ధోనీ.. అంతా తన వాళ్లనే చెన్నై జట్టులోకి చేరుస్తున్నాడా..? ఇప్పుడు ఫీల్డింగ్ కోచ్‌ కూడా..

Posted By:
IPL 2018: MS Dhonis First-Class captain appointed CSKs fielding coach

హైదరాబాద్: ఐపీఎల్‌లో రెండేళ్ల నిషేధం అనంతరం పునరాగమనం చేస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త శైలిని అనుసరిస్తోంది. ఇప్పటికే జట్టులో దాదాపు అందరూ 30ప్లస్ వయస్సున్నవారిని తీసుకుని ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పుడు దాంతోపాటు కోచ్‌ల విషయంలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తోంది.

దీనికి తగ్గట్టుగానే స్టార్ ప్లేయర్లను వేలంలో సొంతం చేసుకున్న చెన్నై.. వారికి మార్గనిర్దేశనం చేయడానికి కోచింగ్ సిబ్బందిని సైతం భారీగానే నియమించుకుంటుంది. ధోనీ కెప్టెన్సీలో కొనసాగుతున్న చెన్నై జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా మైకెల్ హస్సీ, భారత మాజీ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు ప్రస్తుతానికి ఖాళీగా ఉండడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే దిశగా చెన్నై జట్టు ధోనీ ఫస్ట్‌క్టాస్ క్రికెట్ కెప్టెన్ రాజీవ్ కుమార్‌కు నియమించింది. ఇంతకుముందు ఇదే స్థానంలో ఉన్న స్టీవ్ రిక్సన్‌ను తొలగించి రాజీవ్‌ను నియమించనున్నారు. గత రంజీ సీజన్‌లో ఝార్ఖండ్ జట్టుకు అతడు కోచ్‌గా కూడా పనిచేశాడు.

కొన్నిరోజుల పాటు ధోనీ, రాజీవ్ కలిసి దేశవాళీ టోర్నీల్లో బిహార్, ఝార్ఖండ్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఇక కొత్త కోచ్ బుధవారమే బాధ్యతలు చేపట్టి జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో ఆటగాళ్లకు సలహాలు కూడా ఇచ్చాడు. ఐపీఎల్-2018 సీజన్ తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, March 30, 2018, 15:15 [IST]
Other articles published on Mar 30, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి