జట్టుతో కలిసి చిందేస్తున్న షారూఖ్, ఫన్ టైం విత్ బాస్ అంటూ కామెంట్లు

Posted By:
IPL 2018: KKR star Andre Russell dances with Shah Rukh Khan Watch

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించి ఆడాడు ఆండ్రీ రస్సెల్. ముందుగా బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ జట్టు సిక్సర్లతో హోరెత్తించి చెన్నై ముందు భారీ టార్గెట్‌నే ఉంచింది. సిక్సర్లతో మెరిసిపోయిన రస్సెల్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు.. జట్టు స్కోరును పరిగెత్తించడంలో వేగం చూపించాడు.

అయితే ఆ మ్యాచ్ అనంతరం, బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చమ్మక్ చల్లో పాటుకు సంబంధించి ఇంతకీ వీరు ఏ పాటకు స్టెప్పులేశారో తెలుసా.. షారుక్‌ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన 'రావన్‌‌' సినిమాలోని 'చమ్మక్‌ చల్లో' పాటకు.

Fun time with the boss himself! #SRK

A post shared by Andre Russell (@ar12russell) on Apr 10, 2018 at 5:12pm PDT

ఈడెన్‌గార్డెన్స్‌, చెపాక్‌ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆడిన మ్యాచ్‌లకు ఆ జట్టు సహ యజమాని షారుక్‌ఖాన్‌ హాజరై ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నాడు. మ్యాచ్‌కి ముందు, తర్వాత ఆటగాళ్లతో కలిసి తన విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. ఈ సందర్భంగా కోల్‌కతా ఆటగాడు రసెల్‌, సునీల్‌ నరైన్‌, శుభ్‌మన్‌ గిల్‌, కమలేశ్‌ నాగర్‌ కోటితో కలిసి షారుక్‌ ఖాన్‌ స్టెప్పులేశాడు.

ఈ వీడియోను రసెల్‌ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'ఫన్‌ టైం విత్‌ ద బాస్‌' అని క్యాప్షన్‌ ఇచ్చాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రసెల్‌ 36 బంతుల్లో 88 పరుగులు సాధించి కోల్‌కతాకు భారీ స్కోరు అందించాడు. ఆ తర్వాత చెన్నై ఆటగాడు బిల్లింగ్స్‌ కూడా అద్భుత ఇన్నింగ్స్‌ ఆటడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. టోర్నీలో భాగంగా కోల్‌కతా తన తదుపరి మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆడనుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, April 12, 2018, 14:37 [IST]
Other articles published on Apr 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి