ధోనీని కాపీ కొట్టిన దినేశ్ కార్తీక్: స్టంప్ అవుట్‌లతో సహా..

హైదరాబాద్: కోల్‌కతా జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్ సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తున్నాడు. ముంగళవారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లోనూ విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌కు మంచి ముగింపు ఇచ్చాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడినా ఆ తర్వాత తడబడింది. ఫలితంగా 142పరుగులకే ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఆలౌట్ అయింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో దినేశ్ కార్తీక్ చేసిన స్టంప్ అవుట్ ధోనీని తలపిస్తుందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో దినేశ్ రెండు:
కోల్‌కతా జట్టు కెప్టెన్, వికెట్ కీపర్ క్రీజుల వెనుకాల ఉండి ధోనీ బౌలర్లకు ఎలాంటి బంతులు వేసి అవుట్ చేయాలో చెప్పినట్లు కార్తీక్ కూడా చేశాడు. మొత్తం రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో దినేశ్ రెండు వికెట్లు తీయగలిగాడు. అదీ కుల్‌దీప్ బౌలింగ్‌లో స్టువర్ట్ బిన్నీ అవుట్ అవడం.
స్టువర్ట్ బిన్నీ స్టంప్ అవుట్:
11.1 ఓవర్‌లో కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న స్టువర్ట్ బిన్నీ దానిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించాడు. కానీ అదీ గూగ్లీ అని గమనించుకుండానే పరుగు చేయాలని యత్నించాడు. అదే సమయానికి కీపర్‌గా ఉన్న కార్తీక్ చురుగ్గా కదిలి బంతితో స్టంప్ అవుట్ చేశాడు. దీంతో మారుమాట్లాడకుండా బిన్నీ పెవిలియన్ వైపు దారి పట్టాడు.
త్రో చేయడంతో రహానె అవుట్
అంతకుముందు కుల్‌దీప్ బౌలింగ్ లోనే మరో వికెట్ పడింది. అదీ కీపర్ దినేశ్ కార్తీక్ వల్లనే. 7.2ఓవర్లో బౌలింగ్ వేసిన కుల్‌దీప్ మిడిల్ వికెట్ దిశగాప్రయోగించాడు. దానికి ముందుగా వచ్చి షాట్ కు యత్నించిన రహానె అంత వేగంగా వెనుకకు కదలలేకపోయాడు. వెంటనే ముందుకు వచ్చి బ్యాట్స్‌మెన్ క్రీజులోనే ఉన్న బంతిని తీసుకుని త్రో చేయడంతో అవుట్ అయ్యాడు కెప్టెన్ రహానె.

కుల్‌దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు:
లీగ్‌లో ఆడిన 12మ్యాచ్‌లకు ధీటుగా 13వ మ్యాచ్‌ను ముగించింది కోల్‌కతా జట్టు. ఇందులో ఆరంభంలో తడబడిన బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలు క్రమేపి నిలదొక్కుకోవడంతో రాజస్థాన్ ఎక్కువ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగారు. ఈ క్రమంలో కుల్‌దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications