For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈడెన్‌లో కోల్‌కతాకు తిరుగులేని రికార్డు: చెన్నైపై ఘన విజయం

By Nageshwara Rao
KKR vs CSK

హైదరాబాద్: ఐపీఎల్‌లో వరుస విజయాలతో జోరుమీదన్న చెన్నైకి కోల్‌కతా షాకిచ్చింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 17 .4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది.

తాజా విజయంతో ఈడెన్‌లో కోల్‌కతా తన రికార్డుని మరింతగా మెరుగుపరచుకుంది. గత ఐదేళ్లలో ఇక్కడ కోల్‌కతా ఛేజింగ్‌ చేసే క్రమంలో ఒకే ఒక్క మ్యాచ్‌లో పరాజయం చెందడం ఆ జట్టు బలాన్ని చూపెడుతోంది. 2013 నుంచి చూస్తే కోల్‌కతా ఇక్కడ 14 మ్యాచ్‌ల్లో ఛేజింగ్‌ చేయగా అందులో ఒకదాంట్లో మాత్రమే ఓటమి పాలైంది.

తాజా విజయంతో ఈ సీజన్‌లో చెన్నై చేతిలో ఎదురైన ఓటమికి కోల్‌కతా ప‍్రతీకారం తీర్చుకుంది. కోల్‌కతా ఆటగాళ్లలో శుభ్‌మాన్‌ గిల్‌(57 నాటౌట్; 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు‌), దినేశ్‌ కార్తీక్‌(45 నాటౌట్; 7ఫోర్లు,1 సిక్స్‌‌)లు రాణించగా, సునీల్‌ నరైన్‌(32; 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.

చెన్నై బౌలర్లలో ఎంగిడి, ఆసిఫ్, హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.


15 ఓవర్లకు కోల్‌కతా 141/4
178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 15 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మాన్ గిల్(48), కెప్టెన్ దినేశ్ కార్తీక్(17) పరుగులతో ఉన్నారు. అంతకముందు రింకూ సింగ్ (16) పరుగుల వద్ద హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.


10 ఓవర్లకు కోల్‌కతా 90/3
178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 10 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మాన్ గిల్(18), రింకూ సింగ్(15) పరుగులతో ఉన్నారు. లుంగీ ఎంగిడి వేసిన మొదటి ఓవర్‌లో రెండు సిక్సులు బాదిన క్రిస్ లిన్(12) అదే ఓవర్‌ చివరి బంతికి వాట్సన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత రాబిన్ ఉతప్ప (6) పరుగులు వద్ద భారీ షాట్ ఆడేందుకు యత్నించి బ్రావో‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

దీంతో పవర్ల ప్లేలో ముగిసే సమయానికి కోల్‌కతా రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. సునీల్ నరైన్ మాత్రం వేగంగా పరుగులు రాబట్టాడు. అసిఫ్ బౌలింగ్‌లో నరైన్ ఇచ్చిన రెండు వరుస క్యాచ్‌లను జడేజా జారవిడిచాడు. ఆ తర్వాత జడేజా బౌలింగ్‌లో సిక్స్ బాదిన నరైన్ (20 బంతుల్లో 32) భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు.


పవర్ ప్లే ముగిసి సమయానికి కోల్‌కతా 56/2‌
178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఆసిఫ్‌ వేసిన ఐదో ఓవర్‌ రెండో బంతికి భారీ షాట్‌ ఆడిన రాబిన్‌ ఉతప్ప(6) పరుగుల వద్ద డ్వేన్‌ బ్రావోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ (24) దూకుడుగా ఆడుతున్నాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజులో శుభమన్‌ గిల్‌(12) పరుగులతో ఉన్నాడు.


తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయిన కోల్‌కతా
178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. ఎంగిడి వేసిన తొలి ఓవర్‌లోనే వరుస సిక్సర్లు బాది జోరుమీదున్న ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (12) అదే ఓవర్‌ చివరి బంతికి స్లిప్‌లో వాట్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెట్‌ నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజులో నరైన్‌(15), ఉతప్ప (5) పరుగులతో ఉన్నారు.


కోల్‌కతా విజయ లక్ష్యం 178
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఆఖర్లో ధోనీ (25 బంతుల్లో 43 నాటౌట్) రాణించడంతో చెన్నై చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. దీంతో కోల్‌కతాకు 178 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆటగాళ్లలో ఓపెనర్ డుప్లెసిస్(27) చావ్లా వేసిన ఆరో ఓవర్ మొదటి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత సురేష్ రైనా, వాట్సన్‌తో కలిసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 43 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

అయితే స్వల్ప పరుగుల తేడాతోనే వీరిద్దరు ఔటయ్యారు. నరైన్ బౌలింగ్‌లో వాట్సన్(36) మావీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా, రైనా(31) కుల్దీప్ బౌలింగ్‌లో జాన్సన్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత అంబటి రాయుడు దూకుడైన బ్యాటింగ్‌లో స్కోర్‌బోర్డులో వేగం పెంచాడు.

