రాహుల్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యానంటూ.. పాకిస్థానీ యాంకర్ ట్వీట్

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం రాజస్థాన్, పంజాబ్ జట్లు తలపడ్డాయి. సొంతగడ్డపై జరిగిన పోటీలో రాజస్థాన్ గెలిచి ప్లేఆఫ్ ఆశలు ఆవిరి అవకుండా నిలుపుకోగలిగింది. పంజాబ్ జట్టులో బ్యాట్స్‌మెన్‌లు పెద్దగా రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. 159పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు అతనికి చక్కని భాగస్వామి దొరకలేదు.

70బంతుల్లోనే 95పరుగులు
దీంతో ఒంటరి పోరాటం చేసినా కేఎల్ రాహుల్ 70బంతుల్లోనే 95పరుగులు చేశాడు. రాహుల్ ధాటికి అతని ఖాతాలోకి ఆరంజ్ క్యాప్ వచ్చి చేరింది. ఇంతకుముందు అంబటి రాయుడు 423పరుగులతో ఆరంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. మంగళవారం ఆడిన మ్యాచ్‌లో మెరుపుల్లాంటి షాట్‌లతో అద్భుతమైన ప్రదర్శన చేసిన రాహుల్‌ను పాకిస్థానీ యాంకర్ జైనబ్ అబ్బాస్ ఆకర్షితురాలైంది.

మంచి టైమింగ్‌తో షాట్‌లు
దీంతో ఆమె తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా రాహుల్ ను పొగిడేస్తూ.. ట్వీట్ చేసింది. రాహుల్ నీ ప్రదర్శన చాలా బాగుంది. మంచి టైమింగ్‌తో షాట్‌లు కొడుతున్నావ్. చూడడం చాలా గ్రేట్‌గా అనిపిస్తోంది.

14బంతుల్లోనే హాఫ్ సెంచరీ
రాహుల్ పంజాబ్ జట్టుతో ఆదివారం హోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 84పరుగులు చేసి జట్టుకు విజయాన్ని చేకూర్చాడు. రాహుల్ పరుగుల వరద ఆ జట్టుకు ప్రేరణగా నిలుస్తుంది. లీగ్ ఆరంభంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్ లో రాహుల్ కేవలం 14బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో అప్పటి వరకూ ఫాస్టెస్ హాఫ్ సెంచరీ చేసిన జాబితాలో ఉన్న సునీల్ నరైన్, యూసఫ్ పఠాన్‌ల రికార్డులను బద్దలుకొట్టాడు.

మూడు వరుస పరాజయాల అనంతరం ఓ విజయంతో
ఎట్టకేలకు రాజస్థాన్ రాయల్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. మూడు వరుస పరాజయాల అనంతరం ఓ విజయంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. జోస్ బట్లర్ సూపర్ బ్యాటింగ్, గౌతమ్, సోధిల చక్కని బౌలింగ్‌తో.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను రాజస్థాన్ ఓడించింది. టోర్నీలో నాలుగో విజయం సాధించిన రహానెసేన.. పాయింట్ట పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకింది. పంజాబ్‌కు ఇది నాలుగో ఓటమి. కేఎల్ రాహుల్ 95 పరుగులతో అజేయంగా నిలిచినా.. ఆ జట్టును గెలిపించలేకపోయాడు. రాహుల్ కాకుండా పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఒక్క స్టాయినిస్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications