న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018: రాయల్స్ × ఇండియన్స్, మూడు వికెట్ల తేడాతో ముంబై పరాజయం

ndians will be in search of

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా జరుగుతున్న సమరంలో ముంబై, రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ అనూహ్య విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆ జట్టు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. చివరి 6 బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా రాజస్థాన్‌ ఆల్‌రౌండర్‌ కృష్ణ ప్ప గౌతమ్‌ 11 బంతుల్లో (33)ఒక ఫోరు, ఒక సిక్సర్‌ బాది తిరుగులేని విజయం అందించాడు. అంతకు ముందు సంజూ శాంసన్‌ 39 బంతుల్లో (52), బెన్‌స్టోక్స్‌ 27 బంతుల్లో (40) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

ఛేదనలో సంజు శాంసన్ (52: 39 బంతుల్లో 4x4), బెన్‌స్టోక్స్ (40: 27 బంతుల్లో 3x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. తాజా సీజన్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత రాజస్థాన్ మళ్లీ విజయాన్నిఅందుకుంది.


ముంబై ఇన్నింగ్స్:

ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ 47 బంతుల్లో (72), ఇషాన్ కిషన్ 42 బంతుల్లో (58) హాఫ్ సెంచరీలతో.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.


మొదటి పదకొండు ఓవర్లకి ముంబై ఇన్నింగ్స్:104/1

ఓపెనర్ ఎవిన్ లావిస్ (0) తొలి ఓవర్‌లోనే డకౌట్‌గా పెవిలియన్‌కి చేరడంతో.. అనంతరం వచ్చిన ఇషాన్ కిషన్ (42)తో కలిసి మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (60)జట్టు స్కోరు బోర్డుని నడిపిస్తున్నాడు. క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన ఈ జోడి ఇప్పుడు బ్యాటింగ్ స్పీడ్ పెంచింది. దీంతో.. 11 ఓవర్లు ముగిసే సమయానికి ముంబయి 104/1తో భారీ స్కోరుకి బాటలు వేసుకుంది.


ఎవిన్ లావిస్ బౌల్డ్

మ్యాచ్‌ ఆరంభంలోనే రాజస్థాన్ రాయల్స్ కీలక వికెట్‌ని పడగొట్టింది. ఫామ్‌లో ఉన్న ముంబయి ఓపెనర్ ఎవిన్ లావిస్ (0) బంతిని వికెట్లపైకి ఆడుకుని ఔటయ్యాడు. తొలి ఓవర్ వేసిన రాజస్థాన్ బౌలర్ ధవళ్ కులకర్ణి.. నాలుగో బంతిని ఆఫ్ స్టంప్‌కి అవల వేశాడు. హిట్ చేసేందుకు ఎవిన్ లావిస్ ప్రయత్నించగా.. బ్యాట్ అంచున తాకిన బంతి.. వికెట్లని గీరాటేసింది.

లీగ్ పట్టికలో కింద నుంచి రెండు, మూడు స్థానాల్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ ఈ సారైనా మెరుగైన స్థానాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాయి. ఆఖరి మ్యాచ్ లో విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇరు జట్ల ఆటగాళ్లు:

రాజస్థాన్ జట్టు:
Ajinkya Rahane (c), Heinrich Klaasen, Sanju Samson, Ben Stokes, Jos Buttler (wk), Rahul Tripathi, Jofra Archer, Dhawal Kulkarni, Krishnappa Gowtham, Shreyas Gopal, Jaydev Unadkat

ముంబై జట్టు:

Suryakumar Yadav, Evin Lewis, Ishan Kishan (wk), Rohit Sharma (c), Krunal Pandya, Kieron Pollard, Hardik Pandya, Mitchell McClenaghan, Mayank Markande, Jasprit Bumrah, Mustafizur Rahman

Story first published: Monday, April 23, 2018, 0:07 [IST]
Other articles published on Apr 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X