న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంబటి రాయుడి కామెడీ రనౌట్: పగలబడి నవ్విన బ్రావో (వీడియో)

By Nageshwara Rao
IPL 2018: MS Dhoni, Ambati Rayudus Comical Run-Out Act Sparks Laugh Riot In CSK Camp

హైదరాబాద్: ధోని, అంబటి రాయుడు మరోసారి బ్యాట్‌తో రాణించడంతో సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) స్టేడియంలో సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై భారీ స్కోరు సాధించడంలో ధోని, రాయుడు కీలకపాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి ఆరు ఓవర్లలో 79 పరుగులు రాబట్టారు. అయితే ఆఖరి ఓవర్లో అప్పటివరకు దూకుడుగా ఆడిన అంబటి రాయుడు(41) పరుగుల వద్ద అనూహ్యంగా రనౌటయ్యాడు.

నవ్వులు పూయించిన రాయుడి రనౌట్

నవ్వులు పూయించిన రాయుడి రనౌట్

రాయుడి రనౌట్ చెన్నై జట్టులో కూడా నవ్వులు పూయించింది. చెన్నై ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌ను ట్రెంట్ బౌల్ట్ వేశాడు. ఆఖరి ఓవర్ ఐదో బంతిని ఎదుర్కొన్న చెన్నై కెప్టెన్ ధోని పుల్ షాట్‌గా ఆడాడు. అయితే అది బ్యాట్ ఎడ్జిని తీసుకుని లెగ్ సైడ్‌గా వెళ్తోన్న బంతిని వికెట్ కీపర్ రిషబ్ పంత్ అతికష్టం మీద ఆ బంతిని ఒంటి చేత్తో అందుకున్నాడు.

సింగిల్ తీసేందుకు పరిగెత్తిన రాయుడు

సింగిల్ తీసేందుకు పరిగెత్తిన రాయుడు

అదే సమయంలో అంబటి రాయుడు సింగిల్ తీసేందుకు క్రీజు నుంచి పరిగెత్తాడు. అయితే బంతి వికెట్ కీపర్ చేతికి చిక్కడంతో ధోని మాత్రం కదల్లేదు. రాయుడు మాత్రం సింగిల్ తీద్దామనే ఉద్దేశ్యంతో స్టైకర్ ఎండ్‌కు పరిగెత్తడం, దానిని ధోని గమనించకపోవడం... మరోవైపు కీపర్ నుంచి బంతిని అందుకున్న ట్రెంట్ బౌల్ట్ వికెట్లను గిరాటేయడం చకా చకా జరిగిపోయాయి.

నిరాశగా పెవిలియన్‌కు చేరిన రాయుడు

దీంతో రాయడు (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, ఒక సిక్సు) పరుగుల వద్ద నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఈ మొత్తం తతంగాన్ని డగౌట్‌లో నుంచి చూస్తున్న చెన్నై ఆటగాళ్లను సైతం నవ్వులు పూయించింది. రాయుడి రనౌట్‌ చూసి బ్రావో అయితే పగలబడి నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో అభిమానులతో పంచుకుంది.

13 పరుగుల తేడాతో చెన్నై విజయం

13 పరుగుల తేడాతో చెన్నై విజయం

ఇదిలా ఉంటే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఢిల్లీ పోరాడి ఓడింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. అనంతరం భారీ బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.

Story first published: Tuesday, May 1, 2018, 15:00 [IST]
Other articles published on May 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X