

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా జరుగుతోన్న 48వ మ్యాచ్‌లో బెంగళూరు, పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఈ క్రమంలో పంజాబ్‌ను చిత్తుగా ఓడించి ప్లేఆఫ్ ఆశలు నిలుపుకుంది బెంగళూరు. ఓ అద్భుతాన్ని సృష్టించింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ వరుసగా అవుట్ అయిపోవడం, 89పరుగుల టార్గెట్‌ను 8.1ఓవర్లలోనే చేధించడం బెంగళూరు జట్టుకు బాగా కలిసొచ్చిన అంశాలు. దీంతో బెంగళూరు పంజాబ్‌పై 10 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. ఇండోర్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బౌలర్లు చెలరేగడంతో 15.1 ఓవర్లలోనే 88 పరుగులకు పంజాబ్ జట్టు కుప్పకూలిపోయింది.
ఛేదనలో ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లి (48), పార్థీవ్ పటేల్ (40) నిలకడగా ఆడటంతో 8.1 ఓవర్లలోనే 92/0తో అలవోకగా విజయాన్ని అందుకుంది. టోర్నీలో బెంగళూరుకి ఇది ఐదో విజయంకాగా.. వరుసగా రెండోది. మరోవైపు పంజాబ్‌కి ఇది వరుసగా మూడో ఓటమికాగా.. మొత్తంగా ఆరోది. 2018 సీజన్‌లో ఓ జట్టు పది వికెట్ల తేడాతో గెలుపొందడం ఇదే తొలిసారి.
ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్‌కి చేరగా.. మిగిలిన రెండు స్థానాల కోసం కోల్‌కతా, రాజస్థాన్, బెంగళూరుతో పాటు పంజాబ్ పోటీపడుతున్నాయి. టోర్నీ జరుగుతున్న తీరు చూస్తుంటే.. ఒకవేళ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ముంబై గెలిస్తే.. ప్రస్తుతం 10 పాయింట్లతో ఉన్న ఆ జట్టు కూడా రేసులో నిలిచేందుకు అవకాశాలు లేకపోలేదు.
పంజాబ్ ఇన్నింగ్స్:
చెత్త ప్రదర్శన చేసి వందకు మించని స్కోరుతో ఆల్ అవుట్ అయిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్, బౌలింగ్‌తో బెంగళూరును ఓడించగలదా..? మ్యాచ్ ఆరంభం నుంచి తడబడిన పంజాబ్ వరుస వికెట్లు పడుతూనే ఉన్నా రన్‌రేట్‌ను తగ్గనివ్వకుండా ఆడింది. టార్గెట్ చేధించే క్రమంలో బెంగళూరు ఇరగదీసే రన్ రేట్ తో ఆడితే ప్లేఆఫ్ ఆశలు మళ్లీ సజీవంగా ఉంటాయి. వరుస వికెట్లు పడుతుండటంతో బెంగళూరు జట్టు ఆడుతూనే ఉత్సాహాన్ని ప్రదర్శించారు. కెప్టెన్ అశ్విన్ క్రీజులోకి వచ్చీ రాగానే రనౌట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు.
పంజాబ్ జట్టులో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడు ఆరోని పించ్ మాత్రమే 23 బంతులు ఆడి 26 పరుగులు చేశాడు.
అతని తర్వాత 15 బంతులు ఆడి 21 పరుగులు చేసింది కేఎల్ రాహుల్ మాత్రమే.
మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి:
పరుగులు మొదలెట్టడమూ నిదానంగానే జరిగింది. దాంతోపాటుగా ఒక్క బంతి తేడాతో ఓపెనర్లు క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ ఇద్దరూ అవుట్ అయి పెవిలియన్‌కు చేరారు. వారి భాగస్వామ్యంతో దాదాపు 35 పరుగులు చేయగలిగారు. ఆ తర్వాత ఆరో ఓవర్‌లో మూడు బంతులాడిన కరుణ్ నాయర్(1)పరుగుతోనే అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోనియిస్ రెండు బంతులాడి 3పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జట్టు కాస్త కుదురుకుంటుందన్న సమయంలో 8.5బంతికి మయాంక్ అగర్వాల్ 6బంతులాడి 2పరుగులు చేసి వెనుదిరిగాడు.
