For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018: ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం: ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం

By Nageshwara Rao
 DD vs RCB

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో ఏబీ డివిలియర్స్(37 బంతుల్లో 72; 4 ఫోర్లు, 6 సిక్సులు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (40 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సులు) చెలరేగడంతో బెంగళూరు అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఇక, ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్‌కు రెండు వికెట్లు తీయగా, సందీప్ లమిచానే, హర్షల్ పటేల్, అమిత్ మిశ్రాలు తలో వికెట్ తీశారు.

అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.


1
43455

14 ఓవర్లకు బెంగళూరు 139/3
ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మెరుగ్గా ఆడుతోంది. హాఫ్ సెంచరీ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ (40 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సులు) ఔటైనా ఏబీ డివిలియర్స్ (29 బంతుల్లో 53: 4 ఫోర్లు, 4 సిక్సులు) నిలకడగా ఆడుతున్నాడు. దీంతో 14 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు 3 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. అంతకముందు ఓపెనర్లు పార్థీవ్ పటేల్ (6), మొయిన్ అలీ (1) తక్కువ స్కోరుకే ఔటైనా.. కోహ్లీ-డివిలియర్స్ జోడి మూడో వికెట్‌కి 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.


27 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లీ
ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్దేశించిన 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కసిగా ఆడుతున్నాడు. కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో ఏబీ డివిలియర్స్‌ (28) కూడా దూకుడుగా ఆడుతున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు 2 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది.


దూకుడుగా ఆడుతోన్న కోహ్లీ
ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్దేశించిన 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ దూకుడుగా ఆడుతున్నాడు. మూడు ఓవర్లలోపే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బెంగళూరు ఇన్నింగ్స్‌ను కోహ్లీ (36) బాధ్యతగా ఆడుతూ ముందుకు తీసుకుపోతున్నాడు. మరోవైపు డివిలియర్స్‌ (10) కూడా ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు 2 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది.


రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు
దిల్లీ డేర్‌డెవిల్స్‌ నిర్ధేశించిన 182పరుగుల లక్ష్యాన్నిఛేదించే క్రమంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతికి అలీ(1) పృథ్వీకి క్యాచ్ ఇచ్చి ఔటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఓవర్‌లో సందీప్‌ లామ్‌చానె బౌలింగ్‌లో పార్థీవ్‌ పటేల్‌ (6) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో బెంగళూరు మూడు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లీ (7), డివిలియర్స్‌ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు

ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్దేశించిన 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. లక్ష్య చేధనలో బెంగళూరు జట్టు తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతికి అలీ(1) పృథ్వీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 1 వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లీ(6), పటేల్(2) ఉన్నారు.


బెంగళూరు టార్గెట్ 182
ఐపీఎల్ 2018 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు మరోసారి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. ఫిరోజ్ షా కోట్ల వేదికగా శనివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లపై రిషబ్ పంత్ (61), అభిషేక్ శర్మ (46 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

16 ఓవర్లు ముగిసే సమయానికి 125/4తో నిలిచి తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించిన ఢిల్లీ చివర్లో అభిషేక్‌ శర్మ(19 బంతుల్లో 46నాటౌట్‌; 3ఫోర్లు, 4 సిక్సర్లు), విజయ్‌ శంకర్‌(20 బంతుల్లో 21 నాటౌట్‌; 2 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో ఢిల్లీ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది.

క్రీజులోకి వచ్చిన వెంటనే అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను మహ్మద్ సిరాజ్ జారవిడచడం వల్లే బెంగళూరు భారీ మూల్యం చెల్లించుకుంది. విజయ్ శంకర్‌తో కలిసి అభిషేక్ శరమ ఐదో వికెట్‌కి కేవలం 30 బంతుల్లో 61 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. బెంగళూరు బౌలర్లలో చహల్‌ రెండు వికెట్లు సాధించగా, సిరాజ్‌, మొయిన్‌ అలీ తలో వికెట్‌ దక్కించుకున్నారు.


15 ఓవర్లకు బెంగళూరు 120/3
కోట్లా వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కీలక వికెట్‌ చేజార్చుకుంది. హాఫ్ సెంచరీ సాధించిన రిషబ్‌ పంత్‌ (61) పరుగుల వద్ద ఔటయ్యాడు. మొయిన్‌ అలీ వేసిన 13వ ఓవర్ ఆఖరి బంతికి బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డర్‌ డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్‌ అయ్యర్‌ (32), విజయ్‌ శంకర్‌ (8) పరుగులతో ఉన్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది.


10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 78/2
కోట్లా వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడుతున్నారు. రిషబ్‌ పంత్‌ (35) దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ (25) చెలరేగి ఆడుతున్నాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది.


6 ఓవర్లు ముగిసే సరికి 44/2
కోట్లా వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. రిషబ్‌ పంత్‌ (17), శ్రేయస్‌ అయ్యర్‌ (10) పరుగులతో క్రీజులో ఉన్నారు.


ఆరంభంలోనే ఢిల్లీకి ఎదురుదెబ్బ
ఫిరోజ్ షా కోట్లా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలోనే ఢిల్లీకి ఎదురుదెబ్బ తగిలింది. యుజువేంద్ర చాహాల్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ పృథ్వీ షా(2) పరుగుల వద్ద ఔట్ కాగా, మళ్లీ చాహాల్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి జాసన్ రాయ్ (12)ని పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఢిల్లీ కోల్పోయిన రెండు వికెట్లు చాహాల్‌కే లభించాయి. ప్రస్తుతం 3 ఓవర్లకు గాను ఢిల్లీ 2 వికెట్లు కోల్పోయి 21 పరుగులు చేసింది. క్రీజులో అయ్యర్(5), పంత్(7) పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి 8 గంటలకు ఢిల్లీ డేర్‌డెవిల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. మనన్‌ వోహ్రా స్థానంలో సర్పరాజ్‌ ఖాన్‌ బరిలోకి దిగుతున్నట్లు కోహ్లీ తెలిపాడు.

ఈ సీజన్‌లో అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే నాకౌట్ దశకు చేరుకోవడంతో మిగతా మూడు బెర్తుల కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. దీంతో మిగిలిన రెండు స్థానాల కోసం పంజాబ్, ముంబై, కోల్‌కతా, రాజస్థాన్‌, బెంగళూరు తలపడుతున్నాయి.

జట్ల వివరాలు:

ఢిల్లీ డేర్ డెవిల్స్:
పృథ్వీ షా, జేసన్ రాయ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, హర్షల్ పటేల్, శర్మ, అమిత్ మిశ్రా, సందీప్ లమిచానే, జూనియర్ డాలా, ట్రెంట్ బౌల్ట్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
పార్దీవ్ పటేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, సింగ్, అలీ, సర్ఫరాజ్ ఖాన్, గ్రాండ్ హోమ్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహాల్

Story first published: Saturday, May 12, 2018, 23:44 [IST]
Other articles published on May 12, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+