
హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌కు ఎదురులేదని మరోసారి నిరూపించింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
133 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను 19.2 ఓవర్లలో 119 పరుగులకే కట్టడి చేసిన సన్‌రైజర్స్ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా కింగ్స్ పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి సన్‌రైజర్స్ ప్రతీకారం తీర్చుకుంది.
ఈ మ్యాచ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు పంజాబ్కు 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో సన్‌రైజర్స్ బౌలర్లు చెలరేగిపోయారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన పంజాబ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
సన్‌రైజర్స్ బౌలర్లు రషీద్ ఖాన్, షకిబ్ ఉల్ హాసన్‌లు కట్టుదిట్టమైన బంతులతో పంజాబ్ బ్యాట్స్‌మన్‌కు చుక‍్కలు చూపించారు. ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ (32) , క్రిస్‌గేల్ (23) నిలకడగా ఆడి జట్టుకి మెరుగైన ఆరంభమిచ్చినా.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు.
పంజాబ్ జట్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో పంజాబ్ 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయంగా, షకీబ్, బసిల్ థంపి, సందీప్ శర్మ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
15 ఓవర్లకు పంజాబ్ 91/5
ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 15 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. పంజాబ్ ఆటగాళ్లలో ఆరోన్ ఫించ్(8), కరుణ్ నాయర్ (13) వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరగా అంతకముందు మయాంక్ అగర్వాల్ (12) కేఎల్ రాహుల్ (32), క్రిస్‌గేల్ (23) పెవిలియన్‌కు చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో మనోజ్ తివారీ(1), అశ్విన్ (2) పరుగులతో ఉన్నారు.
గేల్ ఔట్: రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్
ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. బసిల్ థంపీ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ రెండో బంతికి క్రిస్‌గేల్ (23: 21 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సులు) సిక్స్ కొట్టబోయి అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బౌన్సర్‌గా వచ్చిన బంతిని గేల్ హిట్ చేసేందుకు ప్రయత్నించగా.. అక్కడే గాల్లోకి లేచిన బంతిని థంపీ ఎలాంటి తడబాటు లేకుండా క్యాచ్ అందుకున్నాడు. దీంతో 10 ఓవర్లకు పంజాబ్ 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కరుణ్ నాయర్ (6), మయాంక్ అగర్వాల్ (6) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 55 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో తడబడిన ఓపెనర్ కేఎల్ రాహుల్ (32) క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో మరో ఓపెనర్ క్రిస్‌గేల్ (23 నాటౌట్), మయాంక్ అగర్వాల్ (1) పరుగుతో ఉన్నారు.
దూకుడుగా ఆడుతోన్న కేఎల్ రాహుల్
ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. వరుస బౌండరీలతో జోరు మీదున్నాడు. మరో ఓపెనర్ క్రిస్ గేల్(15) కూడా దూకుడుగా ఆడుతున్నాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెటేమీ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గేల్ (15), కేఎల్ రాహుల్ (29) పరుగులతో ఉన్నారు.
3 ఓవర్లకు పంజాబ్ 14/0
హైదరాబాద్ నిర్దేశించిన 133 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు. దీంతో మూడు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెటేమీ కోల్పోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో గేల్ (10), కేఎల్ రాహుల్ (4) పరుగులతో ఉన్నారు.
పంజాబ్ విజయ లక్ష్యం 133
ఉప్పల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశపర్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌కు 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 27 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. అంకిత్ రాజ్‌పుత్ దెబ్బకు సన్‌రైజర్స్ వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంది. తొలి ఓవర్‌లో కేన్ విలియమ్సన్‌ను డకౌట్‌గా కాగా.. మూడో ఓవర్ రెండో బంతికి శిఖర్ ధావన్(11)ను ఔట్ చేశాడు.
ఆ తర్వాత అంకిత్ రాజ్‌పుత్ వేసిన ఐదో ఓవర్‌లో వృద్ధిమాన్ సాహా(6) పరుగుల వద్ద ఆండ్రూ టైకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే-షకిబ్ జోడీ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 52 పరుగుల్ని జత చేశారు.