ఇప్పటికే జట్టు తీవ్రంగా నష్టపోవడంతో క్రీజులో ఉన్న ఆరోన్ పించ్‌పైనే ఆశలు నింపుకపుంది పంజాబ్ జట్టు. క్రీజులో ఆరోన్ పించ్ (17), అక్సర్ పటేల్ (1) ఉన్నారు.
ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్:
నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించిన పంజాబ్ 4.3ఓవర్లకే కేఎల్ రాహుల్ (21) తొలి వికెట్‌ను కోల్పోయింది. ఒక్క బంతి తేడాతో క్రిస్ గేల్ (18) కూడా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఓపెనర్లిద్దరూ పెవిలియన్ కు చేరారు. వారి తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ కూడా కేవలం 3బంతులు ఆడి ఒకే ఒక పరుగు చేశాడు. క్రీజులో ఆరోన్ పించ్, మార్కస్ స్టోనియిస్ ఉన్నారు.
ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు టాస్ గెలుచుకోవడంతో కెప్టెన్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ప్రతి మ్యాచూ.. కత్తి మీద సామే.. మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్ రేసులో ఉన్నట్లు లేదా తప్పుకున్నట్టే అనే పరిస్థితిలో కొనసాగుతున్నాయి కొన్ని జట్లు. సోమవారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా తలపడుతోన్న బెంగళూరు, పంజాబ్ జట్లలో పంజాబ్‌ది అదే పరిస్థితి. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకమనే చెప్పాలి. ఇప్పటికే 11 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. ఆరింటిలో గెలిచి 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
పంజాబ్ గెలిస్తే.. ఇంకొక్క విజయంతో సగౌరవంగా ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోవచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనుక పంజాబ్ ఓడితే.. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. మరోవైపు రాజస్థాన్, కోల్‌కతా కూడా ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీపడుతుండటంతో పంజాబ్‌కు మిగిలిన మూడు మ్యాచ్‌లు కీలకమనే చెప్పాలి.
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆ జట్టుకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఆ జట్టు కనీసం విజయాల సంఖ్య పెంచుకుని పరువు నిలుపుకోవాలనే ప్రయత్నంలో ఉంది.
సొంత గడ్డపై జరుగుతోన్న మ్యాచ్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది పంజాబ్. భారీ మద్దతు ఉండే మైదానంలో చెలరేగిపోవాలని అశ్విన్ సేన ఉవ్విళ్లూరుతోంది. అయితే పంజాబ్‌కు ఓపెనింగ్ కాస్త ఇబ్బందిగా మారింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. మరో ఓపెనర్ క్రిస్ గేల్ నిలకడగా ఆడటంలేదు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గేల్ రెచ్చిపోతే గనుక బెంగళూరుకు కష్టమనే చెప్పాలి. గేల్‌తో పాటు కరణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ ఫామ్‌లోకి రావడం జట్టుకు ఎంతో అవసరం.
ఇదిలా ఉంటే, గత మ్యాచ్‌లో గాయపడిన స్పిన్నర్ ముజీబ్ ఈ మ్యాచ్‌లో ఆడతాడా లేదా ఇంకా ఖరారు కాలేదు.
ఆడనున్న ఇరుజట్లు:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
లోకేష్ రాహుల్ (కీపర్), క్రిస్ గేల్, రవిచంద్రన్ అశ్విన్ (కెప్టెన్), ఆరోన్ ఫించ్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్, బరిందర్ శ్రాన్, అక్షర్ పటేల్, ఆండ్రూ టై, మోహిత్ శర్మ, ముజీబ్ ఉర్ రహ్మాన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
పార్థివ్ పటేల్ (కీపర్), విరాట్ కోహ్లి(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, మన్‌దీప్ సింగ్, మొయిన్ అలీ, సర్ఫరాజ్ ఖాన్, కొలిన్ డిగ్రాండ్‌హోమ్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహల్