న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్క మాటలో కోహ్లీ గురించి తేల్చేసిన ప్రీతి జింతా

IPL 2018: Kings XI Punjab Co-Owner Preity Zinta Defines Virat Kohli In One Word

హైదరాబాద్: ఐపీఎల్ ఆరంభం నుంచి ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తున్నారు ప్రీతి జింతా. వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో అత్యుత్సాహంగా కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ తర్వాత జట్టు విజయంలో టీ షర్టులు పంచి పెడుతూ.. సెహ్వాగ్‌పై చీవాట్లు విసిరారంటూ పలు రకాలుగా వార్తల్లో నిలిచారు. ప్లేఆఫ్ ఆశలు కోల్పోయిన పంజాబ్ జట్టు సహ యజమానురాలిగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కోహ్లీ ప్రస్తావన రావడంతో టీమిండియా కెప్టెన్, బెంగళూరు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ గురించి ప్రస్తావించారు.

కోహ్లీ గురించి చెప్పాలంటే.. 'హీ ఈజ్ అవ్‌స్సమ్' అతనొక అద్భుతం అని పేర్కొన్నారు. ఇదే మ్యాచ్‌లో ఆమె ముంబై ఓడిపోయిందంటూ వార్త వినగానే ఉద్వేగానికి లోనైయ్యారు. సహ యజమానితో ముంబై ఇండియన్స్ అవుట్ అయిపోయిందట. ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది. అంటూ అనడం అక్కడి కెమెరాల్లో రికార్డవడంతో ఆ వీడియో కాస్త జనాల్లోకి వైరల్‌గా మారింది.

ముంబై ఓడిపోవడం ప్రీతి జింతాకు భళే సరదాగా ఉందంటూ మీడియాలో వార్తలు రావడంతో చెడుగా జరుగుతోన్న ప్రచారానికి ఆమె స్పందించారు. ప్లేఆఫ్ రేసుకు వెళ్లేందుకు మాత్రమే ఆ జట్టు ఓడిపోవాలని కోరుకున్నాను కానీ, ఆ జట్టుపై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆ సందర్భంలో ముంబై తప్పుకుంటే పంజాబ్ రేసులో ముందుకెళ్తుందనే ఆలోచించాను. వేరే ఉద్దేశం లేదని వెల్లడించారు. కానీ, చెన్నైతో పోటీ పడిన పంజాబ్ చేతులెత్తేయడంతో ప్లేఆఫ్ ఆశలు నీరుగారిపోయాయి.

'ఆరు మ్యాచ్‌లకు ఐదు గెలిచి ఐపీఎల్ 11లో శుభారంభమే తీసుకున్నా.. మిగిలిన మ్యాచ్‌లలో పరాజయాన్ని చవిచూశాం. వైఫల్యాలతోనే ఈ సీజన్‌ను ముగించాల్సి వస్తోంది. అనుకున్న ఫలితాలను సాధించకపోయాం. అభిమానులను, శ్రేయాభిలాషులను క్షమాపణ కోరుకుంటున్నాను. వచ్చే ఏడాది మీకిలాంటి పరిస్థితి కలుగజేయమని మాటిస్తున్నా.'అంటూ ట్విట్టర్ ద్వారా అభిమానులకు సందేశం పంపింది.

Story first published: Tuesday, May 22, 2018, 14:58 [IST]
Other articles published on May 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X