
హైదరాబాద్: కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు గౌతమ్ గంభీర్‌ను తమ దగ్గర ఉంచుకోకుండా వేలానికి వదిలేసింది. పోనీ వేలంలో అయినా దక్కించుకుంటుందేమో అనుకుంటే అదీ లేదు. దానికి ఓ బలమైన కారణం ఉందంట. ఆ విషయాన్ని నైట్ రైడర్స్ జట్టు సీఈఓ వెల్లడించాడు.
ఐపీఎల్ పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
జనవరి 27వ తేదీ ఐపీఎల్ వేలంలో మొదటి రోజు సందర్భంగా గంభీర్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 2.8 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంలో అతని ఎంపిక అనంతరం నైట్ రైడర్స్ జట్టు సీఈఓ గంభీర్‌ను తీసుకోకపోవడంపై స్పందించాడు. తిరిగి జట్టులోకి తీసుకుంటామని అడిగితే వద్దని గంభీర్ సమాదానమిచ్చినట్లు పేర్కొన్నాడు.
'రిటెన్షన్ జాబితాలో గంభీర్‌ను ఉంచుకోకుండా వేలానికి వదిలేశాం. ఆ తర్వాత గౌతం గంభీర్ ను సంప్రదించినపుడు మళ్లీ తీసుకుంటాం. అని చెప్పినప్పుడు అతను ఒప్పుకోలేదు. ఇదీ ఒక ఛాలెంజ్ లాంటిది అంటూ బదులిచ్చాడు. అతను నైట్ రైడర్స్ జట్టుతో పాటు ఏడేళ్ల పాటు ఉన్నాడు. రెండు టైటిళ్లను గెలుచుకోవడానికి కూడా ఆయనే కారణం' అని సీఈఓ పేర్కొన్నాడు.
ఇంతకుముందే ఈ విషయంపై స్పందించిన గంభీర్. 'నన్ను రిటెన్షన్ జాబితాలో నుంచి తీసేయడానికి నైట్ రైడర్స్ జట్టు బలమైన కారణాలు చెప్పింది. వాటికి నేనొప్పుకుంటాను. ఇన్ని సంవత్సరాల పాటు నైట్ రైడర్స్ జట్టుతో సంబంధం కలిగి ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. జీవితంలో ప్రతి విషయం ఓ ఛాలెంజింగ్ తీసుకుంటా. నేను ఏ జట్టు తరపున ఆడడానికైనా సిద్ధంగానే ఉన్నాను' అని వ్యాఖ్యానించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.