For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018, DD vs MI: ఢిల్లీ కుర్రాళ్లు అదరగొట్టారు, ముంబై శకం ముగిసింది

ipl 2018 match 55 DD vs MI live match report from Feroz Shah Kotla Stadium.

హైదరాబాద్:ఐపీఎల్‌ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ పోరాటం లీగ్‌ దశలోనే ముగిసింది. ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన అమీతుమీ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 11 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌ రేసు నుంచి వైదొలిగిన తొలి జట్టు ఢిల్లీ కాగా, తాజాగా ముంబై ఇండియన్స్‌ ముంచేసింది.

ఇరు జట్ల మధ్య జరిగిన ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ పైచేయి సాధించింది. ఫలితంగా మరోసారి ప్లేఆఫ్‌కు చేరాలన్న ముంబై ఇండియన్స్‌ లక్ష్యం నెరవేరలేదు. ఇషాన్‌ కిషన్‌(5), పొలార్డ్‌(7), రోహిత్‌ శర్మ(13), కృనాల్‌ పాండ్యా(4) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరడంతో ముంబై 121 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై హార్దిక్‌ పాండ్యా(27) కాసేపు మెరుపులు మెరిపించి ఏడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

ఇక చివర్లో బెన్‌ కట్టింగ్‌(37‌) పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆఖరి వికెట్‌గా బూమ్రా ఔట్‌ కావడంతో ముంబై 19.3 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బౌలర్లలో లామ్‌చెన్‌, అమిత్‌ మిశ్రా, హర్షల్‌ పటేల్‌లు తలో మూడేసి వికెట్లతో సత్తాచాటగా, ట్రెంట్‌ బౌల్ట్‌ వికెట్‌ దక్కింది.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి: 80/5

ధాటిగా రాణిస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ ఆరంభంలోనే చతికిలబడడంతో జట్టు కుదురుకోవడానికి నాలుగు ఓవర్లు పట్టింది. ఆ తర్వాత నుంచి ఎవిన్ లూయీస్ పుంజుకోవడంతో స్కోరు కాస్త పరవాలేదనిపించింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన కాసేపటికే ఇషాన్ కిషన్(5) అవుటవడంతో అతనికి చక్కని జోడి దొరకక.. ఎవిన్ లూయీస్ 48పరుగులకే అవుట్ అయి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్(7), కృనాల్ పాండ్య (4) పెద్దగా రాణించలేకపోయారు. పదో ఓవర్‌‌కి వచ్చేసరికి హార్ధిక్ పాండ్యా (1), రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు.


ఢిల్లీ ఇన్నింగ్స్:

ఆరంభంలో చూపించిన దూకుడు క్రమంగా పెంచాల్సిన ఢిల్లీ అదే వేగాన్ని నడిపిస్తూ వచ్చింది. బ్యాటింగ్ లో మెరుపులు సృష్టిద్దామనే ఉద్దేశ్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఆశించినంత పరుగులు రాబట్టలేకపోయింది. ఒక దశలో వికెట్లు నిలబెట్టుకునేందుకు కష్టపడినా చక్కటి పరుగులను రాబట్టింది. ఈ క్రమంలో 44 బంతుల్లో 64 పరుగులు చేసి స్కోరును పరుగులు పెట్టించాడు రిషబ్ పంత్. ఆ తర్వాత బరిలోకి దిగిన విజయ్ శంకర్ 30 బంతుల్లో 43 పరుగులతో ఆఖరి ఓవర్లలో జట్టుకు మంచి బలాన్ని చేకూర్చారు. దీంతో ఢిల్లీ 20ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 174పరుగులు చేసింది.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి: 83/3

టాస్ గెలిచి ఫీల్డింగ్ బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబై బౌలర్లను ధాటిగానే ఎదుర్కొంది. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ ఢిల్లీ తక్కువ స్కోరుకే తొలి వికెట్ కోల్పోయింది. వికెట్ల మధ్య పరుగు తీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓపెనర్ పృథ్వీ షా(12) రనౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. బంతిని అందుకున్న హార్దిక్ పాండ్య వికెట్ల వైపు విసిరాడు. సాధారణంగానే త్రో వేయగా బంతి నేరుగా వెళ్లి స్టంప్స్‌ను తాకింది. బంతి గమనాన్ని చూస్తూ నిదానంగా పరుగెత్తకుంటూ వచ్చిన షా అప్పటికీ క్రీజులోకి రాలేదు. దీంతో అతడు పెవిలియన్ బాట పట్టాడు.

