IPL 2018: MIvsKXIP: మూడు పరుగుల తేడాతో ప్లేఆఫ్ ఆశలు సజీవం చేసుకున్న ముంబై

IPL 2018: MI Vs KXIP Match Highlights
ipl 2018 match 50 mi vs kxip match report from wankhade stadium

హైదరాబాద్:మ్యాచ్‌ చివరి దాకా నిలిచి గెలిపిస్తాడనుకున్న కేఎల్‌ రాహుల్‌(94: 60 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు)ను ఓ అద్భుత బంతితో పెవిలియన్‌ పంపించి పంజాబ్‌ ఆశలను ఆవిరి చేశాడు. దీంతో ముంబయి 3 పరుగుల తేడాతో పంజాబ్‌పై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో బుమ్రా తన పవర్‌ చూపించాడు. 4 ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. రాహుల్‌ అద్భుత పోరాటాన్ని వృథా చేశాడు.పంజాబ్‌లో అరోన్‌ ఫించ్‌(46) రాహుల్‌కు సహకారం అందించినప్పటికీ మిగతవారు చేతులెత్తేయడంతో పంజాబ్‌ పరాజయం పాలైంది.

ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ముంబైలో కీరన్‌ పోలార్డ్‌ (50) అద్భుతంగా ఆడాడు. సూర్యకుమార్‌ యాదవ్‌(27), కృనాల్‌ పాండ్యా(32), ఇషాన్‌ కిషన్‌ (20) ఫర్వాలేదనిపించి ముంబైకి గౌరవప్రదమైన స్కోరును అందించారు. పంజాబ్‌ బౌలర్లలో ఆండ్రూ టై 4 వికెట్లు తీయగా, అశ్విన్‌ 2 వికెట్లు, స్టానిస్‌, రాజ్‌పుత్‌ తలో వికెట్‌ తీశారు.


పది ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్:

187 పరుగుల లక్ష్యాన్ని చేధించే దిశగా పంజాబ్ జట్టు బరిలోకి దిగింది. ఆరంభం నుంచే ఓపెనర్లుగా దిగిన గేల్, రాహుల్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ దిశగా గేల్ ఆడిన 11 బంతుల్లోనే 18పరుగులు చేశాడు. 3.5ఓవర్‌లో మిచెల్ వేసిన బంతిని భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఆరోన్ ఫించ్, కేఎల్ రాహుల్‌లు చక్కటి షాట్ లతో స్కోరును పరుగులు పెట్టిస్తున్నారు. పదో ఓవర్ పూర్తయ్యేసరికి పంజాబ్ స్కోరు 86/1కాగా, క్రీజులో ఆరోన్ ఫించ్(19), లోకేశ్ రాహుల్(47) ఉన్నారు.


ముంబై ఇన్నింగ్స్ ముగిసిందిలా:

ఆఖరి ఓవర్లలో.. జట్టులో అందరూ అవుటవతుండటంతో బౌలర్ మయాంక్ మార్కండే బౌలర్ క్రీజులోకి వచ్చాడు. చివరి బంతులను సైతం వినియోగించుకునే ప్రయత్నంలో మయాంక్ మార్కండే(7), మెక్ క్లెనగన్(11)పరుగులతో క్రీజులో ఉండగా ఓవర్లు పూర్తయ్యాయి. శుభారంభాన్ని చేసిన ముంబై ఒకానొక దశలో పేలవ ఆటను ప్రదర్శించి వరుస బంతుల్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వికెట్లు వరుసగా కోల్పోవడంతో ముంబై జట్టు పరుగులు విషయంలో కాస్త తటపటాయించింది. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగడంతో కచ్చితంగా రాణిస్తాడనే నమ్మకంతో అతనిపైనే ఆశలన్నీ పెట్టుకుంది జట్టు. కానీ, కేవలం 6పరుగులు చేసి పెవిలియన్‌కు చేరడంతో పొలార్డ్, కృనాల్ పాండ్యా కాసేపటి వరకూ జట్టును మళ్లీ పుంజుకునేలా కాపాడారు.


15 ఓవర్లు పూర్తయ్యే సరికి

క్రీజులో హార్థిక్ పాండ్యా (1), పొలార్డ్ (50) ఉన్నారు. ఆఖరి బంతికి పొలార్డ్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోల్పోతున్న మ్యాచ్‌పై కృనాల్ పాండ్యా, పొలార్డ్ నిలదొక్కుకోవడంతో ముంబై కాస్తంత కుదురుకుంది. అయితే 14.2ఓవర్‌లో స్టోనీస్ వేసిన పంతికి అంకిత్ రాజ్‌పుత్‌కు క్యాచ్ ఇచ్చి కృనాల్ పాండ్యా (32)పరుగులతో పెవిలియన్‌కు చేరాడు. జట్టు ప్రస్తుత రన్ రేట్ 10.07.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యే సమయానికి:

ప్రస్తుతం కృనాల్ పాండ్యా (7), పొలార్డ్ (7) క్రీజులో ఉన్నారు. ఘనంగా ఆరంభించిన ముంబై క్రమేపి తడబడుతోంది. పంజాబ్ బౌలర్ల ధాటికి ముంబై ఇప్పటికే 4వికెట్లను కోల్పోయింది. ప్రణాళిక ప్రకారం మిడిలార్డర్‌లో బరిలోకి రావాల్సిన రోహిత్ శర్మ కొద్ది ముందుగానే రావడంతో నిరుత్సాహంతోనే ఇన్నింగ్స్ ఆరంభించి 6 పరుగులతో వెనుదిరిగాడు. ఇప్పటి వరకూ జట్టులో ఎవరి వ్యక్తిగత స్కోరు 30 దాటలేదు. ఓపెనర్‌గా దిగిన సూర్య కుమార్ యాదవ్ మాత్రమే 27పరుగులు చేశాడు.