ఈ క్రమంలో 17 బంతుల్లో 21 పరుగులు చేసిన రాయుడు నరైన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న ధోని 25 బంతుల్లో నాలుగు సిక్సులు బాది 43 పరుగులు చేసి జట్టు స్కోర్‌లో కీలక పాత్ర పోషించాడు. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో నరైన్ రెండు, చావ్లా రెండు, యాదవ్ ఒక వికెట్‌ తీసుకున్నారు.


సిక్సుల మోత మోగిస్తోన్న ధోని
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 18 ఓవర్లకు గాను ‌చెన్నై సూపర్‌కింగ్స్‌ 4 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ వేసిన 18వ ఓవర్‌లో చెన్నై 12 పరుగులు రాబట్టింది. అంతకముందు మిచెల్ జాన్సన్ వేసిన 17వ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన ధోనీ 15 పరుగులు రాబట్టాడు. ప్రస్తుతం క్రీజులో ధోని (36), జడేజా(4) పరుగులతో ఉన్నారు.


రాయుడు ఔట్: నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ‌చెన్నై సూపర్‌కింగ్స్‌ నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ సీజన్లో అద్భుత ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడు (21)ని నరైన్ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 15 ఓవర్లకు చెన్నై 4 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధోని(4), జడేజా(1) పరుగుతో ఉన్నారు.


12 ఓవర్లకు చెన్నై 103/3
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ‌చెన్నై సూపర్‌కింగ్స్‌ 12 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న వాట్సన్‌(36)ను సునీల్ నరైన్ పెవిలియన్‌కు చేర్చాడు. నరైన్ వేసిన 11వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్‌కు వాట్సన్ యత్నించగా.. బౌండరీ లైన్ దగ్గర శివమ్ మావి చేతికి చిక్కి ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేటికే సురేశ్ రైనా (26 బంతుల్లో 31) కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. ప్రస్తుతం క్రీజులో అంబటి రాయుడు(7), ధోని (1) పరుగుతో ఉన్నారు.


10 ఓవర్లకు చెన్నై 90/1
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ‌చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాళ్లు ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (36) బౌండరీలు బాదుతూ జోరు కొనసాగిస్తున్నాడు. మరోవైపు సురేశ్‌ రైనా (26) వరుస బౌండరీలతో చెలరేగిపోతున్నాడు. కోల్‌కతా బౌలర్‌ శివమ్‌ మావి పొదుపుగా బౌలింగ్ చేస్తూ చెన్నై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి చెన్నై వికెట్‌ నష్టానికి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రైనా(26), వాట్సన్ (36) పరుగులతో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ‌చెన్నై సూపర్‌కింగ్స్‌ తొలి వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ తొలి బంతికి డుప్లెసిస్ (27) పరుగుల వద్ద క్లీన్ బౌల్డయ్యాడు. మరో ఎండ్‌లో ఆరంభంలో నెమ్మదిగా ఆడిన వాట్సన్ ఆ తర్వాత దూకుడు పెంచాడు. మిచెల్ జాన్సన్ ఓవర్లో 4,6 బాదాడు. డుప్లెసిస్ స్థానంలో క్రీజులోకి వచ్చిన రైనా రెండు బౌండరీలతో జోరు కనబర్చాడు. ప్రస్తుతం 6 ఓవర్లకు చెన్నై వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజులో వాట్సన్ (21), రైనా (9) పరుగులతో ఉన్నారు.


దూకుడుగా ఆడుతోన్న చెన్నై ఓపెనర్లు
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ‌చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం ఐదు ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెటేమీ కోల్పోకుండా 48 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ (21), డుప్లెసిస్‌ (27) పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్-చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

గత మ్యాచ్‌లో గాయపడిన నితీష్ రాణా స్థానంలో రింకూ సింగ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నట్లు దినేశ్ కార్తీక్ వివరించాడు. మరోవైపు తమ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నట్లు ధోనీ తెలిపాడు.

8 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించిన చెన్నై ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలో దిగుతోంది. మరోవైపు నాలుగు విజయాలు, నాలుగు ఓటములను ఖాతాలో వేసుకున్న కోల్‌కతా ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ప్లేఆఫ్ అవకాశాలను మెరుగు పర్చుకోవాలని భావిస్తోంది.

ఈ మ్యాచ్‌ను కూడా గెలవడం ద్వారా అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని చెన్నై పట్టుదలతో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు ఒకసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని చెన్నై చేధించి ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

1
43443

చివరి ఓవర్‌లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా సిక్సు బాది జట్టుని గెలిపించాడు. ఈ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పూణె వేదికగా ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో చెన్నై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అదే జోరుతో ఇప్పుడు కోల్‌కతాతో పోరుకు సిద్ధమైంది. ఇక, కోల్‌కతా విషయానికి వస్తే ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే కోల్‌కతా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి.

Story first published: Thursday, May 3, 2018, 23:40 [IST]
Other articles published on May 3, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+