17 బంతుల్లో హాఫ్ సెంచరీ: ఐపీఎల్‌లో ఇషాన్ కిషాన్ అరుదైన రికార్డు

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషాన్ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ముంబై ఇండియన్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
ఈ మ్యాచ్‌లో చావ్లా వేసిన ఆరో ఓవర్ 4వ బంతికి లివీస్(18) క్రిస్ లిన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. కుల్దీప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో వరుస బంతుల్లో నాలుగు సిక్సులు బాదాడు. దీంతో ఇషాన్ కిషన్ 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
తద్వారా ఈ సీజన్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ఐపీఎల్ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ నమోదు చేయగా.. కోల్‌కతా ఆటగాడు సునీల్ నరైన్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేశారు.
ఇషాన్ కిషన్ (62: 21 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.
మ్యాచ్ ఆరంభంలోనే ఓపెన్ ఎవిన్ లూవిస్(18) వికెట్ తీసిన కోల్‌కతా, ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (36) పవర్ ప్లేలో దూకుడుగా ఆడగా, మిడిల్ ఓవర్లలో ఇషాన్ కిషన్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ (36), హార్దిక్ పాండ్యా (19: 13 బంతుల్లో 2 సిక్సులు) రాణించారు.
ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6 బాదిన ఇషాన్ కిషన్.. 17 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివర్లో బెన్ కటింగ్ (24: 8 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులు) సిక్సర్ల మోత మోగించాడు. చావ్లా వేసిన ఆఖరి ఓవర్‌లో ముంబై 22 పరుగుల్ని పిండుకున్నాడు.
చావ్లా బౌలింగ్‌లో బెన్ కటింగ్ తొలి మూడు బంతుల్ని 6, 6, 4గా మలచగా.. ఆఖరి బంతిని కృనాల్ పాండ్యా సిక్స్‌గా మలిచాడు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు 211 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా బౌలర్లలో పియూష్ చావ్లా 3 వికెట్లు తీసుకోగా... ప్రసాద్ కృష్ణన్, టామ్ కరాన్, సునీల్ నరైన్ తలో వికెట్ తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications