
హైదరాబాద్: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
165 పరుగుల లక్ష్య చేధనలో బెంగళూరు జట్టు స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ (4/16) ధాటికి 19.2 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ ఓటమితో కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా, రాజస్థాన్ రాయల్స్ మాత్రం ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
కష్టాల్లోపడ్డ బెంగళూరు: 14 ఓవర్లకు 102/6
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు కష్టాల్లోపడింది. గౌతమ్ కృష్టప్ప వేసిన మూడో విరాట్ కోహ్లీ(4) క్లీన్ బౌల్డయ్యాడు. ఈ దశలో ఏబీ డివిలియర్స్, పార్థీవ్ పటేల్‌ల జోడీ జట్టుకు అండగా నిలిచింది. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 55 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే శ్రేయస్ గోపాల్ అద్భుతమైన ప్రదర్శనతో బెంగళూరు జట్టు 23 పరుగులు తేడాతో ఐదు కీలక వికెట్లు కోల్పోయింది.
9వ ఓవర్ మూడో బంతికి ఓపెనర్ పార్థివ్ పటేల్ (21 బంతుల్లో 33)ను క్లాసెన్ స్టంపౌట్ చేయగా అదే ఓవర్ ఆఖరి బంతికి మొయిన్ అలీ (1) బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత గోపాల్ వేసిన 11వ ఓవర్ మూడో బంతికి మన్‌దీప్ స్టంపౌట్ అయ్యాడు. అనంతరం సోథీ వేసిన 12వ ఓవర్ ఆఖరి బంతికి గ్రాండ్‌హోం(2) రహానేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆ తర్వాత డివిలియర్స్ 7 ఫోర్లతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. కానీ గోపాల్ వేసిన 13వ ఓవర్ నాలుగో బంతికి డివిలియర్స్(53) కూడా స్టంపౌట్ అయ్యాడు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. క్రీజ్ులో సర్ఫరాజ్(2), సౌథీ(3) పరుగులతో ఉన్నారు.
వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన బెంగళూరు
జైపూర్ వేదికగా రాజస్థాన్-బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 10 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు 3 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. స్పిన్నర్ శ్రేయeస్ గోపాల్ వేసిన 9వ ఓవర్‌లో బెంగళూరు వెంటవెంటనే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. 9వ ఓవర్ మూడో బంతికి ఓపెనర్ పార్థివ్ పటేల్ (21 బంతుల్లో 33)ను క్లాసెన్ స్టంపౌట్ చేయగా అదే ఓవర్ ఆఖరి బంతికి మొయిన్ అలీ (1) బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం డివిలియర్స్ (41), మన్‌దీప్ సింగ్ (1) పరుగుతో క్రీజులో ఉన్నారు.
7 ఓవర్లకు బెంగళూరు 63/1
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు నిలికడగా ఆడుతున్నారు. ఆరంభంలోనే కోహ్లీ వికెట్ కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌తో కలిసి మరో ఓపెనర్ పార్దీవ్ పటేల్ స్కోరు బోర్డుని నడిపిస్తున్నాడు. ప్రస్తుతం 7 ఓవర్లకు గాను బెంగళూరు వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. క్రీజులో పార్థీవ్ పటేల్ (33), డివిలియర్స్(36) పరుగులతో ఉన్నారు.
విరాట్ కోహ్లీ ఔట్: తొలి వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కృష్టప్ప గౌతమ్ వేసిన మూడో విరాట్ కోహ్లీ(4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 3 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజులో పార్థీవ్(15), డివిలియర్స్(1) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
బెంగళూరు విజయ లక్ష్యం 165
ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ సత్తాచాటారు. జైపూర్‌లో వేదికగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (80 నాటౌట్: 58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
మ్యాచ్ ఆరంభంలోనే ఓపెనర్ ఆర్చర్ జోప్రా డకౌటవగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రహానె (33: 31 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి రాహుల్ త్రిపాఠి జట్టు స్కోరు బోర్డుని నడిపించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి అభేద్యంగా 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో రాజస్థాన్ భారీ స్కోరు దిశగా సాగింది.
అయితే, ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ వరుస బంతుల్లో రహానె, సంజు శాంసన్ (0)ని పెవిలియన్‌కు చేర్చాడు. చివర్లో త్రిపాఠితో కలిసి హెన్రిచ్ క్లాసెన్ (32: 21 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సు), గౌతమ్ (14: 5 బంతుల్లో 2 సిక్సులు) దూకుడుగా ఆడటంతో రాజస్థాన్ 164 స్కోరు చేయగలిగింది.
దీంతో కోహ్లీసేనకు 165 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీయగా, హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.
