IPL 2018 KKR vs CSK: ధోని కుమార్తె జీవాతో షారుక్ సెల్ఫీ


హైదరాబాద్: చెపాక్ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఒకవైపు సిక్సర్ల వర్షం, మరొకవైపు గ్యాలరీలో ధోనీ కూతురు జీవా చేసిన సందడి.. ఇలా చెన్నై సూపర్‌కింగ్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఈ దృశ్యాలు క్రికెట్ అభిమానులను ఎంతో అలరించాయి.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం చెన్నై-కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని భార్య సాక్షి, కూతురు జీవా హాజరయ్యారు. పసుపు రంగు దుస్తుల్లో కనిపించిన వీరిద్దరూ చెన్నై జట్టుకు మద్దతు తెలిపారు. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుక్ ఖాన్.. జీవాతో కలిసి సందడి చేస్తూ కనిపించాడు.

జీవాను దగ్గరకు తీసుకుని సెల్ఫీ దిగిన షారుక్
కోల్‌కతాపై చెన్నై గెలుపు అనంతరం సంబరాలు జరుపుకుంటున్న జీవాను దగ్గరకు తీసుకున్న షారుక్ సెల్ఫీ దిగాడు. ఈ ఇద్దరూ కలిసి మ్యాచ్‌లో ప్రధానాకర్షణగా నిలిచారు. కోల్‌కతా ఓటమి తర్వాత కూడా కూల్‌గా కనిపించిన షారుక్ జీవాతో ఆనందంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియలో వైరల్ అయింది.

జీవాతో షారుక్ అల్లరి చూడండి
‘జీవాతో షారుక్ అల్లరి చూడండి, జీవాను చూసి షారుక్ చిన్నపిల్లాడిలా మారిపోయాడు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గత ఆదివారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌కి షారుక్ తన కుటుంబసభ్యులతో కలిసి హాజరైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కూతురు సుహానాతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అభిమానుల అంచనాలను అందుకున్న చెన్నై
రెండేళ్ల తర్వాత సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడిన చెన్నై అభిమానుల అంచనాలను అందుకుంది. పునరాగమనంలోనూ తమకు తిరుగులేదని ఘనంగా చాటి చెప్పింది. చెపాక్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.

సామ్ బిల్లింగ్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
కోల్‌కతా నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. సామ్ బిల్లింగ్స్(23 బంతుల్లో 56, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), వాట్సన్(19 బంతుల్లో 42, 3 ఫోర్లు, 3సిక్స్‌లు) చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించారు. హాఫ్ సెంచరీతో రాణించిన సామ్ బిల్లింగ్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications