న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో వాళ్ల హవానే కొనసాగుతోంది: కపిల్ దేవ్

IPL 2018: Leg spinners have been faring best in shortest format, reckons legendary all-rounder Kapil Dev

హైదరాబాద్: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో లెగ్‌స్పిన్నర్లదే ఆధిపత్యమని, లీగ్‌ ఆరంభం నుంచి వారి హవానే భారత దిగ్గజ ఫాస్ట్‌బౌలర్‌ కపిల్‌ దేవ్‌ అన్నాడు. వాళ్లు వైవిధ్యమైన బౌలింగ్‌తో అదరగొడుతున్నారని భారత క్రికెట్ దిగ్గజం అన్నాడు. క్రికెట్ కామెడీ షో సందర్భంగా ఈ హర్యానా హారికేన్ పలు అంశాలపై మాట్లాడాడు. ప్రతి ఒక్కరికి వైవిధ్యమైన బౌలింగ్ వనరులు ఉన్నాయని, పిచ్ పరిస్థితులను బట్టి తుది జట్టుకు ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటున్నారని తెలిపాడు.

''ఏ పిచ్‌ మీద ఆడతారన్నదాన్ని ప్రతి జట్టూ భిన్నమైన బౌలింగ్‌ దళంతో బరిలోకి దిగుతుంది. ఐతే ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఇప్పటిదాకా పరిశీలిస్తే లీగ్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్‌ లెగ్‌స్పిన్నరే. ప్రతి జట్టులోనూ మణికట్టు స్పిన్నర్‌ ఒకరైనా ఉంటున్నారు. ఆఫ్‌స్పిన్నర్‌గా ఇప్పటికే రికార్డులు కొల్లగొట్టిన పంజాబ్ కెప్టెన్ అశ్విన్ కూడా లెగ్‌స్పిన్ బౌలింగ్ చేస్తున్నాడు దాన్ని బట్టే లెగ్‌స్పిన్నర్లే లీగ్‌లో ఎక్కువ విజయవంతం అవుతున్నారన్న విషయం అర్థం చేసుకోవచ్చు' అని కపిల్ దేవ్ అన్నాడు.

'ఐపీఎల్ ఆరంభం నుంచి లెగ్‌స్పిన్నర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతున్నారు. వారిని చదవడం కష్టమవుతోంది. ఒకవేళ ఎవరైనా బ్యాట్స్‌మన్ పరుగులు చేశాడంటే అది ఖచ్చితంగా స్పిన్నర్‌ను ఎదుర్కొంటేనే' అని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్, హైదరాబాద్ జట్లలో బౌలింగ్ విభాగం బలంగా ఉంది. ఈ కారణం చేతనే ఆడిన ఐదు మ్యాచ్‌లలో పంజాబ్ నాల్గింటిని గెలిచింది. హైదరాబాద్ ఆడిన నాల్గింటిలో మూడింటిని గెలిచింది. పంజాబ్ జట్టు ఏకంగా బౌలర్‌నే తమ జట్టు కెప్టెన్‌గా ఎంచుకున్న విషయం తెలిసిందే.

Story first published: Sunday, April 22, 2018, 12:20 [IST]
Other articles published on Apr 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X