
హైదరాబాద్: హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా జరుగుతోన్న 46వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్ పూణె వేదికగా తలపడ్డాయి. ఐపీఎల్ 2018 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి రుచి చూపింది. పుణె వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ అంబటి రాయుడు (100) మెరుపు సెంచరీ బాదడంతో సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో చెన్నై గెలుపొందింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ (79) కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51) హాఫ్ సెంచరీలు బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఛేదనలో తొలి వికెట్‌కి రాయుడు- షేన్ వాట్సన్ (57) జోడి అభేద్యంగా 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి చెన్నై విజయానికి బాటలు వేయగా.. ఆఖర్లో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (20)తో కలిసి రాయుడు లాంఛనాన్ని మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌పై ఛేదనకు దిగిన జట్టు గెలుపొందడం ఇదే తొలిసారికాగా.. చెన్నై చేతిలో ఓడిపోవడం సీజన్‌లో హైదరాబాద్‌కి ఇది వరుసగా రెండోసారి.
మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై స్కోరు: 93/0
చేధనకు దిగిన చెన్నై ఆచితూచి ఆడుతూనే సమయం చూసి బాదేస్తోంది. పదో ఓవర్ పూర్తయ్యేసరికి రన్ రేట్9.30తో ఆడుతోంది. ఓపెనర్లుగా దిగిన అంబటి రాయుడు(43), షేన్ వాట్సన్ (50)లతో క్రీజులో ఉన్నారు. ఐపీఎల్ 11లో తొలిసారిగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఇంతటి రన్ రేట్ తో కొనసాగుతున్న జట్టు ఇదేనేమో అనే రీతిలో పరుగులు చేస్తున్నారు.
చెన్నై టార్గెట్ 180
చెన్నై అద్భుతమైన బౌలింగ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. అయినా జాగ్రత్తతో కూడిన ఆటతీరు కనబరిచారు హైదరాబాద్ ఆటగాళ్లు. అవనవసర షాట్‌లకు తావివ్వకుండా జాగ్రత్తగా ఆడి సాధ్యమైనంత వరకూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. గత మ్యాచ్ మాదిరిగానే కెప్టెన్ విలియమ్‌సన్, శిఖర్ ధావన్‌లు మంచి భాగస్వామ్యాన్ని ప్రదర్శించడంతోనే ఆ మాత్రం పరుగులు చేయగలిగారు. ఆరంభంలో తడబడిన హైదరాబాద్ జట్టు ఐదో ఓవర్ నుంచి ఊపందుకుంది. నాలుగో ఓవర్ కు మొదటి వికెట్‌ను కోల్పోయిన హైదరాబాద్ 16వ ఓవర్‌లో రెండో వికట్‌గా ధావన్ 49బంతుల్లో (79)ను చేజార్చుకుంది. ఆ తర్వాత రెండు బంతుల వ్యవధిలోనే విలియమ్‌సన్ 39బంతుల్లో (51)తో వెనుదిరిగారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా, షకీబ్ అల్ హసన్‌లు సైతం మంచి స్కోరును చేయగలిగారు.
మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి హైదరాబాద్ స్కోరు: 62/1
ప్లేఆఫ్ రేసులో ఎంట్రీని నిర్ధారించే లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు చక్కటి బౌలింగ్, ఫీల్డింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేస్తోంది. ఈ క్రమంలోనే మూడో ఓవర్ పూర్తి అయిన తర్వాత మూడో బంతికి దీపక్ చాహర్ వేసిన బంతికి అలెక్స్ హేల్స్ అవుటయ్యాడు.
లీగ్ ఆరంభం నుంచి బ్యాటింగ్ లో తడబాటుకు గురౌతున్న హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లో తీవ్రంగానే కష్టపడుతోంది. ఆరంభంలో కాస్త తడబడి తొలి ఓవర్ పూర్తయ్యేసరికి నుంచి ఒక పరుగు మాత్రమే చేసింది. నిదానంగా ఊపందుకున్నరైజర్స్ ప్రస్తుత ఓవర్‌లో 6కు తగ్గని రన్ రేట్‌ను కొనసాగిస్తున్నారు. పదో ఓవర్‌కి కేన్ విలియమ్‌సన్(16), శిఖర్ ధావన్(29) క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై:
ఈ క్రమంలో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11వ సీజన్‌లో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికర పోరును సన్‌రైజర్స్ జట్టు ట్వీట్ చేసింది.
సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, చెన్నై బెస్ట్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోల మధ్య పోరుగా చూస్తోంది. చెన్నైతో ఆడిన మ్యాచ్‌లలో బ్రేవో బ్యాటింగ్ చేసిన నాలుగు ఇన్నింగ్స్‌లకు గానూ మూడు పర్యాయాలు అతడి వికెట్‌ను సన్‌రైజర్స్ బౌలర్ షకీబ్ పడగొట్టాడు.
దాంతో పాటుగా ఆ ఇన్నింగ్స్‌లలో షకీబ్ వేసిన 12 బంతులను ఎదుర్కొన్న బ్రేవో.. సగానికి పైగా బంతులకు పరుగులు చేయలేకపోయాడు. హార్డ్ హిట్టర్‌గా పేరున్న బ్రేవోను తన తెలివైన బంతులతో షకీబ్ బోల్తా కొట్టించాడని.. ఆదివారం మ్యాచ్‌లో బ్రేవో వికెట్ తీస్తాడా.. లేక డాట్ బాల్స్ సంఖ్య పెంచుతాడో చూద్దామంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
ఆడనున్న ఇరు జట్లు:
చెన్నై జట్టు:
Shane Watson, Ambati Rayudu, Suresh Raina, MS Dhoni (c) (wk), Sam Billings, Dwayne Bravo, Ravindra Jadeja, David Willey, Harbhajan Singh, Shardul Thakur, Deepak Chahar
హైదరాబాద్ జట్టు:
Alex Hales, Shikhar Dhawan, Kane Williamson (c), Manish Pandey, Shakib Al Hasan, Deepak Hooda, Shreevats Goswami (wk), Rashid Khan, Bhuvneshwar Kumar, Siddarth Kaul, Sandeep Sharma