పంజాబ్ బౌలర్లలో ఆండ్రూ టై చక్కటి బౌలింగ్ చేసి 3 తీశాడు. అతనితో పాటుగా అంకిత్ రాజ్‌పుత్ 1వికెట్ తీశాడు.


ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి:

మొదటి ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై 57 పరుగులు చేయగలిగింది. దూకుడుగా ఆరంభించిన ఇన్నింగ్స్‌ను అంతే వేగంతో కొనసాగిస్తోంది. 3.1బంతికి తొలి వికెట్ లూయీస్ (9)పరుగులకే అవుట్ చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్(19) దూకుడు మీదున్నాడు. అతనితో పాటు మరో ఎండ్‌లో ఓపెనర్‌గా దిగిన సూర్యకుమార్(26) చక్కటి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.


టాస్ రిపోర్టు: ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్‌లో భాగంగా సొంత గడ్డపై మ్యాచ్ ఆడి కచ్చితంగా గెలిచి తీరాలనే బలమైన సంకల్పంతో ముంబై ఇండియన్స్ మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అంతే స్థాయిలో వరుస వైఫల్యాల అనంతరం మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు నిలుస్తాయనే ఆశతో పంజాబ్ పోరాడనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఇంతకుముందు ముంబై ఆడిన ఆఖరి 4 మ్యాచ్‌లలో మూడు వరుస విజయాల అనంతరం ఒక్క మ్యాచ్‌లో వైఫల్యం పొందింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో గెలుస్తుందనుకున్న అంచనాలు తారుమారవడంతో ఓటమికి గురికావాల్సి వచ్చింది. లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లలో ఇరు జట్లు 12 మ్యాచ్‌ల వరకూ ఆడాయి. ముంబై ఆరో స్థానంలో కొనసాగుతుండగా, పంజాబ్ ఐదో స్థానంలో రాణిస్తోంది.

ఈ మ్యాచ్ లో అసాధారణ విజయం సాధించి రాయల్స్ జట్టును వెనుకపడేస్తే తప్ప ముంబైకి ప్లేఆఫ్ రేసులో చోటు దక్కదు. ఎందుకంటే పంజాబ్, రాయల్స్ పాయింట్లలో పెద్దగా వ్యత్యాసంతో లేరు. పంజాబ్ కంటే ముందున్న రాయల్స్‌ను టార్గెట్ చేసుకుంటేనే మెరుగైన ఫలితాలు రాబట్టే అవకాశముంది.

పంజాబ్ కు మాత్రం కోలుకోవడానికి వీలు లేకుండా పోతోంది. వరుస వైఫల్యాలతో ఆ జట్టు ఇప్పటికే నీరుగారిపోయింది. మిడిలార్డర్ వైఫల్యంతో కొనసాగుతోన్న జట్టు బౌలింగ్ పరవాలేదనిపించుకున్న బ్యాటింగ్ విభాగంలో మరింత బలహీనంగా కనిపిస్తోంది.

1
43460

వాంఖడే వేదికగా తలపడనున్న ఇరు జట్లు విజయం కోసం ఆతురతతో పోరాడుతుండటంతో మ్యాచ్ పై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.


ఆడనున్న ఇరు జట్ల అంచనా:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
Ravichandran Ashwin (C), Chris Gayle, Aaron Finch, KL Rahul, Karun Nair, Mohit Sharma, Mujeeb ur Rahman, Barinder Sran, David Miller, Andrew Tye, Ankit Rajpoot, Axar Patel, Akshdeep Nath, Mayank Agarwal, Manoj Tiwary, Yuvraj Singh, Marcus Stoinis, Mayank Dagar.

ముంబై ఇండియన్స్:
Rohit Sharma (C), Suryakumar Yadav, Evin Lewis, Ishan Kishan, Hardik Pandya, Krunal Pandya, Kieron Pollard, Mayank Markande, Mitchell McLenaghan, Mustafizur Rahaman, Jasprit Bumrah, Akila Dananjaya, Ben Cutting, JP Duminy, Rahul Chahar, Sharad Lumba, Adam Milne, Siddhesh Lad, Md Nidheesh, Mohsin Khan, Anukul Roy, Pradeep Sangwan, Tajinder Singh, Aditya Tare, Saurabh Tiwary.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Story first published: Wednesday, May 16, 2018, 17:32 [IST]
  Other articles published on May 16, 2018
  POLLS

  Get breaking news alerts from myKhel

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more