Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంతా బౌలర్ల వల్లే!: రాజస్థాన్ చేతిలో ఓటమిపై ధోని తీవ్ర ఆగ్రహం

IPL 2018: MS Dhoni lambasts bowlers for poor execution following CSKs defeat against RR

హైదరాబాద్: బౌలింగ్‌కు సంబంధించి వ్యూహాలు రచించినా, అమలు చేయడంలో బౌలర్లు విఫమయ్యారని అందుకే ఓడిపోయామని చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ 'కచ్చితంగా బౌలర్ల వల్లే ఓడిపోయాం. సరైన లెన్త్‌లో బౌలింగ్‌ చేస్తే ఫలితం దక్కేది. కానీ అలా జరగలేదు. ఫలానా ఏరియాలోనే బంతులు విసరాలని చెబితే మా వాళ్లు వేరొకటి చేశారు. వ్యూహాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాం. నిజానికి 176 స్కోరు అనేది విజయం సాధించతగ్గదే. విజయాన్ని మా నుంచి దూరం చేసింది బౌలర్లే' అని అన్నాడు.

 ఆఖరి ఓవర్లో ఆగ్రహానికి గురైన ధోని

ఆఖరి ఓవర్లో ఆగ్రహానికి గురైన ధోని

మిస్టర్ కూల్‌గా పేరున్న మహేంద్ర సింగ్ ధోని రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో కాస్త ఆగ్రహానికి గురయ్యాడు. 19వ ఓవర్లో డేవిడ్ విల్లీ 2 సిక్స్‌లు ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశాడు. ఇక, ఆఖరి ఓవర్లో బట్లర్‌ షాట్‌ కొట్టగా బంతి చాలాసేపు గాల్లోనే నిలిచింది. అయినా ఫీల్డర్లెవరూ బంతిని అందుకునే ప్రయత్నం చేయలేదు.

 తొలుత బ్యాటింగ్‌కు దిగి తప్పు చేశారా?

తొలుత బ్యాటింగ్‌కు దిగి తప్పు చేశారా?

ఇక, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగి తప్పు చేశారా? అని కామెంటేటర్‌ అని ప్రశ్నకు ధోని 'మాకొక ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఉంది. ఆ కమిటీ నిర్ణయం మేరకు, కోచ్‌ సూచనల ప్రకారం తొలుత బ్యాటింగ్‌ చేస్తాం' అని చెప్పాడు. ఇదిలా ఉంటే

టోర్నీలో వరుసగా రెండో విజయంతో రాజస్థాన్ రాయల్స్‌... ఐపీఎల్‌ ఫ్లే ఆఫ్‌ రేసును రసవత్తరంగా మార్చింది.

 4 వికెట్ల తేడాతో విజయం రాజస్థాన్‌పై చెన్నై విజయం

4 వికెట్ల తేడాతో విజయం రాజస్థాన్‌పై చెన్నై విజయం

శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ప్లే ఆఫ్స్ రేసులో ఆశలను సజీవంగా ఉంచుకుంది. చెన్నై నిర్ధేశించిన 177పరుగుల లక్ష్య ఛేదనను రాజస్థాన్ రాయల్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి రాజస్థాన్ రాయల్స్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది.

జోస్ బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

జోస్ బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

రాజస్తాన్‌ ఆటగాళ్లలో జోస్‌ బట్లర్‌ (95 నాటౌట్‌; 60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు సంజూ శాంసన్‌(21), స్టువర్ట్‌ బిన్నీ(22)లు ఫర్వాలేదనిపించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు జోస్ బట్లర్‌కు లభించింది. తాజా విజయంతో రాజస్థాన్ రాయల్స్ 10 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకింది. చెన్నై బౌలర్లలో డేవిడ్ విల్లీ, భజ్జీ, జడేజా, శార్దుల్ ఠాకూర్, డ్వేన్ బ్రావో తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు చెన్నై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

Story first published: Saturday, May 12, 2018, 10:56 [IST]
Other articles published on May 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+