న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాజస్థాన్‌తో మ్యాచ్: ధోని అనుమానమే!, పూణెకు చేరిన విజిల్‌పోడు ఎక్స్‌ప్రెస్‌

By Nageshwara Rao
IPL 2018: MS Dhoni doubtful for Chennai Super Kings clash against Rajasthan Royals

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం చెన్నై-రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడనున్న తొలి మ్యాచ్ ఇది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లంతా శుక్రవారం ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొన్నారు. అయితే, కెప్టెన్ ధోని మాత్రం ఈ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదు.

దీంతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు ధోని అందుబాటులో ఉండడేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయంపై జట్టు మేనేజ్‌మెంట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన సురేశ్ రైనా కోలుకుని నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొనడం విశేషం.

గాయం నుంచి ఇంకా కోలుకోని ధోని

గత ఆదివారం కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని వెన్ను నొప్పితో బాధపడుతూ కనిపించిన సంగతి తెలిసిందే. చెన్నై ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో నొప్పిని భరించలేని ధోనీ ఫిజియోను పిలిపించుకుని ట్రీట్‌మెంట్‌ కూడా చేయించుకున్నాడు. అయితే, ఈ గాయం నుంచి ధోని ఇంకా కోలుకున్నట్లు లేదు.

 చెన్నైలో జరగాల్సిన మ్యాచ్‌లు పూణెకు

చెన్నైలో జరగాల్సిన మ్యాచ్‌లు పూణెకు

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ధోని ఆడతాడో లేదో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. కావేరీ జల వివాదం కారణంగా చెన్నైలో సొంతగడ్డపై జరగాల్సిన మ్యాచ్‌లన్ని ఐపీఎల్ నిర్వాహకులు పూణెకు తరలిన సంగతి తెలిసిందే. కాగా, చెన్నై మ్యాచ్‌లను వీక్షించేందుకు 'విజిల్‌పోడు ఎక్స్‌ప్రెస్'లో అభిమానులు చెన్నై నుంచి పూణెకు చేరుకున్నారు.

సొంతగడ్డపై ఒకే ఒక్క మ్యాచ్

రెండేళ్ల విరామం తర్వాత టోర్నీలోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌ని తమ సొంతగడ్డపై ఆడింది. అదే సమయంలో కావేరీ జల వివాదంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేలరేగాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌లను పూణెకు తరలించారు.

చెన్నై నుంచి పూణెకు రైలుని బుక్ చేసిన యాజమాన్యం

అయితే, సొంతగడ్డపై చెన్నై అభిమానులు చూపించిన ఆదరణకు ఫిదా అయిన చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఓ ఐపీఎల్ మ్యాచ్ కోసం చెన్నై నుంచి పూణెకు రైలుని బుక్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొట్టమొదటిసారి.

పూణెకు చేరిన 'విజిల్‌పోడు ఎక్స్‌ప్రెస్'

దీంతో గురువారం చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులతో బయల్దేరిన 'విజిల్‌పోడు ఎక్స్‌ప్రెస్' శుక్రవారం ఉదయానికి పూణెకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. టీమ్ మేనేజ్‌మెంట్ సభ్యులు కూడా కొందరు అభిమానులతో ఇదే రైలులో పూణెకు చేరుకున్నారు.

ఉచిత వసతి సౌకర్యంతో పాటు భోజనం కూడా

టోర్నీలో భాగంగా శుక్రవారం పూణె వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై తలపడనుంది. ఇందులో భాగంగా అభిమానులకు కాంప్లిమెంటరీ పాస్‌లను కూడా మేనేజ్‌మెంట్ ఇచ్చింది. పూణెలో ఉండేందుకు ఉచిత వసతి సౌకర్యంతో పాటు భోజనాన్ని కూడా ఏర్పాటు చేసింది. చెన్నై యాజమన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Story first published: Friday, April 20, 2018, 14:02 [IST]
Other articles published on Apr 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X