముఖ్యమైన ఆటగాళ్లను కొనసాగించుకోవచ్చు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ గౌతమ్ గంభీర్‌ను అట్టిపెట్టుకోకుండా వేలానికి వదిలేయాలని చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై గంభీర్ స్పందించాడు. 'ఈ వార్తలు వినగానే ఆశ్యర్యానికి గురయ్యాను. ఇప్పటి వరకు నైట్‌రైడర్స్ యాజమాన్యం నాతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. భవిష్యత్తులో ఆ జట్టులో కొనసాగుతానో లేదో నాకు తెలియదు' అని అన్నాడు.
మరో ఫ్రాంఛైజీ తరఫున ఆడేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను' అని గంభీర్ అన్నాడు. గంభీర్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే మీడియాలో వచ్చిన వార్తలు నిజమే అనిపిస్తోంది. కాగా, గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రెండు సార్లు ఐపీఎల్ విజేతగా అవతరించింది. గంభీర్ కూడా వేలానికి అందుబాటులో ఉంటాడని మిగతా జట్లు కొనాలనే ఆతురతలో ఉన్నట్లు కనిపిస్తుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.