For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018: RR vs MI: ముంబైని ముంచేసి.. వరస మూడో విజయంతో దంచేసి..

match-report-from-wankhede-stadium

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్‌ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సత్తా చాటింది. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం రాత్రి వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ (94) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు.. ఓపెనర్ ఎవిన్ లూవిస్ (60), హార్దిక్ పాండ్య (36), సూర్యకుమార్ యాదవ్ (38) నిలకడగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

ఛేదనలో ఓపెనర్ డీఆర్క్ షార్ట్ (4) తొలి ఓవర్‌లో ఔటైనా.. అనంతరం వచ్చిన కెప్టెన్ అజింక్య రహానె (37)తో కలిసి జోస్ బట్లర్ రాజస్థాన్‌‌ని గెలుపు బాట పట్టించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కి అభేద్యంగా 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. 13 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ 104/1తో తిరుగులేని స్థితిలో నిలిచింది.

ఈ దశలో రహానె ఔటైనా.. అనంతరం సంజు శాంసన్ (26)తో కలిసి బట్లర్ గెలుపు లాంఛనాన్ని 18 ఓవర్లలో 171/3తో పూర్తి చేశాడు. టోర్నీలో రాజస్థాన్‌కి ఇది వరుసగా మూడో గెలుపు.


ముంబై ఇన్నింగ్స్:

ఐపీఎల్‌లో భాగంగా 47వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ పోరుకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక కానుంది. ఎట్టకేలకు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు సూర్యకుమార్‌ యాదవ్(38)‌, ఎవిన్‌ లూయిస్‌(60)లు శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ ఔటయ్యాడు.

ఆ మరుసటి బంతికే రోహిత్‌ శర్మ గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేరగా, కాసేపటికి లూయిస్‌ కూడా ఔటయ్యాడు. ఇషాన్‌ కిషాన్‌(12), కృనాల్‌ పాండ్యా(3)లు నిరాశపరిచినప్పటికీ, చివర్లో హార్దిక్‌ పాండ్యా(36) బ్యాట్‌ ఝుళిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరువికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, బెన్‌ స్టోక్స్‌లు తలో రెండు వికెట్లు తీయగా, ధావల్‌ కులకర్ణి, జయదేవ్‌ ఉనాద్కత్‌లు తలో వికెట్‌ తీశారు.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి: 86/0

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తున్నారు. ఓపెనర్లుగా దిగిన ఎవిన్ లూయీస్(45), సూర్యకుమార్ యాదవ్(38) క్రీజులోనే ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్:

ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకూ టోర్నీలో జరిగిన పోటీల్లో ఇరు జట్లు సమానంగా 10 పాయింట్లతోనే ఉండటం గమనార్హం.

1
43457

ప్లేఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే అనుకున్న మ్యాచ్ నుంచి కొసమెరుపుగా రాణిస్తోంది ముంబై జట్టు. జట్టులో అందరు ఆటగాళ్లు పట్టుదలతో శ్రమిస్తుండటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరుగా ఆడిన మ్యాచ్‌లలో రాజస్థాన్, ముంబైలు విడివిడిగా విజయంతోనే ముగించాయి.


ఆడనున్న ఇరుజట్లు:

ముంబై జట్టు:
Suryakumar Yadav, Evin Lewis, Rohit Sharma (c), Ishan Kishan (wk), Hardik Pandya, Ben Cutting, Krunal Pandya, JP Duminy, Mitchell McClenaghan, Mayank Markande, Jasprit Bumrah

రాజస్థాన్ జట్టు:
D'Arcy Short, Jos Buttler (wk), Ajinkya Rahane (c), Sanju Samson, Ben Stokes, Stuart Binny, Jofra Archer, Krishnappa Gowtham, Shreyas Gopal, Jaydev Unadkat, Dhawal Kulkarni

Story first published: Monday, May 14, 2018, 1:44 [IST]
Other articles published on May 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+