ధనాదన్.. ధోని ముంగిట మరో రికార్డు

హైదరాబాద్: రెండేళ్ల నిషేదం అనంతరం పాల్గొంటున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో చెన్నై జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. అయితే ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌ను మినహాయిస్తే చెన్నై జట్టే నంబర్ వన్‌గా కొనసాగింది. ఇదే మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ శనివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో చరిత్రలోనే కెప్టెన్‌గా 150మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

నిషేధం తర్వాత పునరాగమనం చేసిన చెన్నై:
రెండేళ్ల నిషేధం తర్వాత పునరాగమనం చేసిన చెన్నై సూపర్‌కింగ్స్.. ధోనీకే తిరిగి జట్టు బాధ్యతలు అందించింది. దీంతో ధోనీ కెప్టెన్సీలో చెన్నై 7 మ్యాచ్‌లలో 5 గెలవగా, రెండింట ఓడి పాయింట్లపట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా శనివారం మ్యాచ్‌తో సీఎస్‌కే కెప్టెన్‌గా ధోనీ విజయవంతంగా 150మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నట్లు.. ఆ జట్టు యాజమాన్యం ట్విటర్ ద్వారా వెల్లడించింది.

ధోనీని తప్పించి స్టీవ్ స్మిత్‌కు పగ్గాలు:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌కి నాయకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో స్పాట్ ఫిక్సింగ్ వివాదంతో సీఎస్‌కే రెండేళ్లపాటు ఐపీఎల్‌కు దూరం కావాల్సి వచ్చింది. అప్పుడు ధోనీ రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌కు ఆడాడు. 2016లో ఆ జట్టుకు కెప్టెన్సీ వహించినా, 2017లో ఆ జట్టు యాజమాన్యం ధోనీని తప్పించి స్టీవ్ స్మిత్‌కు పగ్గాలు అందించింది.

కెప్టెన్‌గా ఎవరూ ఇన్ని మ్యాచ్‌లకు నాయకత్వం:
ఐపీఎల్ కెప్టెన్‌గా ఇప్పటివరకూ ఎవరూ ఇన్ని మ్యాచ్‌లకు నాయకత్వం వహించలేదు. ఇక ధోనీ సారథ్యంలోనే సీఎస్‌కే రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలవగా, నాలుగు సార్లు రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజనులోనూ ధోనీ కేవలం కెప్టెన్‌గా మాత్రమే కాకుండా ఆటగాడిగా కూడా స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.

36వయస్సులోనూ ఆకాశమే హద్దుగా చెలరేగి:
36వయస్సులోనూ తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదంటూ ఆడిన ఏడు మ్యాచ్‌లలో 235పరుగులు సాధించాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో అయితే ధోనీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 34బంతుల్లో ఒక బౌండరీ, ఏడు సిక్సర్లతో మొత్తం 70పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications