For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లోనే కోల్‌కతా అత్యధిక స్కోరు 245: పంజాబ్‌పై ఘన విజయం

By Nageshwara Rao
Kolkata Knight Riders

హైదరాబాద్: ఇండోర్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ చివరి బంతి వరకూ పోరాడి ఎనిమిది వికెట్లు కోల్పోయి 214 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కింగ్స్‌ ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌(66; 29 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు) మరోసారి హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, క‍్రిస్‌ గేల్‌(21), అరోన్‌ ఫించ్‌(34), అశ్విన్‌(45) దూకుడుగా ఆడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్‌ మూడు వికెట్లు తీయగా, నరైన్‌, ప్రసిధ్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌, సీర్లెస్‌లు తలో వికెట్‌ తీశారు.

అంతకముందు కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది.


18 ఓవర్లకు పంజాబ్ 190/6
ఇండోర్ వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 18 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్ రెండో బంతికి ఆరోన్ ఫించ్(34) పరుగుల వద్ద శీర్లేస్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో ఆండ్రు టై(14), రవిచంద్రన్ అశ్విన్(45) పరుగులతో ఉన్నారు.


15 ఓవర్లకు పంజాబ్ 150/5
ఇండోర్ వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 15 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఆరోన్ ఫించ్(28), అశ్విన్ (10) పరుగులతో ఉన్నారు.


12 ఓవర్లకు పంజాబ్ 121/5
ఇండోర్ వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుసగా వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ ఆఖరి బంతికి అక్షర పటేల్(19) పరుగుల వద్ద శీర్లేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 12 ఓవర్లకు గాను పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఆరోన్ ఫించ్(7) పరుగులతో క్రీజులో ఉన్నాడు.


10 ఓవర్లకు పంజాబ్ 101/4
ఇండోర్ వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో కీలక వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్(66) పరుగుల వద్ద సునీల్ నరైన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అంతకముందు కరుణ్ నాయర్(3) పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో 10 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. క్రీజులో అక్షర పటేల్(6), ఆరోన్ ఫించ్(3) పరుగులతో ఉన్నారు.


6 ఓవర్లకు పంజాబ్ 58/2
ఇండోర్ వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయింది. ఆండ్రూ రస్సెల్ వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ క్రిస్ గేల్(21) పరుగుల వద్ద పెవిలియన్కు చేరగా, ఆ తర్వాతి బంతికే మయాంక్ అగర్వాల్ పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 2 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(36), కరుణ్ నాయర్ (0) పరుగులతో ఉన్నారు.


దూకుడుగా కేఎల్ రాహుల్
కోల్‌కతా నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 51 పరుగులు చేసింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (35) దూకుడుగా ఆడుతున్నాడు. గేల్‌ (15) పరుగులతో క్రీజులో ఉన్నాడు.


3 ఓవర్లకు పంజాబ్
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన 246 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లోకేశ్‌ రాహుల్‌ (26), క్రిస్ గేల్‌ (9) పరుగులతో ఉన్నాడు.


పంజాబ్‌ విజయ లక్ష్యం 246
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ పరుగుల వర్షం కురిపించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది.

దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు 246 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల ప్రకారం చూస్తే ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది. మైదానం నలువైపులా బౌండరీలు కొడుతూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచారు. కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ సునీల్ నరైన్ (75: 36 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (50: 23 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) చెలరేగారు.

క్రిస్ లిన్ (27: 17 బంతుల్లో 2x4, 2x6), రాబిన్ ఉతప్ప (24: 17 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సు), ఆండ్రీ రసెల్ (31: 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు)తో ఫరవాలేదనిపించారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌‌లో దినేశ్ కార్తీక్ భారీ షాట్లతో చెలరేగారు. పంజాబ్ బౌలర్లలో ఆండ్రూ టై (4/41) మినహా మిగతావారంతా చేతులెత్తేశారు.

కోల్‌కతా ఇన్నింగ్స్‌లో మొత్తం 15 సిక్సర్లు, 19 ఫోర్లు నమోదవడం విశేషం. అంటే, 166 పరుగులు బౌండరీల రూపంలో వచ్చాయి. బరిందర్ శ్రణ్, మోహిత్ శర్మలు తలో వికెట్ తీసుకున్నారు.


18 ఓవర్లకు కోల్‌కతా 222/5
ఇండోర్ వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆండ్రు టై వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ ఆఖరి బంతికి ఆండ్రూ రస్సెల్(31) పరుగుల వద్ద కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దినేశ్ కార్తీక్‌తో కలిసి ఆండ్రూ రస్సెల్ నాలుగో వికెట్‌కి 31 బంతుల్లో 76 పరుగులు జోడించాడు. ఆ తర్వాతి ఓవర్‌లో నితీష్ రాణా(11) పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో 18 ఓవర్లకు గాను కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. క్రీజులో దినేశ్ కార్తీక్(45), శుభమాన్ గిల్(4) పరుగులతో ఉన్నారు.


16 ఓవర్లకు కోల్‌కతా 190/3
ఇండోర్ వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి ఆ జట్టు 190 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్(36), ఆండ్రూ రస్సెల్(26) పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ చెలరేగుతున్నాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో రెండు సిక్సులు, రెండు ఫోర్లతో మొత్తం 21 పరుగులు పిండుకున్నాడు.


రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
ఇండోర్ వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఓకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 128 పరుగుల వద్ద సునీల్ నరైన్ (75) ఆండ్రూ టై బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా... ఆ తర్వాత అదే ఓవర్ ఐదో బంతికి రాబిన్ ఊతప్ప(24) పరుగుల వద్ద మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. 12 ఓవర్లకు గాను కోల్‌కతా 3 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. క్రీజులో దినేశ్ కార్తీక్(1), ఆండ్రూ రస్సెల్(1) పరుగుతో ఉన్నారు.


10 ఓవర్లకు కోల్‌కతా 106/1
ఇండోర్ వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ సునీల్ నరైన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 10 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది. క్రీజులో
సునీల్ నరైన్(55), రాబిన్ ఊతప్ప (22) పరుగులతో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా
ఇండోర్ వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఆండ్రూ టై వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ క్రిస్ లిన్(27) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సునీల్ నరైన్(31), రాబిన్ ఊతప్ప (1) పరుగులతో ఉన్నారు.


5 ఓవర్లకు కోల్‌కతా 19/0
ఇండోర్ వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్లకు గాను ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో క్రిస్ లిన్ (21), సునీల్ నరైన్ (26) పరుగులతో ఉన్నారు.


3 ఓవర్లకు కోల్‌కతా 19/0
ఇండోర్ వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లకు గాను ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో క్రిస్ లిన్ (12), సునీల్ నరైన్ (7) పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్-కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

అనంతరం అశ్విన్ మాట్లాడుతూ 'ఇది చిన్న మైదానం కావడంతో ఫీల్డింగ్‌కే తాము మొగ్గు చూపినట్టు చెప్పాడు. తొలుత బ్యాటింగ్ చేస్తే లక్ష్యాన్ని రక్షించుకోవడం కష్టమని, అందుకే బౌలింగ్ ఎంచుకున్నట్టు' చెప్పుకొచ్చాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు స్వల్ప మార్పులతో బరిలోకి దిగాయి.

1
43454

టామ్ కుర్రన్‌ను పక్కనపెట్టిన కోల్‌కతా అతడి స్థానంలో జావోన్ సీర్లెస్‌ను తుది జట్టులోకి తీసుకోగా.... పంజాబ్ జట్టు నాథ్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను, తివారీ స్థానంలో బరిందర్ శ్రాన్‌ను, స్టోయిన్స్ స్థానంలో ఆరోన్ ఫించ్‌లకు తుది జట్టులో చోటు కల్పించింది.

టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లాడిన పంజాబ్ జట్టు ఆరింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. 11 మ్యాచ్‌లాడిన కోల్‌కతా జట్టు ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఐదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే.. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా తప్పక గెలవాల్సి పరిస్థితి.

దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా... మిగతా మూడు స్థానాల కోసం చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్‌ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి.

జట్ల వివరాలు:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
క్రిస్‌గేల్, లోకేశ్ రాహుల్, మయాంక్ అగర్వాల్, అరోన్ ఫించ్, కరుణ్ నాయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఆండ్రూ టై, మోహిత్ శర్మ, బరిందర్ శరణ్, ముజీబ్ రెహ్మాన్

కోల్‌కతా నైట్‌రైడర్స్:
క్రిస్‌లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, శుభమన్ గిల్, నితీశ్ రానా, దినేశ్ కార్తీక్, ఆండ్రీ రసెల్, జవాన్ సార్లెస్, పీయూస్ చావ్లా, ప్రసీద్, కుల్దీప్ యాదవ్

Story first published: Saturday, May 12, 2018, 19:55 [IST]
Other articles published on May 12, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+