
హైదరాబాద్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ముంబై 2 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఛేదించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది రెండో విజయం కావడం విశేషం.
ముంబై ఆటగాళ్లలో రోహిత్ శర్మ(56 నాటౌట్; 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(44; 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), ఎవిన్ లూయిస్(47;43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై
చెన్నై సూపర్‌కింగ్స్ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్య చేధనలో ముంబై తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడే క్రమంలో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (44) జట్టు స్కోరు 69 వద్ద ఔటైనా.. మరో ఓపెనర్ ఎవిన్ లావిస్ (17 నాటౌట్) బౌండరీలతో స్కోరు బోర్డుని నడిపిస్తున్నాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. ముంబై జట్టు విజయానికి ఇంకా 60 బంతుల్లో 99 పరుగులు చేయాల్సి ఉంది.
6 ఓవర్లకు ముంబై 50/0
చెన్నై సూపర్‌కింగ్స్ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్య చేధనలో ముంబై ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్లు సూర్య కుమార్ యాదవ్ (38), ఎవిన్ లూయిస్ (10) పరుగులతో ఉన్నారు.
నిలకడగా ఆడుతోన్న ముంబై ఓపెనర్లు
చెన్నై సూపర్‌కింగ్స్ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్య చేధనలో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. మరోవైపు చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతున్నారు. దీంతో 3 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెటేమీ కోల్పోకుండా 25 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్(15), లూయిస్(8) పరుగులతో ఉన్నారు.
పూణెలో ముంబై విజయ లక్ష్యం 170
పూణె వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా(75; 47బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్‌కు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆటగాళ్లలో షేన్ వాట్సన్(12), అంబటి రాయుడు(46), ధోనీ(26), పరుగులు చేశారు. ఇక, ముంబై బౌలర్లలో కృనాల్ పాండ్యా, మిచెల్ మెకన్‌గన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా... హార్ధిక్ పాండ్యా ఒక వికెట్ తీసుకున్నాడు.
15 ఓవర్లకు చెన్నై 117/2
పూణె వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చిన చెన్నై ఓపెనర్ అంబటి రాయుడు(46) పరుగుల వద్ద ముంబై బౌలర్ కృనాల్ పాండ్యా పెవిలియన్‌కు చేర్చాడు. కృనాల్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచే ప్రయత్నంలో కటింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చెన్నై కోల్పోయిన రెండు వికెట్లను పాండ్యా తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసే సరికి చెన్నై రెండు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సురేశ్ రైనా(43), ధోనీ (13) పరుగుతో క్రీజులో ఉన్నారు.
దూకుడుగా ఆడుతోన్న చెన్నై: 10 ఓవర్లకు 91/1
పూణె వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దూకుడుగా ఆడుతోంది. వాట్సన్ (12) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా వచ్చీ రావడంతోనే సిక్సర్ బాదాడు. మరోవైపు అంబటి రాయుడు కూడా చెలరేగి ఆడుతున్నాడు. ఫలితంగా నాలుగు ఓవర్ల వరకు నెమ్మదిగా సాగిన చెన్నై బ్యాటింగ్ తర్వాత ఊపందుకుంది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో అంబటి రాయుడు (45), సురేశ్ రైనా (31) పరుగులతో ఉన్నారు.
వాట్సన్ ఔట్: తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
పూణె వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ వాట్సన్ వికెట్ చేజార్చుకుంది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా బౌలింగ్‌లోబంతిని సిక్స్‌గా తరలించేందుకు ప్రయత్నించిన వాట్సన్ (12) మార్కండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో 5 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ కోల్పోయి 39 పరుగులు చేసింది.
నిప్పులు చెరుగుతున్న ముంబై: 3 ఓవర్లకు చెన్నై 18/0
పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. లైన్ అండ్ లెంగ్త్ బంతులు విసురుతూ పరుగులు చేయకుండా అడ్డుకుంటున్నారు. జస్ప్రిత్ బుమ్రా అయితే బంతితో నిప్పులు చెరుగుతున్నాడు. చెన్నై ఓపెనర్లు ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమవుతున్నారు. దీంతో 3 ఓవర్లు ముగిసే సరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. ఓపెనర్లు షేన్ వాట్సన్ (9), అంబటి రాయుడు (9) పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కీరోన్ పొలార్డ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసింది. వీరిద్దరి స్థానంలో తుది జట్టులో జేపీ డుమిని, బెన్ కటింగ్స్ చోటు దక్కించుకున్నారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నట్లు ఆ జట్టు కెప్టెన్ ధోని ప్రకటించాడు.
కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనికి ఈ మ్యాచ్ 150వ మ్యాచ్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఈ రెండు జట్లూ తలపడగా... ఆ మ్యాచ్‌లో హిట్టర్ డ్వేన్ బ్రావో సంచలన ఇన్నింగ్స్‌తో చెన్నైకి అద్భుతమైన విజయాన్ని అందించాడు.
ముంబై Vs చెన్నై మ్యాచ్ లైవ్ స్కోరు కార్డు
ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదింట విజయం సాధించి, కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమిపాలై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు అదే ముంబై విషయానికి వస్తే ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది.
అయితే అభిమానుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటి ఓటమి పాలై, కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో చెన్నైతో జరిగే మ్యాచ్‌ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాదు ప్లేఆఫ్స్‌లో ముంబై బెర్తు దక్కించుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ నెగ్గాల్సి ఉంటుంది.
జట్ల వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్:
షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, శామ్ బిల్లింగ్స్, రవీంద్ర జడేజా, ఎంస్ ధోనీ, బ్రావో, హర్భజన్ సింగ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్
ముంబై ఇండియన్స్:
సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్, ఇషన్ కిషన్, రోహిత్ శర్మ, జీన్ పాల్ డుమినీ,కృనాల్ పాండ్యా, హార్ధిక్ పాండ్యా, బెన్ కటింగ్, మిచెల్ మెక్ కెంగాన్, మాయాంక్ మార్కండే, జస్ప్రిత్ బుమ్రా