For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018: SRH vs CSK: 4 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసిన చెన్నై

ipl 2018 match 20 chennai super kings vs sunrisers hyderabad match report from rajiv gandhi international stadium

హైదరాబాద్: ఐపీఎల్ లో భాగంగా జరుగుతోన్న ఐపీఎల్ 20వ మ్యాచ్‌లో చెన్నై, హైదరాబాద్ జట్లు ఉప్పల్ వేదికగా తలపడ్డాయి.ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పోరాడి ఓడింది. 183 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (84), హిట్టర్ యూసఫ్ పఠాన్ 27 బంతుల్లో (45) దూకుడగా ఆడటంతో.. ఒకానొక దశలో గెలిచేలా కనిపించిన హైదరాబాద్ జట్టు చివరికి 178/6కే పరిమితమైంది.

చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్ విజయానికి 19 పరుగులు అవసరమైన దశలో రషీద్ ఖాన్ 4 బంతుల్లో (17) బాది గెలుపుపై ఆశలు రేపినా.. చివరి బంతికి 6 పరుగులు చేయాల్సిన దశలో ఒక పరుగుకే పరిమితమయ్యాడు. దీంతో.. టోర్నీలో వరుసగా రెండో ఓటమిని హైదరాబాద్ చవిచూసింది. చెన్నైకి వరుసగా ఇది రెండో విజయం.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి:

ఛేదనకు దిగిన హైదరాబాద్ జట్టు పది ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు నష్టపోయింది. చెన్నై జట్టుపై పరుగులు తీసేందుకు ప్రయత్నించిన విలియమ్సన్ జట్టు మొదటి ఐదు బంతులకే ఓపెనర్‌గా దిగిన రికీ భువీని కోల్పోయింది.


రైనా, రాయుడు భాగస్వామ్యంలో 59 బంతులకి 112 పరుగులు సంపాదించింది చెన్నై జట్టు. ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ 12 బంతుల్లో 25 పరుగులు పూర్తి చేశాడు.


రైనా హాఫ్ సెంచరీ:

బౌండరీల వర్షం కురిపిస్తోన్న అంబటి రాయుడు అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చాడు మహీ. అతనికి భాగస్వామ్యం అందిస్తూనే రైనా 40బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం చెన్నై జట్టు స్కోరు 158/3


రాయుడు హాఫ్ సెంచరీ:

నత్త నడకన సాగుతోన్న జట్టు స్కోరును పరుగులు పట్టించేందుకే వచ్చాడు అంబటి రాయుడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతనికి భాగస్వామ్యాన్ని ఇస్తున్న రైనా(35) కూడా చక్కగా రాణిస్తున్నాడు.


చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి శుభారంభం లభించింది. తొలుత మూడు ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చి చెన్నై ఓపెనర్లని ఒత్తిడిలోకి నెట్టి హైదరాబాద్ నాలుగో ఓవర్‌లో ఓపెనర్ షేన్ వాట్సన్ 15 బంతుల్లో (9) వికెట్ పడగొట్టింది.

నాలుగో ఓవర్ వేసిన భువనేశ్వర్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన వాట్సన్.. తర్వాత బంతిని హిట్ చేసే ప్రయత్నంలో.. ఫీల్డర్ దీపక్ హుడా చేతికి చిక్కాడు. టోర్నీ ఆరంభంలోనే హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న హైదరాబాద్ జట్టు.. గత గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో 15 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

ఆ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ తడబడిన సన్‌రైజర్స్ జట్టు ఈ మ్యాచ్‌లో ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గత శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌పై 64 పరుగుల తేడాతో గెలిచి ఉత్సాహంతో ఉంది. ఆ జట్టు ఓపెనర్ షేన్ వాట్సన్ సెంచరీతో సూపర్ ఫామ్‌లో ఉండగా.. బౌలింగ్‌‌లోనూ చెన్నై మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. హైదరాబాద్ సొంతగడ్డ ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది.


టాస్ గెలిచిన హైదరాబాద్:
ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచి సన్ రైజర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

పంజాబ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు. చెన్నై తుది జట్టులోనూ ఒక మార్పు జరిగింది. స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ స్థానంలో డుప్లెసిస్ జట్టులోకి వచ్చాడు.

ఆడనున్న ఇరు జట్ల ఆటగాళ్లు:

Chennai Super Kings:

Mahendra Singh Dhoni (captain/wicket-keeper), Suresh Raina, Ravindra Jadeja, Faf du Plessis, Harbhajan Singh, Dwayne Bravo, Shane Watson, Ambati Rayudu, Deepak Chahar, KM Asif, Kanishk Seth, Lungi Ngidi, Dhruv Shorey, Murali Vijay, Sam Billings, Mark Wood, Kshitiz Sharma, Monu Kumar, Chaitanya Bishnoi, Imran Tahir, Karn Sharma, Shardul Thakur, N Jagadeesan, David Willey.

Sunrisers Hyderabad:

Bhuvneshwar Kumar, Shikhar Dhawan, Shakib Al Hasan, Kane Williamson (captain), Manish Pandey, Carlos Brathwaite, Yusuf Pathan, Wriddhiman Saha (wicket-keeper), Rashid Khan, Ricky Bhui, Deepak Hooda, Siddarth Kaul, T. Natarajan, Mohammad Nabi, Basil Thampi, K Khaleel Ahmed, Sandeep Sharma, Sachin Baby, Chris Jordan, Billy Stanlake, Tanmay Agarwal, Shreevats Goswami, Bipul Sharma, Mehdi Hasan, Alex Hales.

Story first published: Monday, April 23, 2018, 13:50 [IST]
Other articles published on Apr 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+