14 ఓవర్లకు రాజస్థాన్ 74/1
జైపూర్‌లో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతికి కెప్టెన్ రహానే(33) పరుగుల వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అలీకి క్యాచ్ ఇవ్వగా, ఆ తర్వాతి బంతికే సంజూ శాంసన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 14 ఓవర్లకు గాను రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి(64), క్లాసెన్(3) పరుగులతో ఉన్నారు.
హాఫ్ సెంచరీ నమోదు చేసిన రాహుల్ త్రిపాఠి
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 12వ ఓవర్లో గ్రాండ్‌హోమ్ వేసిన ఐదో బంతికి రెండు పరుగులు చేసి 50 పరుగులు పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో త్రిపాఠికి ఇది తొలి హాఫ్ సెంచరీ కాగా ఐపీఎల్ చరిత్రలో మూడోది. దీంతో 13 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో త్రిపాఠి 64, రహానె 33 పరుగులతో ఉన్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 99 పరుగులు జోడించారు.
10 ఓవర్లకు రాజస్థాన్ 74/1
జైపూర్‌లో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు నిలికడగా ఆడుతున్నారు. ఆదిలోనే ఓపెనర్ జోఫ్రా ఆర్చర్ వికెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత రహానేతో కలిసి త్రిపాఠి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కి ఇప్పటి వరకు 72 పరుగులు జోడించారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాహుల్ త్రిపాఠి (43), అజింక్యె రహానే (29) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్
జైపూర్‌లో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ ఉమేశ్ యాదవ్ వేసిన రెండో ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్(0) కీపర్ పార్థీవ్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 3 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానే(3), రాహుల్ త్రిపాఠి(9) పరుగులతో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం సాయత్రం 4 గంటలకు రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానె బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తుది జట్టులో మూడు మార్పులు చేసింది. జోస్ బట్లర్, బెన్‌స్టోక్స్ స్థానంలో హెన్రిచ్ క్లాసెన్, బెన్ లాలిన్ జట్టులోకి రాగా.. స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ కూడా మళ్లీ జట్టులోకి వచ్చాడు. మరోవైపు బెంగళూరు విషయానికి వస్తే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.
ఈ సీజన్ మలి దశకు వచ్చినప్పటికీ ప్లేఆఫ్ బెర్తులపై ఇంకా స్పష్టత రాలేదు. మ్యాచ్ మ్యాచ్‌కు ఉత్కంఠరేపుతూ జట్లు అనూహ్య విజయాలు సాధించడంతో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్(18), చెన్నై సూపర్ కింగ్స్(16) ప్లేఆఫ్ బెర్తులను ఖరారు చేసుకోగా, మిగిలిన రెండు బెర్తుల కోసం ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ప్లే ఆఫ్ రేసు నుంచి ఇప్పటికే ఢిల్లీ నిష్క్రమించగా మిగిలిన ఐదు జట్ల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో శనివారం రాజస్థాన్-బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు జట్లకు ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్. రెండు జట్లూ 12 పాయింట్లతో ఉండగా ఓడిన జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్లే. అయితే గెలిచిన జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. ఈ పాయింట్లు నేరుగా నాకౌట్‌కు చేరేందుకు ఉపయోగపడవు. కాకపోతే మిగతా జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.
మరోవైపు ముంబై కూడా తమ చివరి మ్యాచ్‌లో నెగ్గితే 14 పాయింట్లే ఉంటాయి. దీంతో ఫ్లే ఆఫ్ రేసులో నెట్ రన్‌రేట్ కీలకపాత్ర పోషిస్తుంది. అద్భుతమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉన్న బెంగళూరు జట్టుని రాజస్థాన్ తన సొంత మైదానంలో ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు రాజస్థాన్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ బట్లర్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్‌కు పయనమైన సంగతి తెలిసిందే. దీనిని అవకాశంగా తీసుకున్న బెంగళూరు భారీ విజయంపై కన్నేసి నెట్ రన్‌రేట్ పెంచుకోవాలని చూస్తోంది. గత మూడు మ్యాచ్‌ల్లో బెంగళూరు వరుస విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.
జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు:
పార్థీవ్ పటేల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ, గ్రాండ్ హోమ్, మన్‌దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, చాహల్
రాజస్థాన్ రాయల్స్ జట్టు:
రాహుల్ త్రిపాఠి, అజింక్య రహానె, సంజు శాంసన్, హెన్రిచ్ క్లాసెన్, స్టువర్ట్ బిన్నీ, గౌతమ్, జోప్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, ఇస్ సోధి, జయదేవ్ ఉనద్కత్, బెన్ లాలిన్