For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండోర్‌లో పంజాబ్‌తో మ్యాచ్: ఐపీఎల్‌లో ముంబైకు మరో విజయం

By Nageshwara Rao
MI

హైదరాబాద్: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 4 వికెట్లో కోల్పోయి చేధించింది.

ముంబై ఆటగాళ్లలో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (57) హాఫ్ సెంచరీతో రాణించగా... ఎవిన్ లూయిస్(10), ఇషాన్ కిషన్(25), పాండ్యా (23), రోహిత్ శర్మ( 24 నాటౌట్), కృనాల్ పాండ్యా (31 నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో ముజీబ్ రెండు వికెట్లు తీసుకోగా... ఆండ్రూ టై, మార్కస్ స్టోనియిస్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ 174 పరుగులు చేసింది.


15 ఓవర్లు ముగిసే సరికి ముంబై 118/3
పంజాబ్‌ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 15 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (22), రోహిత్ శర్మ(3) పరుగులతో ఉన్నారు. అంతకముందు ఇషాన్ కిషన్(25), సూర్యకుమార్ యాదవ్ (57) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరారు.


10 ఓవర్లు ముగిసే సరికి ముంబై 67/1
పంజాబ్‌ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. ఇరు జట్లు గెలిచేందుకు తీవ్రంగా పోరాడుతున్నాయి. ప్రస్తుతం క్రీజులో సూర్య కుమార్‌ (51)ఇషాన్‌ కిషన్‌ (5) పరుగులతో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన ముంబై
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ వేసిన 5.4వ బంతికి ఎవిన్‌ లూయిస్‌ (10) కీపర్‌ లోకేశ్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్‌ (28), ఇషాన్‌ కిషన్‌ (0) పరుగులతో ఉన్నారు.


3 ఓవర్లకు ముంబై 20/0
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు. దీంతో మూడు ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెటేమీ కోల్పోకుండా 20పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్‌ (11), లూయిస్‌ (9) పరుగులతో ఉన్నారు.


ముంబై విజయ లక్ష్యం 175

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 175 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు చక్కటి ఆరంభాన్ని అందించారు. తొలి ఆరు ఓవర్లలో వికెట్ కాపాడుకుంటూ పరుగులు రాబట్టారు. ఆ తర్వాత మాయాంక్ మార్కండే వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి కేఎల్ రాహుల్(24) డీప్ మిడ్ వికెట్‌ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించి డుమినీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అనంతరం మరో ఓపెనర్ క్రిస్ గేల్ దూకుడుగా ఆడాడు 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు బాది 50 పరుగులు చేసి కట్టింగ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత యువరాజ్ సింగ్(14) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.

ఈ నేపథ్యంలో కురుణ్ నైర్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. 12 బంతుల్లో 1 ఫోరు, 2 సిక్సులు బాది 23 పరుగులు చేసి మెక్‌క్లాగాన్ బౌలింగ్‌లో హార్థిక్‌ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్‌లో అక్షర పటేల్(13) క్యాచ్ ఔట్ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు.

చివర్లో స్టోనియస్(25) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లన్‌గన్, బుమ్రా, హార్థిక్ పాండ్యా, బెన్ కట్టింగ్ తలో వికెట్ తీసుకున్నారు.


17 ఓవర్లకు పంజాబ్ 135/5
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్కస్ స్టోనియిస్(2), మయాంక్ అగర్వాల్ పరుగులేమీ చేయకుండా ఉన్నాడు. జట్టు స్కోరు 54 వద్ద కేఎల్ రాహుల్ (24) ఔట్ కాగా, ఇన్నింగ్స్ 13వ ఓవర్‌‌లో లేని పరుగు కోసం ప్రయత్నించి యువరాజ్ సింగ్ (14) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ (23) ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో సిక్స్ కొట్టే ప్రయత్నంలో ఔటయ్యాడు. అనంతరం అక్షర పటేల్(13) పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.


మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. తొలి ఆరు ఓవర్లలో వికెట్ కాపాడుకుంటూ.. పరుగులు రాబట్టారు. అయితే మాయాంక్ మార్కండే వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి కేఎల్ రాహుల్(24) డీప్ మిడ్ వికెట్‌ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించి డుమినీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ క్రిస్ గేల్ దూకుడుగా ఆడాడు 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు బాది 50 పరుగులు చేసి కట్టింగ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే యువరాజ్ సింగ్(14) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. క్రీజ్‌లో నాయర్(1), అక్షర్ పటేల్(2) పరుగులతో ఉన్నారు.


గేల్ ఔట్: రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన బెన్ కటింగ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టే ఉద్దేశంతో క్రిస్‌గేల్ (50: 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) భారీ షాట్ ఆడగా.. గాల్లోకి లేచిన బంతి బౌండరీ లైన్‌కి సమీపంలో ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ ఒడిసి పట్టుకున్నాడు. దీంతో 88 పరుగుల వద్ద క్రిస్ గేల్‌ వికెట్‌ని పంజాబ్ కోల్పోయింది. దీంతో 12 ఓవర్లకు గాను పంజాబ్ 2 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. క్రీజులో కరుణ్ నాయర్ (1), యువరాజ్ సింగ్(6) పరుగులతో ఉన్నారు.


10 ఓవర్లకు పంజాబ్ 78/1
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో క్రిస్ గేల్ (43), యువరాజ్ సింగ్ (3) పరుగులతో ఉన్నారు.


కేఎల్ రాహుల్ ఔట్, 7 ఓవర్లకు పంజాబ్ 51/1
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. మయాంక్ మార్కండే వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్ నాలుగో బంతికి కేఎల్ రాహుల్ (24) పరుగుల వద్ద డుమినికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. క్రీజులో క్రిస్ గేల్ (28), యువరాజ్ సింగ్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.


పంజాబ్ 5 ఓవర్లకు 37/0
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (20) తన షాట్లతో అలరిస్తున్నాడు. మరో ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ (16) ఆచితూచి ఆడుతున్నాడు.


నిలకడగా పంజాబ్ ఓపెనర్లు
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ నిలకడగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (16) తన షాట్లతో అలరిస్తున్నాడు. మరో ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ (1) ఆచితూచి ఆడుతున్నాడు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

పేలవ ఫామ్‌తో నిరాశ పరుస్తోన్న కీరన్ పొలార్డ్‌ స్థానంలో ఓపెనర్ ఎవిన్ లావిస్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. గత మ్యాచ్‌లో మిడిలార్డర్ ఫెయిలవడంతో.. పంజాబ్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. యువరాజ్ సింగ్, స్టాయినిస్, అక్షర్ పటేల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే ముంబై ఇండియన్స్ ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. కెప్టెన్ రోహిత్ శర్మ నిలకడలేమీ ఆ జట్టుని ఇబ్బంది పెడుతోంది. ఇప్పటి వరకు రోహిత్ రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడగా.. ఆ రెండింటిలోనూ ముంబై గెలుపొందింది.

రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వగా, హైదరాబాద్ చేతిలో పంజాబ్ 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓపెనర్లు క్రిస్‌గేల్, కేఎల్ రాహుల్ ఆ జట్టుకి మెరుగైన ఆరంభాలు ఇస్తుండగా.. బౌలర్లు సమష్టిగా రాణిస్తూ ప్రత్యర్థుల్ని కట్టడి చేస్తున్నారు.

1
43444

దీంతో ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన ముంబై 2 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి 10 పాయింట్లతో టాప్-4లో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారిగా కూడా తలపడలేదు.

జట్ల వివరాలు:


ముంబై ఇండియన్స్:
సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లివీస్, ఇశాన్ కిషన్(కీపర్), డుమినీ, రోహిత్ శర్మ(కెప్టెన్), హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, బెన్ కట్టింగ్, మిషెల్ మెక్‌క్లాన్‌గాన్, మయాంక మార్కండే, జస్ప్రీత్ బుమ్రా.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
కేఎల్ రాహుల్(కీపర్), క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నైర్, యువరాజ్ సింగ్, మార్కస్ స్టొనిస్, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, అండ్రూ టై, అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ ఉర్ రహ్మన్.

Story first published: Friday, May 4, 2018, 23:49 [IST]
Other articles published on May 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+