
హైదరాబాద్:ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ ఈడెన్ గార్డెన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 71 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో బరిలోకి దిగిన గంభీర్ గ్యాంగ్ 14. 2 ఓవర్లలో 129 పరుగులకే సర్దేసింది. ఢిల్లీ ఆటగాళ్లలో రిషబ్ పంత్26 బంతుల్లో (43), గ్లెన్ మ్యాక్స్‌వెల్ 22 బంతుల్లో (47)మాత్రమే రాణించగా, మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఘోర పరాజయం తప్పలేదు.
ఈ సీజన్‌లో కోల్‌కతా జట్టుకు పరుగుల పరంగా ఇదే పెద్ద విజయం కావడం విశేషం. కేకేఆర్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్ తలో మూడో వికెట్లు సాధించగా, పీయూష్ చావ్లా, రస్సెల్, శివం మావి, టామ్ కుర్రాన్‌లు తలో వికెట్ తీశారు.
కోల్‌కతా ఇన్నింగ్స్:
కోల్‌కతా జట్టు మ్యాచ్ ఆరంభం నుంచి పరుగుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో దినేశ్ కార్తీక్ జట్టు ఢిల్లీ జట్టుకు 201 టార్గెట్ ఇచ్చింది. కట్టుదిట్టం చేసిన ఢిల్లీ జట్టు ఆఖరి ఓవర్లో 3 వికెట్లను తీయగలిగింది.
నితీశ్ రానా హాఫ్ సెంచరీ, స్కోరు, ఆండ్రీ రస్సెల్ ఔట్
నితీశ్ రానా సిక్సుల వర్షం కురిపించి 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాతి బంతికే ఆండ్రీ రస్సెల్ 41బంతుల్లో 12పరుగులు చేశాడు.
14ఓవర్ కు నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
14ఓవర్‌లో క్రిస్ మోరిస్ వేసిన బంతిని దినేశ్ కార్తీక్ ఆఫ్ స్టంప్‌కు ఆడే ప్రయత్నంలో ట్రెంట్ బౌల్ట్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 19 బంతులకు దినేశ్ కార్తీక్(10) చేసి అవుట్ అయ్యాడు. క్రీజులో నితీశ్ రానా (36), ఆండ్రీ రస్సెల్(0) ఉన్నారు.
వేసిన మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసిన షమీ, 89/2
ఓపెనర్‌గా దిగిన క్రిస్ లిన్ అతి కష్టంపై 31 బంతుల్లో 29 పరుగులు చేశాడు. మొహమ్మద్ షమీ వేసిన మొదటి ఓవర్‌లోనే క్రిస్ లిన్ వికెట్ తీశాడు. క్రీజులో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (0), నితీశ్ రానా(22) ఉన్నారు.
పది ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరు 85/2
కోల్‌కతా జట్టు మొత్తం పది ఓవర్లు పూర్తయ్యేసరికి 85/2 స్కోరును చేసింది. 9.6వ బాల్ అవుట్ అయిందన్న సందేహంలో థర్డ్ అంపైర్ నిర్ణయం కోరాడు గౌతం గంభీర్. నిర్ణయం నెగిటివ్‌గా రావడంతో నాటౌట్‌గా ప్రకటించారు. క్రీజులో క్రిస్ లిన్ 26బంతుల్లో (29), నితీశ్ రానా 12 బంతుల్లో (21) ఉన్నారు.
రెండో వికెట్‌నూ కోల్పోయిన కోల్‌కతా, స్కోరు 62/2
వరుసగా సిక్సర్లు బాది జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తున్న రాబిన్ ఊతప్ప 19 బంతుల్లో (35) ను షబ్నజ్ నదీమ్ అవుట్ చేశాడు. తానే బౌలింగ్ వేసి తానే క్యాచ్ అందుకున్నాడు. ఏడో ఓవర్‌లో రాబిన్ ఊతప్ప అవుట్ అవడంతో నితీశ్ రానా క్రీజులోకి వచ్చాడు. వచ్చి రాగానే బౌండరీలతో విజృంభిస్తున్నాడు. క్రీజులో అతనితో పాటుగా క్రిస్ లిన్(27) ఉన్నాడు.
రెండు ఓవర్లకే తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా
మ్యాచ్ మొదలైన రెండు ఓవర్లకే ఓపెనర్‌గా దిగిన సునీల్ నరైన్ అవుట్ అయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని సైడ్ ఆఫ్ స్టంప్‌కు షార్ట్ కొట్టే ప్రయత్నంలో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో క్రిస్ లిన్‌తో పాటుగా రాబిన్ ఊతప్ప ఆడుతున్నాడు
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ టాస్ గెలుచుకోవడంతో ఢిల్లీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ వర్సెస్ కోల్‌కతా స్కోరు వివరాలు:
రెండు మ్యాచ్‌లు ఓడిన తర్వాత ముంబై ఇండియన్స్‌పై అనూహ్య విజయం సాధించిన ఢిల్లీ కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగుతుంది. బెంగళూరుపై గెలిచి టోర్నీని అద్భుతంగా మొదలుపెట్టిన కోల్‌కతా టీమ్.. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ చేతుల్లో వరుసగా ఓటమి పాలైంది. అటు ఢిల్లీ మాత్రం పంజాబ్, రాజస్థాన్ చేతుల్లో ఓడిపోయి.. ఆఖరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపు బోణీ చేసింది.
ఢిల్లీ టీమ్‌పై కోల్‌కతాకు మెరుగైన రికార్డు ఉంది. ఆ టీమ్‌పై 12 మ్యాచుల్లో గెలిచి 8 మ్యాచుల్లో ఓడింది. ఇక ఈ మ్యాచ్ లో గంభీర్ తన అత్యుత్తమ ప్రదర్శన చూపించి కోల్‌కతాను ఎదుర్కొవాల్సి ఉంది. 2011వ సంవత్సరం నుంచి అదే జట్టును నడిపించిన నాయకుడు ఇప్పుడు దానికి ప్రత్యర్థి జట్టు నాయకుడిగా బరిలోకి దిగనున్నాడు.
Kolkata Squad: Robin Uthappa, Chris Lynn, Nitish Rana, Sunil Narine, Dinesh Karthik (c) (wk), Andre Russell, Shubman Gill, Shivam Mavi, Tom Curran, Piyush Chawla, Kuldeep Yadav
Delhi Squad: Jason Roy, Gautam Gambhir (c), Rishabh Pant (wk), Glenn Maxwell, Shreyas Iyer, Vijay Shankar, Chris Morris, Rahul Tewatia, Shahbaz Nadeem, Mohammed Shami, Trent Boult