For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉప్పల్‌‌‌లో బెంగళూరుతో మ్యాచ్: తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

By Nageshwara Rao
SRH vs RCB

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది.

దీంతో కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడటం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, బెంగళూరు రెండు మార్పులు చేసింది.

బ్రెండన్‌ మెకల్లమ్‌, మురుగన్‌ అశ్విన్‌ల స్థానాల్లో మొయిన్‌ అలీ, మనన్‌ వోహ్రాలను తుది జట్టులోకి తీసుకంది. ఈ సీజన్‌లో మొయిన్‌ అలీకి తొలి తొలి మ్యాచ్ కావడం విశేషం. కాగా, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయాలతో మంచి ఊపు మీద ఉండగా, రాయల్‌ చాలెంజర్స్‌ మాత్రం వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతోంది.

ఇప్పటివరకూ సన్‌రైజర్స్‌ 9 మ్యాచ్‌లకు గాను 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉండగా, ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో మూడింట మాత్రమే విజయం సాధించి ఆరో స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో గనుక విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్తుని కన్ఫమ్ చేసుకుంటుంది.

మరోవైపు ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే రాయల్ ఛాలెంజర్స్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ సీజన్‌లో మిగిలిన నాలుగు గేమ్‌ల్లో గెలిస్తేనే రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో ఉన్న ఆర్‌సీబీ ఈ నాలుగింటిలో ఏ ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవాల్సిందే.

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన చేసి ఈ సీజన్‌లో ఏడో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక, చెన్నైతో గత మ్యాచ్‌లో తలపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని మూటగట్టుకుంది.

జట్ల వివరాలు:
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:

కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), షకీబ్ ఉల్‌ హసన్‌, యూసఫ్‌ పఠాన్‌, శిఖర్‌ ధావన్‌, వృద్ధిమాన్‌ సాహా, భువనేశ్వర్‌ కుమార్‌, సిద్దార్థ్‌ కౌల్‌, మనీష్‌ పాండే, అలెక్స్‌ హేల్స్‌, సందీప్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు:
విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), మొయిన్‌ అలీ, ఏబీ డివిలియర్స్‌, పార్థీవ్‌ పటేల్‌, టిమ్‌ సౌతీ, ఉమేశ్‌ యాదవ్‌, మన్‌దీప్‌ సింగ్‌, యజ్వేంద్ర చాహల్‌, గ్రాండ్‌ హోమ్‌, మనన్‌ వోహ్రా, మహమ్మద్ సిరాజ్‌

Story first published: Tuesday, May 8, 2018, 9:30 [IST]
Other articles published on May 8, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+