
బీసీసీఐ-ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం
మంగళవారం ముంబైలో బీసీసీఐ-ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రిటెన్షన్ పాలసీతోపాటు జీతాలపై పరిమితిపై చర్చించారు. ఆటగాళ్ల రిటెన్షన్ విధానం పట్ల కోల్‌కతా, రాజస్థాన్ జట్లు విముఖంగా ఉండగా... ముంబై ఇండియన్స్, చెన్నై జట్లు మాత్రం రిటెన్షన్ విధానానికి అనుకూలంగా ఉన్నాయి. కనీసం ఇద్దరు ప్లేయర్లను అట్టిపెట్టుకోవాలని పంజాబ్ ఫ్రాంచైజీ సూచించగా, మూడు నుంచి ఐదుగురు ఉండాల్సిందేనని ఇతర ఫ్రాంచైజీలు స్పష్టం చేశాయి.

ధోని తిరిగి చేరడం అనుమానమే?
దీంతో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌లో ధోని తిరిగి చేరడం అనుమానంగా కనిపిస్తోంది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండేళ్లపాటు ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఆయా జట్లకు చెందిన ఆటగాళ్లను రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్, గుజరాత్ లయన్స్ ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. చెన్నై, రాజస్ధాన్ జట్లపై విధించిన నిషేధం ముగియడంతో తిరిగి వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో తిరిగి ప్రవేశించాయి.

చెన్నై మాత్రం నలుగుర్ని తనతోనే ఉంచుకోవాలని
దీంతో ముంబై జట్టు ఐదారుగురు ఆటగాళ్లను తనతోనే అట్టిపెట్టుకోవాలని భావిస్తోండగా... చెన్నై మాత్రం నలుగుర్ని తనతోనే ఉంచుకోవాలని భావిస్తోంది. ఆటగాళ్ల రిటెన్సన్ పాలసీ గురించి మరో పదిహేను రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే 11వ సీజన్‌లో కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నట్లు తెలిసింది. యూరోపియన్ ఫుట్ బాల్ లీగ్ మాదిరి ఆటగాళ్లు జట్టును మార్చుకునే ‘మిడ్ డే టోర్నమెంట్ ప్లేయర్ ట్రాన్స్‌ఫర్' నిబంధనను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 11వ సీజన్‌లో కొత్త నిబంధన
ఈ నిబంధన ప్రకారం జట్టులోని ఆటగాడికి ఆ సీజన్‌లో జరిగే తొలి ఏడు మ్యాచుల్లో ప్రాంఛైజీ అవకాశం ఇవ్వకుంటే నిరభ్యంతరంగా మిగతా జట్లలోకి వెళ్లొచ్చు. అయితే ఈ నిబంధన ఆటగాడి పట్ల మిగతా ప్రాంచైజీలు ఆసక్తిని కనబరిచినప్పుడే సాధ్యమవుతుంది. ఈ నిబంధనను వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో అమలు చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ యోచిస్తున్నట్లు జాతీయ మీడియాకు చెందిన ఓ పత్రికలో వచ్చింది.


Click it and Unblock the Notifications












