Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధావన్‌ను దూషించిన అంకిత్ రాజ్‌పుత్, ట్విట్టర్ వేదికగా చురకలు

 IPL 2018: KXIPs Ankit Rajpoot slammed for abusive send-off to Shikhar Dhawan; video

హైదరాబాద్: ఐపీఎల్-11లో భాగంగా హైదరాబాద్, పంజాబ్ జట్ల మధ్య గురువారం ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ ముగిసింది. బౌలర్లే బలంగా బరిలోకి దిగిన అనుకున్నట్లే మ్యాచ్ కొనసాగినా.. చివరకు విజయాన్ని హైదరాబాద్ ఎగరేసుకుపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు పంజాబ్ బౌలర్ల తాకిడికి నిలవలేకపోయింది. కేవలం 132పరుగులు చేసి పంజాబ్‌కు ఓ మాదిరి లక్ష్యాన్ని అందించింది.

అయితే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు వికెట్లను తానొక్కడే తీయగలిగాడు. పరుగుల వీరుడు ధావన్‌ను కేవలం 11పరుగులకే పరిమితం చేసి పెవిలియన్‌కు పంపాడు. అంతకుముందు అంకిత్ రాజ్‌పుత్ మొదటి ఓవర్ వేశాడు. నాలుగో బంతికే కెప్టెన్ విలియమ్సన్‌ను ఔట్ చేసి సన్‌రైజర్స్‌ను దెబ్బకొట్టాడు. అనంతరం మూడో ఓవర్ కూడా అంకిత్ వేశాడు. రెండో బంతికి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ షాట్ ఆడిన బంతి నేరుగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కరుణ్ నాయర్ చేతిలో పడింది.

ధావన్ వికెట్ తీసిన అనంతరం.. పెద్దగా అరుస్తూ అతడిని అసభ్య పదజాలంతో దూషించాడు. ఇది టీవీ వీడియోల్లో స్పష్టంగా కనిపించడంతో ధావన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరకు టీమిండియా జెర్సీని కూడా ధరించని ఓ ఆటగాడు సీనియర్ బ్యాట్స్‌మన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని అభిమానులు హెచ్చరిస్తున్నారు. అద్భుతమైన బౌలింగ్ గణాంకాలు నమోదు చేసి ఆకట్టుకున్నావు. జెంటిల్‌మన్ గేమ్‌లో సీనియర్‌ను గౌరవించాలని మరో అభిమాని ట్వీట్ చేశాడు.

అంత కట్టుదిట్టం చేసిన పంజాబ్ ను మరింత బందోబస్తుగా ఓడించి మంచి బదులిచ్చింది హైదరాబాద్ జట్టు. 119 స్కోరు చేసి 13పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం లీగ్ పట్టికలో హైదరాబాద్ టాప్ 2 స్థానాన్ని దక్కించుకుంది.

Story first published: Friday, April 27, 2018, 16:54 [IST]
Other articles published on Apr 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+