న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మలింగ, జాదవ్‌లను గుర్తు చేస్తున్న మనోజ్ తివారీ బౌలింగ్

IPL 2018: Manoj Tiwary Does A Kedar Jadhav, Twitter Cant Stop Laughing

హైదరాబాద్: ఐపీఎల్‌ 11లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం పంజాబ్, హైదరాబాద్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేవలం బౌలర్ల హవానే నడిచింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 132పరుగులు చేసింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో పంజాబ్ బౌలర్ రాజ్‌పుత్ అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టు ఆరు వికెట్లు కోల్పోతే అందులో.. తానొక్కడే ఐదు వికెట్లు తీయడం గమనార్హం. అయితే కొసమెరుపుగా తుది జట్టులోకి యువరాజ్ సింగ్‌కు బదులుగా మనోజ్ తివారీని తీసుకుంది

ఈ ఐపీఎల్ 11వ సీజన్‌లో తొలిసారి అడుగుపెట్టిన మనోజ్ తివారీ వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఎనిమిదో ఓవర్లో బౌలింగ్ వేసేందుకు పూనుకున్న తొలి బంతికే లసిత్ మలింగ, కేదర్ జాదవ్‌లను గుర్తు చేశాడు. అతనేమీ వికెట్లు తీయకపోయినా ఓవర్‌ను పది పరుగులిచ్చి ముగించాడు. బెంగాల్ లోకల్‌లో ఆడే తీరును ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐపీఎల్ అభిమానులకు పరిచయం చేశాడు. అయితే అతని బౌలింగ్ తీరుపై ట్విట్టర్ వేదికగా కామెంట్ల వర్షం కురుస్తూనే ఉంది.

'మనోజ్ తివారీ.. కేదర్ జాదవ్‌కు గట్టి కాంపిటేషన్ ఇచ్చేలా ఉన్నాడు', 'మనోజ్ బౌలింగ్ సూపర్ మాన్ గాలిలో ఎగిరినట్లుంది', 'లసిత్ మలింగలా తివారీ ఎందుకు నటిస్తున్నాడు.?, 'మనం ఐపీఎల్‌లో కేదర్ జాదవ్‌ను మాత్రమే మిస్ అయ్యాం. అతని బౌలింగ్‌ను కాదు', 'మనోజ్ తివారీ బౌలింగ్‌కు నవ్వు ఆపుకోలేకపోయాను' అంటూ స్పందిస్తున్నారు నెటిజన్లు.

యువరాజ్ సింగ్‌ను కాదని మనోజ్ తివారీని తుది జట్టులోకి తీసుకుని ప్రయోగం చేసిన పంజాబ్ జట్టుకు ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. కాగా, ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ పట్టికలో టాప్ 2 స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఆదివారం ముంబై ఇండియన్స్‌పై గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టాప్‌లోనే కొనసాగుతుంది.

Story first published: Friday, April 27, 2018, 13:15 [IST]
Other articles published on Apr 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X