న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిగిలిన జట్లు ఓడితేనే.. పంజాబ్ గెలుస్తుంది

 IPL 2018: Kings XI Punjab Isnt a Champion Side, Says Skipper R Ashwin

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌ను కింగ్స్‌ ఎలెవన పంజాబ్‌ వరుస విజయాలతో ఆరంభించింది. ఆల్‌రౌండర్ల ప్రతిభతో పరుగులు కాస్తో కూస్తో బాగానే తీస్తూ.. బౌలింగ్ విభాగం కాస్త ఇబ్బందికరంగా కనిపించినా నెట్టుకొచ్చేసింది. ఇలా ఐపీఎల్‌ ప్రథమార్థంలో బాగా రాణించింది అన్ని జట్ల కంటే దూకుడుగా కనిపించిన అశ్విన్‌ సేన... ద్వితీయార్థంలో చతికిల పడింది. పట్టికలో 12 పాయింట్లతో మూడో స్థానంలో ఆత్మవిశ్వాసంతో నిలిచింది.

ప్లేఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం:

ప్లేఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం:

కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌గేల్‌ మెరుపులతో తొలి 6 మ్యాచుల్లో ఐదు గెలిచిన పంజాబ్‌‌కు అప్పట్లో కాలం బాగానే కలిసొచ్చింది. తర్వాతి ఆరు మ్యాచుల్లో ఐదు ఓడటంతో వరుస వైఫల్యాలు చుట్టుముట్టాయి. పంజాబ్‌ ప్లేఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి ప్లేఆఫ్‌ చేరుకుంటుందా లేదా అనే సందేహంలో పడిపోయింది.

ముంబై ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడే అవకాశం

ముంబై ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడే అవకాశం

88 పరుగులు చేసి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిన పంజాబ్‌కు ఇకపై పక్క జట్ల ఓటములపైనే ఆశలతో గడపాల్సిందే. లీగ్‌ దశలో పంజాబ్‌ మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇవి రెండూ ఇతర జట్ల హోం గ్రౌండ్స్‌లోనే జరగనుండటం గమనార్హం. వాంఖడేలో మే 16న ముంబైతో ఆడనుంది. ఇప్పటికే ఓటములతో ప్లేఆఫ్‌ అవకాశాలు లేని ముంబై ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌లో గెలిస్తే 14 పాయింట్లతో ముందంజ

ఈ మ్యాచ్‌లో గెలిస్తే 14 పాయింట్లతో ముందంజ

పంజాబ్‌ ఈ మ్యాచ్‌లో గెలిస్తే 14 పాయింట్లతో ముందంజ వేస్తుంది. ఆ తర్వాత చెన్నైపై గెలిస్తే 16 పాయింట్లతో ఎవరిపైనా ఆధార పడకుండా ప్లేఆఫ్‌ చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒక దాంట్లో గెలిచి మరోటి ఓడితే మాత్రం నెట్‌రన్‌రేట్‌ పాజిటివ్‌గా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పంజాబ్‌ నెట్‌రన్‌రేట్‌ పెరిగే అవకాశాలు కనిపించడం లేదు.

మిడిలార్డర్‌లో ఒక్కరూ రాణించే పరిస్థితి లేదు:

మిడిలార్డర్‌లో ఒక్కరూ రాణించే పరిస్థితి లేదు:

బెంగళూరు చేతిలో ఓటమితో -0.056 ఉన్న రన్‌రేట్‌ -0.518కి మారింది. ఓపెనర్లు రాహుల్‌, గేల్‌ ఔటైతే మిడిలార్డర్‌లో ఒక్కరూ రాణించే పరిస్థితి లేదు. అంటే పంజాబ్‌ ఆశలన్నీ ఇక ముంబయి, రాజస్థాన్‌, కోల్‌కతా ఓటములపైనే ఆధారపడి ఉన్నాయి. తమంత తాముగా గొప్ప పోటీ ఇచ్చేలా వారి ఆట లేదని విశ్లేషకుల అభిప్రాయం!!

Story first published: Tuesday, May 15, 2018, 18:38 [IST]
Other articles published on May 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X