For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో అత్యధిక క్యాచ్‌ల రికార్డు కూడా ధోనీదే

IPL 2018: MS Dhoni creates world record for most catches and dismissals in Twenty20 cricket history

హైదరాబాద్: వయస్సు పెరుగుతున్నా.. ఫామ్ ఏ మాత్రం తగ్గకుండా ఆడుతున్నాడు కెప్టెన్ కూల్ ధోనీ. బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ అతనికి సాటిలేరంటూ రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు. ఐపీఎల్ 11లో ఇప్పటికి లీగ్ దశ ముగిసింది. ఆదివారం చెన్నై, పంజాబ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌తో ధోనీ మరో కొత్త రికార్డు బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకూ టీ20 పట్టిన క్యాచ్‌లలోనూ, వికెట్ కీపర్‌గానూ అరుదైన రికార్డు సృష్టించాడు.

టీ20 ఫార్మాట్లో 144 క్యాచ్‌లతో

టీ20 ఫార్మాట్లో 144 క్యాచ్‌లతో

టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర రికార్డును ధోనీ బ్రేక్ చేశాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్, మనోజ్ తివారీ, అశ్విన్ క్యాచ్‌లను అందుకున్న మహీ.. టీ20 ఫార్మాట్లో మొత్తం 144 క్యాచ్‌లు అందుకున్నాడు. సంగక్కర 142 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. సంగక్కర తర్వాతి స్థానంలో దినేశ్ కార్తీక్ (139) ఉన్నాడు. నాలుగో స్థానంలో కమ్రాన్ అక్మల్ (123) ఉండగా.. దినేశ్ రామ్‌దిన్ (111), నమన్ ఓజా (106) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

వికెట్ కీపర్ గానూ రికార్డులే

వికెట్ కీపర్ గానూ రికార్డులే

టీ20ల్లో ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ చేర్చిన వికెట్ కీపర్‌గానూ ధోనీ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ కమ్రాన్ అక్మల్ (215) పేరిట ఉండగా.. దాన్ని ధోనీ (216) బ్రేక్ చేశాడు. కుమార సంగక్కర (202) మూడో స్థానంలో ఉండగా.. దినేశ్ కార్తీక్ (192) నాలుగో స్థానంలో ఉన్నాడు. దినేశ్ రామ్‌దిన్ (155), నమన్ ఓజా (130) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఐపీఎల్‌లో 7వ బ్యాట్స్‌మన్‌గా..

ఐపీఎల్‌లో 7వ బ్యాట్స్‌మన్‌గా..

ఈ మ్యాచ్‌లో 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ధోని మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 4,000 పరుగులు పూర్తి చేసిన 7వ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. అంతకు ముందు విరాట్‌ కోహ్లి(4,948), సురేశ్‌ రైనా (4,931), గౌతం గంభీర్‌(4,217), రాబిన్‌ ఉతప్ప(40,81), డేవిడ్‌ వార్నర్‌(4,014)లు ఉండగా.. 4007 పరుగులతో ధోని 7వ స్థానంలో నిలిచాడు. ఇక ఈసీజన్‌లో వీరవిహారం చూపిస్తున్న ధోని 14 మ్యాచ్‌ల్లో 30 సిక్స్‌లు, 23 బౌండరీలతో 446 పరుగులు చేశాడు.

 లుంగీ ఎంగిడి బౌలింగ్ 4/10

లుంగీ ఎంగిడి బౌలింగ్ 4/10

చెన్నై, సన్‌రైజర్స్, కోల్‌కతా, రాజస్థాన్ జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. చివరి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడటం ద్వారా పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలను దూరం చేసుకుంది. లుంగీ ఎంగిడి కేవలం పది పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయడంతో కింగ్స్ ఎలెవన్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్ ద్వారా చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.

Story first published: Monday, May 21, 2018, 16:06 [IST]
Other articles published on May 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+