ఈ క్రమంలో షకీబ్ (28) పరుగుల వద్ద ముజీబ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యూసఫ్ పఠాన్‌తో కలిసి మనీష్ పాండే స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే మనీష్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరూ కలిసి మరో 49 పరుగుల్ని జత చేయడంతో సన్‌రైజర్స్ తేరుకుంది.
చివరి ఓవర్‌లో మనీష్ పాండే(54: 51 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సు), మహమ్మద్ నబీ(4)లు ఔటయ్యారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో రాజ్‌పుత్ ఐదు వికెట్లు తీయగా.... ముజిల్ ఉర్ రహ్మాన్‌కు ఒక వికెట్ లభించింది.
8 ఓవర్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 50/3
ఉప్పల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ ఆరంభంలోనే మూడు వికెట్లను కోల్పోవడంతో క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం
8 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మనీష్ పాండే (12), షకీబ్ (16) పరుగులతో ఉన్నారు.
సాహా ఔట్: మూడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
ఉప్పల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ పేసర్ అంకిత్ రాజ్‌పుత్ వరుస పెట్టి వికెట్లు తీస్తున్నాడు. ఇప్పటి వరకు హైదరాబాద్ కోల్పోయిన మూడు వికెట్లు అంకిత్ రాజ్‌పుతే తీయడం విశేషం. అంకిత్ రాజ్‌పుత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (6) పరుగుల వద్ద ఆండ్రూ టైకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 5 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మనీష్ పాండే (9), షకీబ్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.
ఆరంభంలోనే హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ
ఉప్పల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. అంకిత్ రాజ్‌పుత్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ శిఖర్ ధావన్ (11) పరుగుల వద్ద కరుణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 3 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో వృద్ధిమాన్ సాహా(4), మనీష్ పాండే పరుగులేమీ చేయకుండా ఉన్నారు.
విలియమ్సన్ ఔట్: తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్
ఉప్పల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. అంకిత్ రాజ్‌పుత్ వేసిన మొదటి ఓవర్‌లో కెప్టెన్ కేన్ విలియమ్‌సన్(0) అశ్విన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సన్‌రైజర్స్ తొలి ఓవర్ ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 1 పరుగు చేసింది. క్రీజులో వృద్ధిమాన్ సాహా(0), శిఖర్ ధావన్(1) పరుగులతో ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. యువరాజ్ సింగ్ స్థానంలో మనోజ్ తివారీని జట్టులోకి తీసుకోగా.. హైదరాబాద్ జట్టు గత మ్యాచ్‌లోని టీంనే ఇందులోనూ కొనసాగిస్తుంది. ఐపీఎల్ 11వ సీజన్‌ను హ్యాట్రిక్ విజయాలతో ప్రారంభించిన సన్‌రైజర్స్‌కు తొలి బ్రేక్ వేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టే.
పంజాబ్ Vs హైదరాబాద్ లైవ్ మ్యాచ్ స్కోరు కార్డు
ఈ సీజన్‌లో ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో నెగ్గిన సన్‌రైజర్స్... పంజాబ్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఇప్పుడు ఓటమి బదులు తీర్చుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అవకాశం లభించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగింట విజయం సాధించగా... రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో 3వ స్ధానంలో కొనసాగుతోంది.
సొంతగడ్డపై చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైనప్పటికీ, వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ఆ జట్టులో కొత్త ఉత్సాహం నింపింది. మరోవైపు పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
జట్ల వివరాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్:
కేఎల్ రాహుల్(కీపర్), క్రిస్ గేల్, కరుణ్ నాయర్, మాయంక అగర్వాల్, ఆరోన్ ఫించ్, మనోజ్ తివారీ, రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), అండ్రూ టై, అంకిత్ రాజ్‌పుత్, బరీందర్ శ్రణ్, ముజీబ్ ఉర్ రహ్మన్.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
శిఖర్ ధావన్, కేన్ విలియమ్‌సన్(కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(కీపర్), మనీష్ పాండే, షకీబ్ అల్ హసన్, యూసుఫ్ పఠాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, బాసిల్ థంపి, సందీప్ శర్మ, సిద్ధార్త్ కౌల్.