
హైదరాబాద్: క్లిష్టమైన పరిస్థితుల్లో జట్టును గెలిపించాలనే ఉద్దేశ్యంతో ముంబై ఆటగాళ్లు సొంతగడ్డపై విజయాన్ని సాధించారు.మ్యాచ్ ముగిసే సమయానికి దినేశ్ కార్తీక్ క్రీజులో ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఆశ అతనిపైనే.. కేవలం బౌండరీలతోనే మ్యాచ్ గెలిపించాల్సిన పరిస్థితి. అంతటి క్లిష్టమైన ఓవర్‌ను ముంబై చాలా చక్కగా వేసి సునీల్ నరైన్ వికెట్‌ను తీయగలిగింది. చేధనకు దిగిన కోల్‌కతా.. సునీల్ వికెట్‌తో కలిపి ఐదు వికెట్లను కోల్పోయింది.
కోల్‌కతా జట్టులో ఊతప్ప మినహాయించి ఒక్కరూ 40కి మించిన స్కోరు చేయలేకపోయారు. దీంతో కోల్‌కతా ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 13పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది.
ఇక బౌలింగ్ విషయానికొస్తే ముంబై జట్టు గట్టి పట్టుదలతో ఆడినట్లు కనిపిస్తోంది. పటిష్టమైన ఫీల్డింగ్‌ను కనబర్చిన ముంబై మిచెల్ మెక్లెన్‌గన్ (1/30), జస్ప్రీత్ బుమ్రా(1/34), హార్థిక్ పాండ్యా(2/19), కృనాల్ పాండ్యా (1/29), మయాంక్ మార్కండే(1/25) చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి: 91/2
దూకుడు మీద ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన కోల్‌కతా జట్టు జోరు కాస్త తగ్గింది. ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన మెక్లనగాన్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ఓపెనర్ క్రిస్‌లిన్ (17) ఆ ఓవర్‌లోని ఐదో బంతికి ఔటవగా.. తర్వాత ఓవర్ తొలి బంతికే శుభమన్ గిల్ (7) సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి ఫీల్డర్ కృనాల్ పాండ్య చేతికి చిక్కాడు. దీంతో.. 4 ఓవర్లు ముగిసే సమయానికి కోల్‌కతా 33/2తో ఇబ్బందుల్లో పడింది.
ఇద్దరూ తక్కువ స్కోరుతోనే వెనుదిరగడంతో తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రాబిన్ ఊతప్పపైనే ఆశలు పెట్టుకుంది దినేశ్ సేన. కేవలం 35బంతుల్లోనే 54 పరుగులు చేసిన ఊతప్ప 12.4వ బంతికి అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్ కార్తీక్, నితీశ్ రాణా ఆచితూచి ఆడుతుండటంతో జట్టు స్కోరును మంచి బౌండరీలతో నడిపిస్తున్నారు.
181/4పరుగులతో ముగిసిన ముంబై ఇన్నింగ్స్:
స్పిన్నర్లు బాగా రాణించడంతో ముంబై జట్టును 181 పరుగులకే కట్టడి చేసింది దినేశ్ కార్తీక్ జట్టు. ఓపెనర్‌గా దిగి దూకుడుగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14.2 ఓవర్ల వద్ద ఆండ్రీ రస్సెల్ చేతికే చిక్కి అవుట్ అయ్యాడు. అతని తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్యా 11బంతులు ఆడి 14 పరుగులు చేయగలిగాడు. చివరగా మైదానంలో అడుగుపెట్టిన డుమిని బ్యాటింగ్‌లో పరవాలేదనిపించాడు.
దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ముంబై జట్టుకు భారీ స్కోరు చేయకుండా మంచి ఫీల్డింగ్ తో కట్టడి చేశారు కోల్‌కతా జట్టు. ఆరంభంలో కాస్త తడబడ్డా నిదానంగా నిలదొక్కుకుంది. దీంతో ముంబై జట్టు 181 పరుగులు చేసి 4 వికెట్ల నష్టంతో ఇన్నింగ్స్‌ను ముగించింది.
రెండో వికెట్‌గా రోహిత్‌ను కోల్పోయిన ముంబై జట్టు:
వచ్చిన కాసేపటిలో కెప్టెన్ రోహిత్ శర్మ వెనుదిరిగాడు. కెప్టెన్ మీదే భారీ ఆశలు పెట్టుకున్న జట్టును నీరుగార్చాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి తడబడుతూ ఆడిన రోహిత్ 11 బంతుల్లో 11పరుగులు చేయగలిగాడు. అతని తర్వాత ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై స్కోరు: 95/1
వరుస వైఫల్యాలతో విసుగెత్తిపోయిన ముంబై జట్టు భారీ పట్టుదలతో క్రీజులోకి దిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన ఓపెనర్లుగా సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్ చేశారు. లను దింపింది. కాగా దూకుడు మీద ఆడుతున్న ముంబై ఓపెనర్లకు ఆండ్రీ రస్సెల్ కళ్లెం వేశాడు. రస్సెల్ వేసిన 9 ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన ఎవిన్ లూయిస్ 28 బంతుల్లో (43) క్రిస్ లిన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతున్నాడు. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో (48)పరుగులతో చక్కని భాగస్వామ్యం అందిస్తున్నాడు.
టాస్ గెలిచి కోల్‌కతా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు సొంతగడ్డపై ఆడేందుకు సిద్ధమై పరువు నిలుపుకోవాలనే తాపత్రయంలో ఉంది. ఇప్పటి వరకూ ఐపీఎల్ 11వ సీజన్‌లో గెలిచిన మ్యాచ్‌లలో హిట్ మాన్ రోహిత్ షోనే ప్రధానంగా మారింది. ఈ సారి ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే చివరి ఐదు మ్యాచ్‌ల్లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ముంబైపై కోల్‌కతా నెగ్గితే ఒక టీమ్ కథ ముగిసినట్టే.
ముంబై ఇండియన్స్ ఆరు పాయింట్లతో ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. రికీ సింగ్ స్థానంలో నితీశ్ రాణా మళ్లీ జట్టులోకి రాగా.. శివమ్ మావి గాయపడటంతో.. అతని స్థానంలో ప్రసీద్ కృష్ణని జట్టులోకి తీసుకుంది. ముంబై మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.
ఇరుజట్లు:
Mumbai Indians:
Sura Kumar Yadav, Evin Lewis, Ishaan Kishan, Rohit Sharma (Captain), JP Duminy, Hardy Pandya, Cruel Pandya, Ben Cutting, Mitchell McLagan, Mayank Markande, Jasprit Bumra.
Kolkata Knight Riders:
Chris Lin, Sunil Narine, Robin Uthappa, Shuban Gill, Nitish Rane / Rinku Singh, Dinesh Karthik (Captain), Andre Russell, Shivam Mavi, Piyush Chawla, Mitchell Johnson / Tom Khurran, Kuldeep Yadav.