ఐపీఎల్ ఆట వేళల్లో మార్పులు: ఆకాశ్ అంబానీ అసంతృప్తి
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ పదేళ్ల ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటిగా నిలిచింది. ఈ పదేళ్ల సీజన్‌లో ముంబై ఇండియన్స మూడు సార్లు ఐపీఎల్ విజేతగా అవతరించగా... చెన్నై, కోల్‌కతా జట్లు చెరో రెండు సార్లు విజేతగా నిలిచాయి.

కృనాల్ పాండ్యాకు రూ. 8.8 కోట్లు
బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ లోకల్ బాయ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వేలంలో కొనుగోలు చేసింది. వేలంలో ముంబై ఇండియన్స్ అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసిన ఆటగాడిగా కృనాల్ పాండ్యా నిలిచాడు. పాండ్యాను ముంబై ఇండియన్స్ రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా రూ. 8.8 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది.

ఆకాశ్ అంబానీ అసంతృప్తి
వేలం అనంతరం ముంబై ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ ఐపీఎల్ 11వ సీజన్ ఆట వేళల మార్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ ప్రతిపాదించిన వేళల వల్ల ఆదాయంతోపాటు వ్యూయర్ షిప్ కూడా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.

స్టార్ స్పోర్ట్స్ ప్రతిపాదనకు గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం
వేలానికి ముందు ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ ఆట వేళల్లో కొన్ని మార్పులు ప్రతిపాదించింది. సాయంత్రం మ్యాచ్‌ను 7 గంటలకు, మధ్యాహ్నం మ్యాచ్‌ను 5:30 గంటలకు నిర్వహించాలని ప్రతిపాదించింది. స్టార్ స్పోర్ట్స్ ప్రతిపాదనను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా అంగీకరించింది.

రెండో మ్యాచ్‌ను ఏడు గంటలకు నిర్వహించడం కష్టం
అంతకముందు ఈ మ్యాచ్‌లు సాయంత్రం 4 గంటలు, రాత్రి 8 గంటలకు జరిగేవి. అయితే, స్టార్ స్పోర్ట్ కొత్త ప్రతిపాదనను ఐపీఎల్ ప్రాంఛైజీలు మాత్రం అంగీకరించడం లేదు. ఐపీఎల్ ఆట వేళల్లో మార్పులపై ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ 'ముంబై ప్రజలు సాయంత్రం 6:30 - 7 గంటల వరకు విధుల్లోనే ఉంటారని, కాబట్టి రెండో మ్యాచ్‌ను ఏడు గంటలకు నిర్వహించడం కష్టమని అన్నాడు.

వెన్యూతో పాటు వ్యూయర్‌షిప్‌పైనా తీవ్ర ప్రభావం
అంతేకాదు రెవెన్యూతో పాటు వ్యూయర్‌షిప్‌పైనా తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పుకొచ్చాడు. కాబట్టి స్టార్ స్పోర్ట్స్ ప్రతిపాదించిన వేళలను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపాడు. అన్ని ప్రాంఛైజీలు కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉండటంతో ఆట వేళల మార్పుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications