న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెంగుళూరును బెంబేలెత్తించిన రాజస్థాన్, 19 పరుగుల తేడాతో విజయం

ipl 2018 match 11 rajasthan royals vs royal challengers benguluru match report at chinnaswamy stadium

హైదరాబాద్: 218 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 198 పరుగులు చేసింది. దీంతో ఆర్‌సీబీపై రాజస్థాన్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది.ఒక్క ఫీల్డింగ్ మినహాయించి మిగతా అన్నింటిలోనూ కోహ్లీ జట్టు ఫెయిలైంది. కేవలం ఒక్కడే హాఫ్ సెంచరీ పూర్తి చేసినా 11వ ఓవర్‌కు 57పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. బ్యాట్స్‌మెన్లలో మన్ దీప్ సింగ్ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోయినా నిలకడగా ఆడాడు.

ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లోనే కాదు.. ఫీల్డింగ్, బౌలింగ్‌లోనూ రాణించి జట్టుకు చక్కటి విజయాన్ని అందించారు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగుళూరు, రాజస్థాన్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. స్టేడియంలో బౌండరీలు కాస్త దగ్గరగా ఉండటంతో పరుగుల వర్షం కురుస్తోంది.


బెంగుళూరు టార్గెట్ 218:

కేవలం ఆఖరి ఐదు ఓవర్లలో 88 పరుగులు చేసింది రాజస్థాన్ జట్టు. బెంగుళూరు బౌలర్లకు చుక్కలు చూపించింది. ఆర్‌సీబీ 14 ఫోర్లు, 14 సిక్సులతో చెలరేగి ఆడింది. ఫీల్డింగ్‌లో ఎంత చురుగ్గా ఉన్న పేలవమైన బౌలింగ్ ప్రదర్శిచడంతో భారీగా పరుగులు కోల్పోవాల్సి వచ్చింది. సంజూ శాంసన్ ఒక్కడే 92వ్యక్తిగత స్కోరుతో జట్టును పరుగులు పెట్టించాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లోనే 59 పరుగులు చేశారు. రాజస్థాన్ 218 పరుగులుగా బెంగుళూరు టార్గెట్‌ను నిర్దేశించింది.


15 ఓవర్లు పూర్తయ్యేసరికి:

15 ఓవర్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్ జట్టు 129 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. చాహల్ 2, క్రిస్ వోక్స్ 1 వికెట్‌ను తీశారు. బెంగుళూరు బౌలర్లను రాజస్థాన్ ఆటగాళ్లు సునాయాసంగానే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత రన్ రేట్ 8.73. క్రీజులో సంజు శాంసన్ (34), జోస్ బట్లర్ (10) ఉన్నారు.


పది ఓవర్లు పూర్తయ్యేసరికి:

పది ఓవర్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ 30 ఓవర్లు పరుగులు ఇచ్చాడు. క్రిస్ వోక్స్, చాహల్ చెరో వికెట్ తీసి వరుసగా 15, 11పరుగులు ఇచ్చారు. కుల్వంత్ ఖేజ్రోలియా బౌలింగ్‌లో రాజస్థాన్ జట్టు బాగానే దండుకుంటోంది. క్రీజులో బెన్ స్టోక్స్, సంజు శాంసన్ ఆడుతున్నారు.


ఏడు ఓవర్లకే రెండు వికెట్లు అవుట్:

జస్థాన్ రాయల్స్ జట్టు ఐదో ఓవర్లో ఓ వికెట్, ఆరో ఓవర్లో ఓ వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్, చాహల్ చెరో వికెట్‌ను తీయగలిగారు. ఏడు ఓవర్లు పూర్తయ్యేసరికి జట్టు స్కోరు 54/2గా ఉంది.


ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి:
తొలి ఓవర్‌ను కేవలం ఒక్క పరుగుతో మొదలుపెట్టిన రాయల్స్ జట్టు ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి చేసింది. పరుగులు రాబట్టే క్రమంలో ఓపెనర్లుగా దిగిన రహానె(31), షార్ట్‌(9)లు సింగిల్స్ తీసేందుకు సైతం తెగ ఆరాటపడుతున్నారు. 2 ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ 15పరుగులివ్వగా, ఒకే ఓవర్ బైలింగ్ చేసిన ఉమేశ్ యాదవ్ 11 పరుగులు అప్పజెప్పాడు. స్పిన్నింగ్ హీరఓ చాహల్ రంగంలోకి దిగి 10 పరుగులు ఇచ్చాడు.


టాస్ రిపోర్ట్:

ఈ నేపథ్యంలో టాస్ గెలిచి బెంగుళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఛేదనలో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నట్లు కోహ్లీ తెలిపాడు.

ఆఖరి మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలో తేమ కారణంగా బంతి కదలికలను దృష్ఠిలో ఉంచుకుని ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ కోహ్లీ వివరించాడు. సర్ఫరాజ్‌ స్థానంలో పవన్‌నేగిని జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆటగాళ్లు ఆకుపచ్చని దుస్తులతో బరిలోకి దిగనున్నారు. ఇరు జట్లు తమ ఆఖరి మ్యాచ్‌లలో విజేతగానే నిలిచి ఈ మ్యాచ్‌కు ఆడుతున్నాయి.

బెంగుళూరు వర్సెస్ రాజస్థాన్ స్కోరు కార్డు

Bangalore Squad:
Quinton de Kock (wk), Brendon McCullum, Virat Kohli (c), AB de Villiers, Washington Sundar, Mandeep Singh, Pawan Negi, Chris Woakes, Umesh Yadav, Kulwant Khejroliya, Yuzvendra Chahal

Rajasthan Squad:

Ajinkya Rahane (c), D'Arcy Short, Sanju Samson, Rahul Tripathi, Jos Buttler (wk), Ben Stokes, Krishnappa Gowtham, Shreyas Gopal, Dhawal Kulkarni, Jaydev Unadkat, Ben Laughlin

Story first published: Sunday, April 15, 2018, 20:02 [IST]
Other articles published on Apr 15, 2018
Read in English: IPL 2018: RCB bowl vs RR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X