For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాండ్యా Vs రాహుల్: జెర్సీలు మార్చుకుని క్రీడా స్ఫూర్తి చాటారు (వీడియో)

By Nageshwara Rao
IPL 2018: KL Rahul, Hardik Pandya Swap Jerseys After MIs Stunning Triumph Over KXIP

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్‌పై అద్భుత ప్రదర్శన చేసిన కేఎల్‌ రాహుల్‌ 19వ ఓవర్‌లో ఔట్‌ కావడంతో కింగ్స్​ ఎలెవన్‌ పంజాబ్‌ మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్‌ కంటతడి పెట్టుకున్నాడు.

పంజాబ్ విజయానికి 10 బంతుల్లో 20 పరుగులు అవసరమైన దశలో రాహుల్‌ను బుమ్రా ఔట్ చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా ముంబైవైపు మళ్లింది. ఈ మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్‌ (35 బంతుల్లో 46)తో కలిసి రాహుల్ (60 బంతుల్లో 94) 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

చివర్లో బంతితో అద్భుతం చేసిన బుమ్రా

చివర్లో బంతితో అద్భుతం చేసిన బుమ్రా

దీంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధిస్తుందని అభిమానులంతా ధీమాగా ఉన్నారు. అయితే, మ్యాచ్ చివర్లో బుమ్రా బంతితో అద్భుతం చేశాడు. ముంబై మీద కూడా ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. 94 పరుగుల వద్ద కేఎల్ రాహుల్‌ను బుమ్రా అద్భుతమైన బంతితో ఔట్‌ చేశాడు.

ఈ సీజన్‌లో ఆరు హాఫ్ సెంచరీలు చేసిన కేఎల్ రాహుల్

జట్టు ఓటమితో రాహుల్ తీవ్ర నిరాశ చెందాడు. ఈ సీజన్లో ఆరు హాఫ్ సెంచరీలు చేసిన కేఎల్ రాహుల్ (95*) రాజస్థాన్‌తో గత మ్యాచ్‌లో చివరి వరకు విజయం కోసం కడదాకా పోరాడిన సంగతి తెలిసిందే. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లు లక్ష్యాన్ని చేధించలేకపోవడంతో 3 పరుగుల తేడాతో ముంబై గెలిచి ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

క్రీడాస్ఫూర్తిని చాటుకున్న పాండ్యా, కేఎల్ రాహుల్

కాగా, మ్యాచ్ అనంతరం పాండ్యా, రాహుల్ కలిసి ఫుట్ బాల్ ఆటగాళ్ల తరహాలో జెర్సీలు మార్చుకున్నారు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా కేఎల్ రాహుల్‌ వద్దకు వెళ్లిన ముంబై ఇండియన్స్‌ ఆటగాడు హర్ధిక్‌ పాండ్యా తన జెర్సీని తీసి రాహుల్‌కు ఇచ్చి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. అందుకు ప్రతిగా రాహుల్‌ కూడా పంజాబ్‌ జెర్సీని హర్ధిక్‌కు అందజేశారు.

3 పరుగుల తేడాతో ముంబై విజయం

3 పరుగుల తేడాతో ముంబై విజయం

చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ముంబై విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. అనంతరం 187 పరుగుల లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Story first published: Thursday, May 17, 2018, 11:52 [IST]
Other articles published on May 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+