ఇలా ఓపెనర్లు కాస్త నిరుత్సాహపరిచినా ఆ తర్వాత స్ట్రైకింగ్‌కు దిగిన విజయ్ శంకర్ (6), రిషబ్ పంత్ (34)లు నిలదొక్కుకున్నారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ:

ఇంకా ప్లేఆఫ్ రేసుకు అర్హత దక్కించుకోని ముంబై, ఢిల్లీ జట్లు ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ టాస్ గెలుచుకుని బ్యాటింగ్ ఎంచుకుంది.

.ఇప్పటికే ప్లేఆఫ్ పై ఆశలు వదులుకున్న ఢిల్లీ జట్టుకు ఇదే ఆఖరి మ్యాచ్ కావడంతో లీగ్‌ దశను విజయంతో ముగించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ముంబై జట్టుకు ఈ మ్యాచ్ గెలవడంపైనే భవితవ్యం ఆధారపడి ఉంది. ఇప్పటికే 3 జట్లు దాదాపు ఖరారైనట్లే అనిపిస్తోన్న నేపథ్యంలో నాలుగో స్థానం కోసం జరిగే పోరాటంలో ముంబై గెలవాలని ఆరాటపడుతోంది.

శనివారం జరిగిన సమరంలో హైదరాబాద్‌పై గెలవడంతో కోల్‌కతా మూడో స్థానానికి చేరుకుంది. కాగా, శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ప్లేఆఫ్ రేసు నుంచి తప్పించింది. గత మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శనతో తన కంటే బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుని ఓడించిన ఢిల్లీ.. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ముంబై సైతం.. చివరిగా ఆడిన ఐదు మ్యాచ్‌‌లకిగానూ ఏకంగా నాల్గింటిలో గెలుపొంది సమతూకంగా కనిపిస్తోంది.

ఒకవేళ ఈ మ్యాచ్‌లో ముంబై ఓడితే.. అప్పుడు ప్లేఆఫ్ రేసులో మిగిలిన ఒక బెర్తు కోసం రాజస్థాన్, పంజాబ్ మాత్రమే పోటీపడతాయి. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా ప్లేఆఫ్ చేరిన విషయం తెలిసిందే. బౌండరీ లైన్ చిన్నదిగా ఉండే ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.


ఆడనున్న ఇరు జట్లు:

ఢిల్లీ డేర్‌డెవిల్స్:
Shreyas Iyer (C), Rishabh Pant, Glenn Maxwell, Gautam Gambhir, Jason Roy, Colin Munro, Mohammed Shami, Amit Mishra, Prithvi Shaw, Rahul Tewatia, Vijay Shankar, Harshal Patel, Avesh Khan, Shahbaz Nadeem, Daniel Christian, Jayant Yadav, Gurkeerat Singh Mann, Trent Boult, Manjot Kalra, Abhishek Sharma, Sandeep Lamichhane, Naman Ojha, Sayan Ghosh, Liam Plunkett, Junior Dala.

ముంబై ఇండియన్స్:
Rohit Sharma (C), Suryakumar Yadav, Evin Lewis, Ishan Kishan, Hardik Pandya, Krunal Pandya, Kieron Pollard, Mayank Markande, Mitchell McLenaghan, Mustafizur Rahaman, Jasprit Bumrah, Akila Dananjaya, Ben Cutting, JP Duminy, Rahul Chahar, Sharad Lumba, Adam Milne, Siddhesh Lad, Md Nidheesh, Mohsin Khan, Anukul Roy, Pradeep Sangwan, Tajinder Singh, Aditya Tare, Saurabh Tiwary.

Story first published: Sunday, May 20, 2018, 21:11 [IST]
Other articles published on May 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+