For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్ ప్లే‌ఆఫ్స్‌కు చేరినట్టే!: ఉప్పల్‌లో ఢిల్లీపై ఘన విజయం

By Nageshwara Rao
Kane

హైదరాబాద్: ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఉప్పల్ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఇంకో బంతి మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి చేధించింది.

తాజా విజయంతో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్‌ ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో ప్లే ఆఫ్‌ బెర్తును కూడా దాదాపు ఖాయం చేసుకుంది. హైదరాబాద్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (30 బంతుల్లో 32: 1 సిక్సు) కీలకపాత్ర పోషించాడు.

ఢిల్లీ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌కు మంచి శుభారంభం లభించింది. అలెక్స్‌ హేల్స్‌(45;31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్‌ ధావన్‌(33; 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, ఆ తర్వాత మనీష్‌ పాండే(21), కేన్‌ విలియమ్సన్‌(32 నాటౌట్‌), యూసఫ్‌ పఠాన్‌(27 నాటౌట్‌) జట్టుకు విజయాన్నందించారు.

1
43446

ఢిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రాకు 2 వికెట్ల దక్కగా, ప్లంకెట్ ఒక వికెట్ తీసుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.


18 ఓవర్లకు హైదరాబాద్ 136/3
ఉప్పల్ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది. ప్లంకెట్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ తొలి బంతికి మనీష్ పాండే(21) పరుగుల వద్ద పృథ్వీషాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 18 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్(30), యూసఫ్ పఠాన్(2) పరుగులతో క్రీజులో ఉన్నారు.


12 ఓవర్లకు హైదరాబాద్ 92/2
ఉప్పల్ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. దూకుడుగా ఆడుతున్న అలెక్స్ హేల్స్(45) పరుగుల వద్ద ఇన్నింగ్స్ 9వ ఓవర్ ఆఖరి బంతికి అమిత్ మిశ్రా పెవిలియన్‌కు చేర్చగా, ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఆఖరి బంతికి శిఖర్ ధావన్‌(33)ను మళ్లీ అమిత్ మిశ్రానే పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 12 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్(6), మనీష్ పాండే(3) పరుగులతో ఉన్నారు.


8 ఓవర్లకు హైదరాబాద్ 68/0
ఉప్పల్ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. తొలి నాలుగు ఓవర్లకు 23 పరుగులు చేసిన ఓపెనర్లు 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 61 పరుగులు సాధించారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముందు ధావన్‌ (22) సిక్స్‌ కొట్టగా, తర్వాత హేల్స్‌ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు వచ్చాయి. దీంతో ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ వికెటేమీ కోల్పోకుండా 68 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హేల్స్ (43), శిఖర్ ధావన్ (22) పరుగులతో ఉన్నారు.


మ్యాక్స్‌వెల్ క్యాచ్ మిస్: నిలకడగా హైదరాబాద్ ఓపెనర్లు
ఉప్పల్ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. అవేశ్‌ ఖాన్‌ వేసిన రెండో ఓవర్‌ నాలుగో బంతికే ఓపెనర్‌ (15) ఔట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మాక్స్‌వెల్‌ క్యాచ్‌ మిస్ చేశాడు. దీంతో హేల్స్‌ బతికిపోయాడు. దీంతో 4 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో ధావన్(6), హేల్స్(15) పరుగులతో ఉన్నారు.


హైదరాబాద్ విజయ లక్ష్యం 164

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. దీంతో సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్‌‌కు 164 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.


17 ఓవర్లకు ఢిల్లీ 135/5
ఉప్పల్ వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 17 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన పృథ్వీ షా (65) జట్టు స్కోరు 95 వద్ద ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ బౌలింగ్ చేసిన స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పృథ్వీ షా స్లిప్‌లో సిద్ధార్థ కౌల్ చేతికి చిక్కాడు. అనంతరం నిలకడగా ఆడిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (44) పరుగుల వద్ద ఔట్ కాగా, ఆ తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ (18) పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో విజయ్ శంకర్(1), డానియేల్ క్రిస్టియన్(1) పరుగుతో ఉన్నారు.


రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
ఉప్పల్ వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ రెండో వికెట్‌ కోల్పోయింది. రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతికి పృథ్వీషా (65) పరుగుల వద్ద సిద్ధార్ద్ కౌల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ డేర్ డెవిల్స్ 2 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(2), శ్రేయస్ అయ్యర్(28) పరుగులు చేశారు.


10 ఓవర్లకు ఢిల్లీ 95/1
ఉప్పల్ వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లకు ముగిసే సరికి వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీషా (65), శ్రేయస్ అయ్యర్ (27) పరుగులతో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
ఉప్పల్ వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తొలి వికెట్‌ కోల్పోయింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ పృథ్వీషా (21)తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్‌ (2) ఔటయ్యాడు. సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్‌ నాలుగో బంతికి పృథ్వీ షా స్ట్రైట్ డ్రైవ్ ఆటగా.. ఆ బంతి శర్మ చేతికి తగిలి వికెట్లకు తాకింది. ఆ సమయంలో నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న మాక్స్‌వెల్‌ క్రీజు బయట ఉన్నాడు. దీంతో అంపైర్‌ అతడిని ఔట్‌గా ప్రకటించాడు. ప్రస్తుతం 3 ఓవర్లకు ఢిల్లీ వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి 8 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించి 12 పాయింట్లతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంకో 2, 3 విజయాలు సాధిస్తే సన్‌రైజర్స్‌ దాదాపుగా నాకౌట్లో అడుగుపెట్టినట్లే.

మరోవైపు ఢిల్లీ విషయానికి వస్తే ఆడిన 9 మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించి పట్టికలో ఆఖరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ నాకౌట్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని కొనసాగించాలనే హైదరాబాద్ భావిస్తోంది.

రాజస్థాన్ రాయల్స్‌పై గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో అద్వితీయ విజయాన్ని అందుకున్న హైదరాబాద్ ఉత్సాహంతో బరిలోకి దిగుతుండగా.. అదే జట్టుపై చివరి బంతి వరకూ పోరాడి గెలిచిన ఢిల్లీ కూడా ఇప్పుడు మంచి జోరుమీదుంది. ముఖ్యంగా.. ఢిల్లీ యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌, పృధ్వీ షా భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లని బెంబేలెత్తిస్తున్నారు.

జట్ల వివరాలు:

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:
హేల్స్‌, ధావన్‌, విలియమ్సన్‌ (కెప్టెన్‌), మనీష్‌ పాండే, షకిబ్‌, యూసుఫ్‌ పఠాన్‌, సాహా (వికెట్‌ కీపర్‌), రషీద్‌ఖాన్‌, బాసిల్‌ థంపి, సందీప్‌శర్మ, కౌల్‌

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌:
పృథ్వీ షా, మన్రో, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), మ్యాక్స్‌వెల్‌, విజయ్‌ శంకర్‌, ప్లంకెట్‌, అమిత్‌ మిశ్ర, నదీమ్‌, అవేష్‌ఖాన్‌, బౌల్ట్‌.

Story first published: Saturday, May 5, 2018, 23:56 [IST]
Other articles published on May 5, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+