న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: ఒకటో నంబర్‌ జెర్సీ ఎంచుకోవడానికి కారణం ఇదీ!

By Nageshwara Rao
IPL 2018: Nepals Sandeep Lamichhane receives Delhi Daredevils jersey

హైదరాబాద్: సందీప్ లమిచానె... ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో మార్మోగిన పేరు. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కాంట్రాక్టు దక్కించుకున్న తొలి నేపాల్ ఆటగాడు క్రికెటర్ కాబట్టి. వేలంలో లమిచానెను అతడి కనీస ధర రూ. 20లక్షలకే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సొంతం చేసుకుంది.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

ఇటీవలే ఢిల్లీ ఫ్రాంఛైజీ కెప్టెన్ గౌతమ్‌ గంభీర్‌‌ ఆధ్వర్యంలో నూతన జెర్సీని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సందీప్‌ లమిచానె డేర్‌డెవిల్స్‌ జెర్సీని నేపాల్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు కేశవ్‌ బిస్తా నుంచి అందుకున్నాడు. ఈ సందర్భంగా లమిచానె ఒకటో నెంబర్ జెర్సీని ఎంచుకున్నాడు.

సాధారణంగా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో ఏ నంబర్‌ జెర్సీ ధరించి ఆడుతున్నారో అదే నంబర్‌ జెర్సీతో ఐపీఎల్‌ కూడా ఆడటం మనం చూశాం. నేపాల్ జట్టుకు ఆడే సమయంలో సందీప్ 25వ నెంబర్ జెర్సీని ధరిస్తాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం ఒకటో నంబర్‌ జెర్సీని ఎంచుకున్నాడు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

అయితే తాను ఒకటో నెంబర్ జెర్సీని ఎంచుకోవడంపై సందీప లమిచానె వివరణ ఇచ్చాడు. '25వ నంబర్‌ను ఇప్పటికే సీనియర్‌ ఆటగాళ్లకు కేటాయించారు. వారి నుంచి తీసుకోవడం సరికాదు. అనారోగ్యానికి గురై చనిపోయిన నా మేనల్లుడి జన్మదినం జనవరి 1. అందుకే ఒకటో నంబర్‌ జెర్సీ ఎంచుకున్నా. అంతేకాదు ఎల్లప్పుడూ నంబర్‌వన్‌గా ఉండాలని కోరుకుంటా' అని సందీప్‌ పేర్కొన్నాడు.

జింబాబ్వే వేదికగా జరుగుతోన్న వరల్డ్ కప్ క్వాలిఫయిర్ టోర్నీ నుంచి స్వదేశానికి చేరుకున్న సందీప్ లమిచానె ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఐపీఎల్ 11వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ తన తొలి మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్‌ 8న మొహాలీలో జరగనుంది.

Story first published: Friday, March 23, 2018, 16:01 [IST]
Other articles published on Mar 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X